ఓవైపు విడాకులు కేసు.. హీరో ఇంట్లో చోరీ | Tamil Actor Ravi Mohan Alias Jayam Ravi Reports Theft At His Residence, Police Launch Investigation | Sakshi
Sakshi News home page

Jayam Ravi: హీరో ఇంట్లో దొంగతనం.. ఎవరు చేశారు?

Jun 24 2026 8:50 AM | Updated on Jun 24 2026 9:13 AM

Tamil Actor Ravi Mohan Alias Jayam Ravi House Theft

తమిళ ప్రముఖ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటీవలే దర్శకుడు, నిర్మాతగా మారిన ఈయన.. రవి మోహన్ స్టూడియోస్ పతాకంపై యోగి బాబు హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. తానే హీరోగా మరో సినిమా తీస్తున్నాడు.

(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్)

మరోవైపు తన భార్య ఆర్తితో మనస్పర్థల కారణంగా విడాకులు కోరుతూ కొన్నాళ్ల క్రితం రవి మోహన్ కోర్టుకి వెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరో ఇంట్లో చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

తన ఇంట్లో దొంగతనం జరిగిందని.. నీలాంగరై పోలీస్ స్టేషన్‌లో రవి మోహన్ ఫిర్యాదు చేశాడు. అందుకు తగిన ఆధారాలు కూడా ఫిర్యాదులో పొందుపరిచాడు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని తనతో చెప్పినట్లు రవి మోహన్.. మీడియాకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ 'పాప్‌కార్న్' కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు!)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement