ది ప్యారడైజ్‌లో స్పెషల్ సాంగ్.. కీర్తికి భారీగా రెమ్యునరేషన్..! | Keerthy Suresh will gets Huge Remunaration For The Paradise special song | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ది ప్యారడైజ్‌లో స్పెషల్ సాంగ్.. కీర్తికి భారీగా రెమ్యునరేషన్..!

Aug 2 2026 4:53 AM | Updated on Aug 2 2026 4:53 AM

Keerthy Suresh will gets Huge Remunaration For The Paradise special song

టాలీవుడ్‌లో సూపర్ హిట్‌ జంటల్లో నాని, కీర్తి సురేశ్ ఒకరు. వీరిద్దరు జంటగా నటించిన నేను లోకల్, దసరా మూవీస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేశాయి. అయితే మరోసారి ఈ హిట్ కాంబోను తెరపై చూసే అవకాశం రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్‌లో కీర్తి సురేశ్‌ కనిపించనుందని సమాచారం. ఆమెను ఓ స్పెషల్ సాంగ్‌ కోసం తీసుకున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రత్యేక పాట కోసం కీర్తి సురేశ్‌ ఓకే చెప్పారని.. అయితే కేవలం రెండు రోజుల కాల్‌షీట్లు మాత్రమే కేటాయించినట్లు టాక్ నడుస్తోంది.  ఈ రెండు రోజుల షూటింగ్ కోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కాస్తా టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.  అయితే ఈ సాంగ్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఒదెల చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ సాంగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement