డెడ్లీ డాక్టర్‌గా రజనీకాంత్.. చాలా సెన్సిటివ్ స్టోరీ | Rajinikanth Dharman Movie First Look And Details | Sakshi
Sakshi News home page

Dharman Movie: నలుగురు డైరెక్టర్స్ మారారు.. ఎట్టకేలకు ఫస్ట్ లుక్

Jun 24 2026 10:58 AM | Updated on Jun 24 2026 11:34 AM

Rajinikanth Dharman Movie First Look And Details

గతేడాది 'కూలీ'గా వచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2' చేస్తున్నారు. కమల్ హాసన్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయాల్సి ఉంది. మరోవైపు కమల్ నిర్మాణంలో ఓ మూవీలోనూ నటిస్తున్నారు. తాజాగా ఆ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇందులో డెడ్లీ డాక్టర్‌గా రజనీ కనిపించబోతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

తమిళంలో 'ఓ మై కడవులే', 'డ్రాగన్'.. తెలుగులో 'ఓరి దేవుడా' సినిమాలు తీసిన అశ్వత్ మారిముత్తు.. రజనీకాంత్ 173వ మూవీ 'ధర్మన్' తెరకెక్కిస్తున్నాడు. ఇదో థ్రిల్లర్ జానర్ స్టోరీ. రేపటి(జూన్ 25) నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు అశ్వత్ వెల్లడించారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. బహుశా దీన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయొచ్చు.

ఇకపోతే ఈ మూవీ దర్శకుల మార్పు గురించి మాట్లాడిన రజనీకాంత్.. తొలుత కేఎస్ రవికుమార్ అనుకున్నాం. తర్వాత సుందర్.సి వచ్చాడు. కానీ అతడికి ఉన్న వేరే కమిట్మెంట్ వల్ల తప్పుకొన్నాడు. అనంతరం శిబి చక్రవర్తి ప్రాజెక్టులోకి వచ్చి వెళ్లాడు. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇందులో నేను న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే సైంటిస్ట్‌గా కనిపిస్తాను. ఆఫ్గనిస్థాన్, రష్యాలో షూటింగ్ ప్లాన్ చేశాం. ఇది తీయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చివరకు అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు అని చెప్పారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement