హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే'. జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.60.60 కోట్ల నెట్.. రూ.72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.
రెండో రోజు కూడా స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే వసూళ్లు హవా కొనసాగింది. ఇండియావ్యాప్తంగా 16,902 షోల ద్వారా రూ.49.35 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్‌లో ఈ మూవీ రూ.131.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నెట్ కలెక్షన్ల విషయానికొస్తే రూ.109.95 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే సుమారు 167 నుంచి 173 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బద్దలు కొడుతోంది. తొలిరోజు వసూళ్లతో జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్’(రూ.40కోట్లు), రూసో బ్రదర్స్ అవెంజర్స్: ఎండ్‌గేమ్ (రూ.53కోట్లు) రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి భారత్‌లో రూ.200 కోట్ల మార్కును దాటుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టామ్ హాలండ్‌తో పాటు జెండాయా, జాకబ్ బాటలాన్, సేడీ సింక్, జాన్ బెర్న్‌తాల్, ట్రామెల్ టిల్మాన్ కీలక పాత్రలు పోషించారు.
A brand new milestone 💯#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio. pic.twitter.com/1RB5dLBe6I
— Sony Pictures India (@SonyPicsIndia) August 1, 2026


