గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సమంత 'మా ఇంటి బంగారం'కి ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రన్ దాదాపు చివరకొచ్చేసిందని చెప్పొచ్చు. ఇకపోతే హైదరాబాద్‌లోని మంగళవారం సాయంత్రం మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ పేరిట సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చిరు-చరణ్ మధ్య క్యూట్ మూమెంట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చరణ్‌ని చిరంజీవి 'న్యూ ఏజ్ మెగాస్టార్' అనడం ఆసక్తికరంగా అనిపించింది. అయితే ఓ విషయం మాత్రం సందేహంగానే ఉండపోయింది.
(ఇదీ చదవండి: ఓవైపు విడాకులు కేసు.. హీరో ఇంట్లో చోరీ)
సినిమా సక్సెస్ మీట్ అన్నప్పుడు మూవీ టీమ్ దాదాపుగా హాజరవుతూ ఉంటుంది. కానీ 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో మాత్రం రామ్ చరణ్ తప్పితే వేరే నటీనటులు ఎవరూ కనిపించలేదు. అభ్యంతరకర సీన్ల కారణంగా జాన్వీ కపూర్‌పై ఎంతలా విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో జాన్వీ మూవీ టీమ్‌పై ఇంకా కోపంగా ఉందనే రూమర్స్ అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు ఈవెంట్‌కి కూడా జాన్వీ రాలేదు. దీంతో ఈ డౌట్స్ నిజమేనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
సరే జాన్వీ అంటే ట్రోల్స్ కారణంగా రాలేదు అనుకోవచ్చు. కీలక పాత్రలు చేసిన శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కూడా ఈ సక్సెస్ మీట్‌కి రాలేదు. మూవీ టీమ్ వీళ్లని పిలవలేదా? లేదంటే షూటింగ్స్ కారణంగా వాళ్లే హాజరు కాలేకపోయారా అనేది తెలియాలి. ఇప్పుడీ విషయమే సోషల్ మీడియాలో డిస్కషన్‌కి కారణమైంది. 'పెద్ది' చిత్రానికి తెలుగులో తప్పితే మరెక్కడ కలెక్షన్స్ సరిగా రాలేదు. ఓవర్సీస్‌లోనూ అనుకున్న దానికంటే చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా చూసుకుంటే రూ.400-450 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో: రష్మిక)


