వైరల్‌ అవుతున్న తండ్రి–కూతురు బంధం.. | Viral Wedding Story Of A Blind Father And His Daughter | Sakshi
Sakshi News home page

వైరల్‌ అవుతున్న తండ్రి–కూతురు బంధం..

Jul 30 2026 10:00 AM | Updated on Jul 30 2026 10:31 AM

Viral Wedding Story Of A Blind Father And His Daughter

ఫొటోస్టోరీ

అదొక పెళ్లి సందడి.. అతిథులు, బంధువుల హడావుడితో హాలంతా నిండిపోయింది. పెళ్లికూతురిలా షనాన్‌ లూయిస్‌ ముస్తాబవుతోంది. అమెరికాలో పెళ్లికూతురుగా ముస్తాబయిన అమ్మాయిలను మొదటిసారి వాళ్ల నాన్నలే చూసి మురిసిపోతారు. ఈ పద్ధతిని అక్కడ ఫస్ట్‌ లుక్‌ అని పిలుస్తారు.

పక్క రూమ్‌లో లూయిస్‌ వాళ్ల నాన్న గ్యారీ మెక్‌అఫే కూడా ఎప్పుడెప్పుడు కూతురు తన ముందుకొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. అలంకరణ పూర్తయిన తర్వాత లూయిస్‌ తన తల్లితో పాటు గ్యారీ వద్దకు వచ్చింది. తండ్రి చేతులను తీసుకుని తన వెడ్డింగ్‌ గౌనును స్పృశింపజేసి డిజైన్‌ ఎలా ఉందని అడిగింది. గ్యారీకి మాటల్లేవు. తర్వాత లూయిస్‌ శిరోజాలను, తన ఆభరణాలను తాకుతూ బాగుందని గ్యారీ చెబుతుండగా, లూయిస్‌ ‘మీ పెళ్లికి అమ్మ వేసుకున్న గౌన్‌ డిజైన్‌లానే నా గౌన్‌ని కూడా డిజైన్‌ చేయించా నాన్న’ అంటూ చెప్పింది.

మరి చెప్పాలి కదా.. కన్నరోజు నుంచి కంటిరెప్పలా కాపాడుకుంటున్న ఆ తండ్రికిప్పుడు చూపు లేదు మరి..! లూయిస్‌ హైస్కూల్‌లో చదువుతున్న రోజుల్లో గ్యారీ ప్రమాదవశాత్తు చూపు కోల్పోయాడు. పోయింది చూపే కానీ ప్రేమ కాదు కదా! అందుకే. తన చేతుల్లో పెరిగిన బిడ్డను కళ్లారా చూడలేకపోయినా మనసారా స్పృశిస్తూ కళ్లనిండా ఆనంద బాష్పాలు నింపుకున్నాడు ఆ తండ్రి. వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించిన ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement