breaking news
Spider Man: Brand New Day
-
స్పైడర్ మ్యాన్.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం..!
హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియాలోనూ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూలై 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇండియన్ బాక్సాపీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా స్పైడర్ మ్యాన్ నిలిచింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లేటెస్ట్ చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండయా ప్రధాన పాత్రలు చేశారు. ఇండియాలో తొలి వీకెండ్ ముగిసేసరికి రూ.309 కోట్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. A historic 500 Cr milestone, made possible by you ❤️🕷️#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio! pic.twitter.com/ihXdQFB2po— Sony Pictures India (@SonyPicsIndia) August 10, 2026 -
ఇండియన్ బాక్సాఫీస్‌పై ‘హాలీవుడ్’ దండయాత్ర..రికార్డు కలెక్షన్స్
ఒకప్పుడు భారతీయ బాక్సాఫీస్‌లో హాలీవుడ్ సినిమాలు ప్రధానంగా మెట్రో నగరాలు, మల్టీప్లెక్స్‌లకే పరిమితమయ్యేవి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూపర్ హీరో చిత్రాలు, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్లు, సర్వైవల్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు.. ఇలా విభిన్న కథలతో వస్తున్న హాలీవుడ్ సినిమాలను భారతీయ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తున్నారు. ఫలితంగా దేశీయ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ చిత్రాలు కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026లో ఈ ట్రెండ్ మరింత బలపడింది. 'మైఖేల్', 'అబ్సెషన్', 'ప్రాజెక్ట్ హెయిర్ మేరీ', 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' వంటి చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్నాయి.సత్తా చాటిన ‘స్పైడర్ మ్యాన్’టామ్ హాలండ్, జెండయా జంటగా వచ్చిన మార్వెల్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత్‌లో ఆల్‌టైమ్ హాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. తొలి రోజే దేశవ్యాప్తంగా రూ60.60 కోట్ల నెట్ (రూ72.44 కోట్ల గ్రాస్) వసూలు చేసి, గతంలో 'అవేంజర్స్: ఎండ్ గేమ్' పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఇండియాలో రూ. 310 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తొలి వారంతంతోనే రూ. 8,572 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. ఇండియాలో ఈ చిత్రానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.చిన్న సినిమా.. భారీ వసూళ్లుతక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సైకాలజికల్ థ్రిల్లర్ 'అబ్సెషన్' ఈ ఏడాది అతిపెద్ద సర్ప్రైజ్గా నిలిచింది. ఈ చిత్రం ఇండియాలో రూ.75–84 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించి, రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా దాటింది. భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి 2026లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.సైన్స్ ఫిక్షన్‌కు భారీ ఆదరణర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' భారత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.75 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. . కథ, విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగాలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నగరాల్లోని ఐమాక్స్ స్క్రీన్లలో ఈ చిత్రానికి భారీ డిమాండ్ కనిపించింది.'మైఖేల్'తో మరో హిట్పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. భారతదేశంలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. సంగీతాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ బయోపిక్‌ను ఆదరించారు. భారత్‌లో ఈ చిత్రం రూ.66.44 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది.రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు?ప్రస్తుతం వరుసగా వస్తున్న హాలీవుడ్ చిత్రాల విజయాన్ని చూస్తే భారతీయ ప్రేక్షకుల అభిరుచి మరింత విస్తరించినట్లు స్పష్టమవుతోంది. మంచి కంటెంట్, అద్భుతమైన విజువల్ అనుభవం ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో విడుదలయ్యే హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
స్పైడర్ మ్యాన్ ఊచకోత.. ఇక్కడే రూ.1000 కోట్లు వస్తాయేమో?
స్పైడర్ మ్యాన్ సినిమాలకు మన దేశంలోనూ చాలా క్రేజ్ ఉంది. ఎప్పటినుంచి ఈ ఫ్రాంచైజీలో మూవీస్ వస్తున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లేటెస్ట్ చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండయా ప్రధాన పాత్రలు చేశారు. గత గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి వీకెండ్ ముగిసేసరికి సరికొత్త రికార్డులు సృష్టించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ప్రపంచవ్యాప్తంగా 927 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8830 కోట్లు) వసూళ్లు రాగా.. భారతదేశం నుంచి రూ.309 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. స్పైడర్ మ్యాన్ ఊపు చూస్తుంటే మన దగ్గరే రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్ దాటేస్తాడేమో అనిపిస్తుంది. థియేటర్లలో అలాంటి సందడి కనిపిస్తుందిదాదాపు 225 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,100కోట్లు) బడ్జెట్‌తో ఈ సినిమా తీయగా.. తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టుబడిని రాబట్టేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 38వ మూవీ కాగా.. డిసెంబరులో తర్వాత చిత్రమైన 'అవెంజర్స్ డూమ్స్ డే' రాబోతుంది. మరి ఇదెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: నేను చేసిన పనికి కేసు పెట్టాలనుకున్నారు: సీఎం విజయ్ కొడుకు)You showed up, you cheered, and together we made history. This celebration is yours ❤️🕷️#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio. pic.twitter.com/Ivw4twanBK— Sony Pictures India (@SonyPicsIndia) August 3, 2026 -
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే.. రెండో రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే'. జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.60.60 కోట్ల నెట్.. రూ.72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.రెండో రోజు కూడా స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే వసూళ్లు హవా కొనసాగింది. ఇండియావ్యాప్తంగా 16,902 షోల ద్వారా రూ.49.35 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్‌లో ఈ మూవీ రూ.131.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నెట్ కలెక్షన్ల విషయానికొస్తే రూ.109.95 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే సుమారు 167 నుంచి 173 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బద్దలు కొడుతోంది. తొలిరోజు వసూళ్లతో జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్’(రూ.40కోట్లు), రూసో బ్రదర్స్ అవెంజర్స్: ఎండ్‌గేమ్ (రూ.53కోట్లు) రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి భారత్‌లో రూ.200 కోట్ల మార్కును దాటుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టామ్ హాలండ్‌తో పాటు జెండాయా, జాకబ్ బాటలాన్, సేడీ సింక్, జాన్ బెర్న్తాల్, ట్రామెల్ టిల్మాన్ కీలక పాత్రలు పోషించారు.A brand new milestone 💯#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio. pic.twitter.com/1RB5dLBe6I— Sony Pictures India (@SonyPicsIndia) August 1, 2026 -
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్పైడర్‌మ్యాన్’.. భారత్‌లో భారీ వసూళ్లు!
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.60.60 కోట్ల నెట్, రూ.72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.ఈ చిత్రంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) చరిత్రలో భారత్‌లో అత్యధిక తొలి రోజు నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' నిలిచింది. గతంలో ఈ రికార్డు 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉండగా, ఇప్పుడు దానిని ఈ చిత్రం అధిగమించింది. అలాగే భారత్‌లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లోనే అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం దేశవ్యాప్తంగా సుమారు 17,250 షోలలో ప్రదర్శించబడగా, మొత్తం ఆక్యుపెన్సీ 72.3 శాతం నమోదైంది. ఇంగ్లీష్ వెర్షన్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఇంగ్లీష్ వెర్షన్ అత్యధిక వసూళ్లు సాధించగా, హిందీ వెర్షన్ కూడా భారీ కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగు, తమిళ వెర్షన్లు కూడా మంచి స్పందనను అందుకున్నాయి.మార్వెల్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. అదే ఉత్సాహం విడుదల రోజున కూడా కొనసాగడంతో అనేక నగరాల్లో షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో రాత్రి షోల ఆక్యుపెన్సీ అత్యధికంగా నమోదైంది. దర్శకుడు డెస్టిన్ డానియల్ క్రెట్టన్ తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు 225 మిలియన్ అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.2,154 కోట్లు) భారీ బడ్జెట్‌తో రూపొందినట్లు సమాచారం.


