అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే మెసేజ్ | Allu Arjun Friendship Day Message | Sakshi
Sakshi News home page

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే మెసేజ్

Aug 2 2026 2:29 PM | Updated on Aug 2 2026 3:27 PM

Allu Arjun Friendship Day Message

సినిమా రంగంలో విజయం, చుట్టూ ఉన్న చాలా విషయాలని మార్చేస్తుంది. కెరీర్‌లు, బంధాలు మారిపోతాయి. స్నేహాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నిజమైన విజయం అంటే కేవలం అత్యుతన్న స్థానాన్ని చేరుకోవడం మాత్రమే కాదని.. మనవాళ్లను కూడా మనతో పాటు తీసుకెళ్లడమే అని గుర్తుచేసే వారుంటారు. అలాంటి వ్య‌క్తే అల్లు అర్జున్‌.

కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'AA23' చిత్రాన్ని ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీకి  మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్‌కు సన్నిహితమైన నలుగురు స్నేహితులు సహ నిర్మాతలుగా మారారు. ఇది స్నేహానికి ఇచ్చిన ఒక బలమైన సందేశం. వీరిలో బన్నీ వాస్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ జీవితంలోనూ, కెరీర్‌లోనూ ఎన్నో దశల్లో అతని పక్కన నిలిచిన స్నేహితుడాయ‌న‌. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో ఆయన స్కూల్ డేస్‌లో స్నేహితులైన సందీప్ రామినేని, నటరాజ్ కూడా చేరారు. వీరితో పాటు అతని కజిన్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా భాగమయ్యారు.

అల్లు అర్జున్ ఇలా చేయ‌టం ఇదేం మొద‌టిసారి కాదు. పుష్ప ది రైజ్ సినిమా సమయంలో త‌న మావ‌య్య‌కు చెందిన సంస్థ ముత్తంశెట్టి మీడియా చిత్ర నిర్మాణంలో భాగమైంది. బ‌న్నీ స్నేహితులైన ఎస్‌కెఎన్‌, శ‌ర‌త్‌లు ఇప్ప‌టికే స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌లుగా రాణిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement