ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Breakfast Movie Released In OTT, Check Out Telugu Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Breakfast OTT: మోడ్రన్ రిలేషన్‌షిప్స్ గురించి మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్

Jun 24 2026 10:39 AM | Updated on Jun 24 2026 12:04 PM

Breakfast Movie OTT Telugu Streaming Now

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా అవతార్ 3, బ్లాస్ట్ తదితర చిత్రాలు రాబోతున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ రొమాంటిక్ ‍డ్రామా మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో: రష్మిక)

‍'బ్రేక్ ఫాస్ట్' తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా. రానవ్, రోస్మిన్, కృతిక్ మోహన్, అమిత రంగనాథ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలు, మనస్పర్థలు జీవితాలని ఎలా నాశనం చేస్తాయనే విషయాన్ని ఇందులో చూపించారు.

'బ్రేక్ ఫాస్ట్' విషయానికొస్తే.. లక్ష్మి, ఆమె భర్త (కృతిక్ మోహన్) పెళ్లయిన కొన్ని నెలలకే మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. న్యాయస్థానం వీళ్లని కౌన్సిలర్ (కస్తూరి) దగ్గరకు పంపిస్తుంది. అక్కడ కూడా వీరిద్దరూ విపరీతంగా గొడవ పడుతుంటారు. ఇది చూసిన కౌన్సిలర్.. వీరి కళ్ళు తెరిపించడం కోసం గతంలో ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ల స్టోరీ చెబుతుంది. అందులో శంతను (రానవ్) అనే యువకుడు జానవి(రోస్మిన్)ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే జానవి తన తండ్రి (సంపత్ రాజ్) కంపెనీలో ప్రియుడిని చేర్చుతుంది.

తన ప్రేమ ఇష్టం లేని తండ్రిని జానవి జైలుకి పంపిస్తుంది. శంతనుని పెళ్లి చేసుకుంటుంది. మొదట్లో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొద్దిరోజులకే గొడవలు, శారీరక హింస వస్తాయి. ఒక బాబు పుట్టినప్పటికీ రిలేషన్ మరింత దారుణంగా తయారవుతుంది. ఇంతకీ కౌన్సిలర్ చెప్పిన ఆ పాత జంట కథకు, ప్రస్తుతం విడాకులకు సిద్ధమైన లక్ష్మి దంపతులకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement