దినేష్ తేజ్, దశ్విక .కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం. ‘తత్వం’. అర్జున్ కోల దర్శకత్వంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా అర్జున్ కోల మాట్లాడుతూ – ‘‘మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేసుకున్నాను.
వంశీగారి ‘అన్వేషణ’ సినిమా తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ఈ చిత్రంలోని ఓ ట్విస్ట్ ప్రేక్షకులకు షాకింగ్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మంచి ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా ఇది’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: చేతన్ భరద్వాజ్.


