breaking news
Dharman Movie
-
ఐటమ్ సాంగ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?
ప్రస్తుత ట్రెండింగ్ హీరోయిన్లలో కాయదు లోహర్ ఒకరు. తెలుగులో 'అల్లూరి' అనే మూవీ చేసినప్పటికీ.. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన చేసిన 'డ్రాగన్'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అలా తమిళ, తెలుగు, మలయాళంలో వరస సినిమాలు చేస్తూ మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఈమె లేటెస్ట్ మూవీస్ 'ఇమ్మోర్టల్', ఐ యామ్ గేమ్.. ఈ శుక్రవారమే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు రెడీ అవుతోందట.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?)రజనీకాంత్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ కంపల్సరీగా ఉంటోంది. 'జైలర్'లో తమన్నా చేసిన పాట సెన్సేషన్ హిట్ అయ్యింది. 'కూలీ'లో పూజా హెగ్డే చేసిన మోనికా కూడా సూపర్ హిట్ అయింది. 'జైలర్ 2'లోనూ పూర్ణ ప్రత్యేక పాటలో నర్తించింది. తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ 'ధర్మన్'. కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్లు. మరో కీలక పాత్రలో శ్రియ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ మూవీలోనే ఒక ప్రత్యేక పాటలో నర్తించేందుకు కాయదు లోహర్‌ని అప్రోచ్ అయ్యారట. త్వరలో ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'పళ్లబురుసు') -
రానా, నాగ్ అయిపోయింది.. ఇప్పుడు రామ్ టర్న్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో ఆసక్తి రేపుతోంది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో, కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ధర్మన్‌లో తెలుగు యువ హీరో రామ్ పోతినేని నటించబోతున్నాడు. అయితే ఇది నెట్టింట మరో రచ్చకు దారి తీసింది.రజనీకాంత్ అల్లుడిగా కనిపిస్తాడా? లేక విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా రాశీఖన్నా నటించనున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పటికే సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు రజనీ సినిమాలో రామ్ లాంటి తెలుగు స్టార్ నటించడంపై అభిమానుల్లోనూ భిన్నమైన చర్చ జరుగుతోంది.నాగ్ తర్వాత రామ్ వంతు?లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. నాగార్జున పోషించిన సైమన్ పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. నాగార్జున లాంటి స్టార్‌ను.. మరీ చీప్‌గా ప్రజెంట్ చేయడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత రజనీ ‘వెట్టైయాన్’ చిత్రంలో నటించిన రానాకు కూడా ప్లాపే పడింది.ఇప్పుడు అదే నేపథ్యంలో రామ్ పేరు తెరపైకి రావడంతో.. ‘రానా, నాగ్ తర్వాత ఇప్పుడు రామ్ వంతా?’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రజనీ సినిమాలో పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోతే మాత్రం అది రామ్ కెరీర్‌కు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది.పాపం.. రామ్రామ్ పోతినేనికి ఈ సినిమా కీలకంగా మారే అవకాశముంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆయనకు ఆ స్థాయిలో విజయం దక్కలేదు. వారియర్ పేరిట ద్విభాషా చిత్రం చేసినా ఆడలేదు. పైగా సంజయ్ దత్, ఉపేంద్ర వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసినా.. రామ్ కెరీర్‌కు మాత్రం పెద్దగా బూస్ట్ రాలేదు. దీంతో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం రావడం ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయం ఒకవైపు ఉంది. రజనీ సినిమాకు ఉన్న క్రేజ్, పాన్ ఇండియా మార్కెట్ దృష్ట్యా రామ్‌కు కొత్త ప్రేక్షకులను చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. తేడా కొడితే పరిస్థితి ఏంటన్నదానిపైనా జోరుగా చర్చ నడుస్తోంది.రజనీకీ అంతే..మరోవైపు రజనీకాంత్ కెరీర్లోనూ ప్రతి సినిమా ఇప్పుడు కీలకమే. ‘జైలర్’కు ముందు, కూలీ కూడా ఆశించిన స్థాయిలో చిత్రాలేవీ ఆడలేదు. రెమ్యునరేషన్ ఆకాశాన్ని అంటుతూ.. కలెక్షన్లు రాక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రజనీ తదుపరి చిత్రాలు(జైలర్-2, ధర్మన్ చిత్రాలు) కచ్చితంగా హిట్లు కావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తమిళంలో నటించడం.. ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు మన దగ్గరా చర్చకు దారి తీసింది. -
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?
శ్రీలీల.. ఈ తార కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డాన్స్‌కి, యాక్టింగ్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. వరుస అవకాశాలు అందుకుంటున్నా.. విజయాలు మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాయి. అంతేకాదు.. మధ్యలో తప్పుకున్న లెనిన్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో శ్రీలీలకు ఏదీ కలిసి రావడం లేదని అభిమానులు నిరాశపడుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీలీలకు ఓ భారీ అవకాశం దక్కిందనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా మారుతున్న ఈ హీరోయిన్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో చోటు దక్కిందని టాక్ . ఇంతకీ శ్రీలీలకు అవకాశం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన 173వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ధర్మాన్' సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో శ్రీలీల మరోసారి విజయాల బాట పడుతుందో లేదో చూడాలి మరి. -
రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్లో సిమ్రాన్ (ఫొటోలు)
-
‘ధర్మన్’ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్.. కొత్త సినిమాపై హైప్ పెంచిన రజనీకాంత్
కమల్‌హాసన్, రజనీకాంత్లది సుమారు 50 ఏళ్ల స్నేహ బంధం. కెరీర్ ఆరంభించిన కొత్తలో వీరిద్దరూ కలిసి 10 చిత్రాలకు పైగా నటించారు. అలాంటిది ఇప్పుడు కమల్‌హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంట ర్నేషనల్పై నిర్మిస్తున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండటం విశేషం. బుధవారం ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలోని కమల్‌హాసన్ కార్యాలయంలో జరిగింది. ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, రజనీకాంత్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో... ఈ చిత్రానికి ముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారనే వార్త వచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్‌గా సుందర్ .సీని ఖరారు చేశారు. అయితే ఈ చిత్రం నుంచి సుందర్ తప్పుకున్నారు. దాంతో దర్శకుడిగా శిబి చక్రవర్తి పేరు వినిపించింది. చివరికి యువ దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరును ఖరారు చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్ తన సంస్థలో సినిమా చేయాలని కోరారు. అయితే కథ వినను అన్నారు. నన్నే ఎంపిక చేసుకోమని భారమంతా నాపై పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కథ ఎంపికలో మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పడంతో విన్నారు. ఆ తర్వాత ఈ కథను ఓకే చేశాం. ఇది 5 రూపాయల వైద్యుడి ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం కాదు. స్వొగ్ అనే వైద్యుడి ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇందులో నేను న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే సైంటిస్ట్‌గా కనిపిస్తాను. ఆఫ్గనిస్థాన్, రష్యాలో షూటింగ్ ప్లాన్ చేశాం. ఇది తీయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చివరకు అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు’ అని చెప్పారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నేను, రజనీకాంత్ సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత ఆ కల నిజమవుతోంది. మా సంస్థలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండటం సంతోషంగా ఉంది. దర్శకుడు అశ్వద్ మారిముత్తు, సంగీత దర్శకుడు అనిరుధ్‌తో పాటు మొత్తం టీమ్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు. అశ్వద్ మారిముత్తు మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటారు. ఆ చాన్స్ నాకు రావడం హ్యాపీగా ఉంది. రజనీకాంత్‌గారు నటించిన ‘పడయప్పన్’, కమల్‌హాసన్‌గారు నటించిన ‘వేట్టైయాడు విలైయాడు’ చిత్రాల తరహాలో ‘ధర్మన్’ ఉంటుంది’’ అని తెలిపారు. -
డెడ్లీ డాక్టర్‌గా రజనీకాంత్.. చాలా సెన్సిటివ్ స్టోరీ
గతేడాది 'కూలీ'గా వచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2' చేస్తున్నారు. కమల్ హాసన్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయాల్సి ఉంది. మరోవైపు కమల్ నిర్మాణంలో ఓ మూవీలోనూ నటిస్తున్నారు. తాజాగా ఆ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇందులో డెడ్లీ డాక్టర్‌గా రజనీ కనిపించబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తమిళంలో 'ఓ మై కడవులే', 'డ్రాగన్'.. తెలుగులో 'ఓరి దేవుడా' సినిమాలు తీసిన అశ్వత్ మారిముత్తు.. రజనీకాంత్ 173వ మూవీ 'ధర్మన్' తెరకెక్కిస్తున్నాడు. ఇదో థ్రిల్లర్ జానర్ స్టోరీ. రేపటి(జూన్ 25) నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు అశ్వత్ వెల్లడించారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. బహుశా దీన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయొచ్చు.ఇకపోతే ఈ మూవీ దర్శకుల మార్పు గురించి మాట్లాడిన రజనీకాంత్.. తొలుత కేఎస్ రవికుమార్ అనుకున్నాం. తర్వాత సుందర్.సి వచ్చాడు. కానీ అతడికి ఉన్న వేరే కమిట్మెంట్ వల్ల తప్పుకొన్నాడు. అనంతరం శిబి చక్రవర్తి ప్రాజెక్టులోకి వచ్చి వెళ్లాడు. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇందులో నేను న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే సైంటిస్ట్‌గా కనిపిస్తాను. ఆఫ్గనిస్థాన్, రష్యాలో షూటింగ్ ప్లాన్ చేశాం. ఇది తీయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చివరకు అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు అని చెప్పారు.(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)Superstar #Rajinikanth clarifies about Director changes:• Ashwath is the 4th director for this film.. We fixed KSRavikumar initially.. It didn't work out.. Then SundarC.. He had other commitment.. it got delayed.. He said he's stepping out..• Then cibi chakravarthy.. The… pic.twitter.com/CC3D3OITJO— Laxmi Kanth (@iammoviebuff007) June 24, 2026


