యశ్ టాక్సిక్.. ఆ రూల్‌కు నయనతార బ్రేక్ | Nayanthara Breaks Her No-Promotions Rule For Yash’s Toxic, Says The Film Is Very Special To Her, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Nayanthara: యశ్ టాక్సిక్.. ఆ రూల్‌కు నయనతార బ్రేక్

Aug 9 2026 11:09 AM | Updated on Aug 9 2026 1:07 PM

Nayanthara on breaking her rule for yash Toxic Movie here is why

కన్నడ హీరో యశ్ నటిస్తోన్న యాక్షన్‌ మూవీ టాక్సిక్ ట్రైలర్ రిలీజైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌ కాగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ చూస్తుంటే వయొలెన్స్‌తో పాటు బోల్డ్‌ కంటెంట్‌ను తలపిస్తోంది.

అయితే ఈ మూవీ సంగతి పక్కనపెడితే.. నయనతార చేసిన పనికి సినీ ప్రియులు షాకవుతున్నారు. గతంలో ఏ మూవీకి కూడా ప్రమోషన్స్ చేయడం నాకు ఇష్టముండదని ప్రకటించింది. అందుకే తాను ప్రమోషన్స్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటానని తెలిపింది. అలా చెప్పిన నయన్.. మూవీ ప్రమోషన్స్‌కు హాజరు కావడం అభిమానులను, నెటిజన్లను షాకింగ్‌కు గురి చేస్తోంది. బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కు నయనతార రావడంపై సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. తాను టాక్సిక్‌ ఈవెంట్‌కు హాజరు కావడంపై కోలీవుడ్ భామ క్లారిటీ ఇచ్చింది.

నయనతార మాట్లాడుతూ.. 'సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం నాకు ఇష్టం లేదని కాదు. నాకు వాటిలో అంతగా నైపుణ్యం లేదు. అందుకే నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. కానీ చాలా కొన్ని కారణాల వల్ల ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే యశ్ కారణం. అతను కేవలం ఒక ఫోన్ కాల్ చేశాడు. నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దీనికి చాలా కారణాలున్నాయి.' అని అన్నారు. కాగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement