ఓటీటీలో దూసుకెళ్తోన్న హిట్‌ మూవీ.. నంబర్‌వన్‌గా ట్రెండింగ్ | Gatta Kusthi2 streaming number one Place In Netflix | Sakshi
Sakshi News home page

Gatta Kusthi 2: ఓటీటీలోనూ దూసుకెళ్తోన్న గట్ట కుస్తీ-2.. నంబర్‌వన్‌గా ట్రెండింగ్

Aug 2 2026 5:14 AM | Updated on Aug 2 2026 5:16 AM

Gatta Kusthi2 streaming number one Place In Netflix

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ మూవీ జూలై 31  నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇండియావ్యాప్తంగా ట్రెండింగ్‌ సినిమాల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కాగా..  గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement