ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా...స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..? | Rashmika Cocktail 2 Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా...స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Aug 2 2026 12:06 PM | Updated on Aug 2 2026 12:54 PM

Rashmika Cocktail 2 Movie OTT Release Date Out

షాహిద్‌ కపూర్‌, రష్మిక, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాక్‌టెయిల్‌ 2’.హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 19న థియేటర్స్‌లో విడుదలై..మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఆగస్ట్‌ 14 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

కాక్‌ టెయిల్‌ 2 కథేంటంటే..
కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు  లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఓ సారి కునాల్, దియా ఫారిన్‌లో వెకేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ దియా బెస్ట్‌ఫ్రెండ్‌ యాలీతో కునాల్‌కి పరిచయం ఏర్పడుతుంది. అయితే కునాల్‌పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఓ సమయంలో అతడితో శారీరకంగా కలుస్తారు. ఈ విషయం దియాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? కునాల్, దియా మధ్యకు యాలీ ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. యాలీ ఎలా దగ్గరైంది? చివరకు కునాల్‌ ఎవరినీ పెళ్లి చేసుకొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement