'ఎల్లమ్మ'లో దేవిశ్రీ ప్రసాద్.. మొత్తం మార్చేశారు | Yellamma Movie Devi Sri Prasad First Look | Sakshi
Sakshi News home page

Yellamma Movie: 'ఎల్లమ్మ' అప్‌డేట్.. దేవి వింటేజ్ ఫస్ట్ లుక్

Aug 2 2026 4:56 PM | Updated on Aug 2 2026 5:31 PM

Yellamma Movie Devi Sri Prasad First Look

'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'ఎల్లమ్మ'. ఎప్పటినుంచో సెట్స్ మీద ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టుతో హీరోగా పరిచయమవుతున్నాడు. కొన్నాళ్ల క్రితం గ్లింప్స్ లాంటి వీడియో రిలీజ్ చేశారు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు మరో అప్‌డేట్ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: పూజా హెగ్డే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి?)

దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో పార్సి అనే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. క్లీన్ షేవ్ చేసిన లుక్‌లో దేవి డిఫరెంట్‌గా ఉన్నాడు. చెప్పాలంటే బయట కనిపించేదానికి సినిమాలో కనిపించే దానికి మొత్తానికి మార్చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత కాగా హీరోయిన్ ఎవరు? మిగతా నటీనటులు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు. రిలీజ్ ఎప్పుడనేది కూడా ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్.

(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement