మరో కొత్త లుక్‌లో..? | Allu Arjun New Look in Raka Movie | Sakshi
Sakshi News home page

మరో కొత్త లుక్‌లో..?

Aug 2 2026 3:05 AM | Updated on Aug 2 2026 3:05 AM

Allu Arjun New Look in Raka Movie

‘పుష్ప:ది రైజ్, పుష్ప: ది రూల్‌’ సినిమాల్లో న్యూ లుక్‌లో ఆశ్చర్యపరిచారు హీరో అల్లు అర్జున్‌. ఆయన తాజా చిత్రం ‘రాకా’ లుక్‌ కూడా ఆశ్చర్యపరిచేలా ఉంది. కథ డిమాండ్‌ మేరకు ఇలా కొత్తగా కనిపించాలని అల్లు అర్జున్‌ ఫిక్స్‌ అయినట్లున్నారు ‘రాకా’ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా ‘ఏఏ23 ’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారని టాక్‌.  ప్రస్తుతం అల్లు అర్జున్‌ లుక్‌ను ఫైనలైజ్‌ చేసే పనిలో ఉన్నారట లోకేష్‌. ఇటీవల ముంబైలో లుక్‌ టెస్ట్‌ కూడా జరిగింది. కానీ ఫైనల్‌ లుక్‌ ఖరారు లేదట. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. ఇందుకోసం అల్లు అర్జున్‌ ఫిజికల్‌గా పూర్తిగా మేకోవర్‌ అవ్వాల్సి ఉందట. ‘రాకా’ సినిమాలో తన  పాత్ర చిత్రీకరణ పూర్తయిన వెంటనే ‘ఏఏ 23’ మేకోవర్‌ కోసం అల్లు అర్జున్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తారని సమాచారం. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement