ప్రేమకథలు సరిగా తీయాలే గానీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అలా రీసెంట్ టైంలో ఆకట్టుకున్న చిత్రం 'మై వాపస్ ఆవుంగా'. హిందీ భాషలో తీసిన ఈ మూవీ ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించారు. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అధికారికంగా అప్‌డేట్ ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)
ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 07వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
భారత్-పాక్ విభజన జరిగిన టైంలో ఇద్దరు ప్రేమికులు విడిపోతారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు.. వృద్ధుడు అవుతాడు. ప్రియురాలిని మళ్లీ కలవాలనే ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు అనుకున్నది చేశారా లేదా అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)


