breaking news
nasiruddin shah
-
దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిందీ సినిమా 'మై వాపస్ ఆవుంగా'. జూన్‌లో థియేటర్లలో రిలీజైంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రధారులు. రెండు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇదెలా ఉంది? ఏడిపించేంతలా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ)కథేంటి?చంఢీగడ్‌లో ఉండే 95 ఏళ్ల కీను అలియాస్ ఇషార్ సింగ్ గ్రెవాల్ (నసీరుద్దీన్ షా) ఎలాగైనా సరే పాకిస్థాన్‌లోని సర్గోదా నగరానికి వెళ్లాలని పట్టుబడుతుంటాడు. అదలా ఉండగానే స్ట్రోక్ వస్తుంది. దీనికి తోడు మెల్లమెల్లగా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాడు. చివరదశలో తాతకు తోడుగా ఉండేందుకు ఇంగ్లాండ్‌లో నుంచి మనవడు నిర్వార్(దిల్జీత్ దోసాంజ్)స్వదేశానికి తిరిగొస్తాడు. తాతతో మాట్లాడుతూ ఆయన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ కీను.. పాక్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడు? ఎవరిని కలవాలనుకుంటున్నాడు? అసలు 1947 దేశ విభజన టైంలో ఏం జరిగింది? అనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే?భారత్-పాక్ విడిపోయి 78 ఏళ్లు అయిపోయింది. అప్పుడేం జరిగిందో కళ్లారా చూసిన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చాలావరకు జీవించిలేరు. ఇప్పటితరానికి ఆ సంగతులేవి పెద్దగా తెలీదు. చరిత్ర పుస్తకాల్లోని ఫొటోలుగా మాత్రమే చూశారు, చూస్తున్నారు. కానీ దేశవిభజన జరిగినప్పుడు నరకాన్ని అనుభవించిన ఆనాటి తరం పరిస్థితి ఏంటి? తమ సొంత ఇళ్లని, ప్రాణానికి ప్రాణమైన మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినవాళ్ల బాధేంటి? వారు తమ జీవితాంతం మోసిన ఆ గుండెకోత, గాయాల విలువెంత? అనేది ఓ ప్రేమకథతో చూపించిన సినిమానే 'మై వాపస్ ఆవుంగా'.సినిమా మొదలైన నిమిషాల్లోనే స్టోరీలోకి నేరుగా వెళ్లిపోతాం. 1947లో మన దేశంలోని పంజాబ్‌కి వలస వచ్చిన ఓ కుర్రాడు.. తిరిగి పాకిస్థాన్‌లోని పంజాబ్‌కి వెళ్లాలని ప్రయత్నం చేసే సీన్‌తో కథ మొదలవుతుంది. అసలు ఇంతకీ ఇతడెవరు? దేశ విభజన జరగకముందు ఎలా ఎక్కడ ఉండేవాడు? ఎవరిని ప్రేమించాడు? అసలు 1947లో ఏం జరిగింది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జియా అనే అమ్మాయిని వదిలేసి ఎందుకు రావాల్సి వచ్చింది? అనే విషయాల్ని ఒక్కొక్కటిగా చూపించారు.మూవీ ప్రారంభమైన కాసేపటికి స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఈ పాత ప్రేమకథలో ఇక చెప్పడానికి ఏముంది? అనిపించింది. ఎప్పుడైతే సెకండాఫ్ మొదలవుతుందో మన మదిలో మెదిలిన ఒక్కో ప్రశ్నకు సమాధానాలు కనిపిస్తాయి. అప్పటివరకు సరదాగా, థ్రిల్లింగ్‌గా సాగిన సినిమా కాస్త గుండెల్ని పిండేసేలా మారుతుంది. క్లైమాక్స్‌లో అయితే ఏడిపించేసింది. అంతా అయిపోయిన తర్వాత అద్భుతమైన ప్రేమకథ చూశామే అని అనుభూతి కలిగింది.1947 విభజన అనగానే చాలామంది దాన్ని రాజకీయంగానే చూస్తారు. కానీ ఈ సినిమాలో ఆ సంఘటనని మనుషుల జీవితాలని శాశ్వతంగా మార్చిన విషాదంగా చూపించారు. మతాలు వేరు అయినప్పటికీ కీను-జియా ప్రేమించుకుంటూ ఉంటారు. అమాయకమైన ప్రేమ, చిలిపితనం, దొంగచూపులతో సాగుతున్న వీరి బంధాన్ని 1947 విభజన ఛిద్రం చేస్తుంది. రాడ్‌క్లిఫ్ అనే బ్రిటీషర్ గీసిన విభజన రేఖ కారణంగా కీను తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు రావాల్సి వస్తుంది. జియా పాక్‌లోనే ఉండిపోతుంది. తిరిగి కలుస్తానని ఆమెకు మాట ఇచ్చిన కీను.. ఆ జ్ఞాపకంతోనే జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ కలవలేకపోతాడు.ఇది జరిగిన 78 ఏళ్ల తర్వాత కీను మనవడు.. తాత కోరికని ఎలా నెరవేర్చాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేది ఇందులో హృద్యంగా చూపించారు. దేశం కోసం చేసే త్యాగం మాత్రమే గొప్పది కాదు, స్వస్థలాన్ని వదిలి వెళ్లాల్సిన శరణార్థి కన్నీటిలోనూ అపారమైన విలువ ఉందని ఇందులో అద్భుతంగా చూపించారు.ప్రస్తుత సమాజంలో ప్రేమకు విలువ లేకుండా చేశారు. కానీ అప్పట్లో ప్రేమ అంటే ఎలా ఉండేదో తెలియాలంటే ఈ మూవీ చూడండి. ఓ సీన్లో కీను, జియాని ముద్దుపెట్టుకుంటాడు. ఆమె ఇబ్బందిపడేసరికి ఇక జీవితంలో ఎప్పుడు ఇలా చేయనని అంటాడు. పెళ్లయినా సరే నన్ను ముద్దుపెట్టుకోవా అని జియా గోముగా అడుగుతుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు భలే క్యూట్‌గా అనిపిస్తుంది. అలానే రాజకీయాల కోసం రెండు మతాలు, దేశాల మధ్య చిచ్చుపెట్టి బ్రిటీషర్లు ఎలాంటి దమనకాండ సృష్టించారో ఇందులో కంటతడి పెట్టించేలా చూపించారు. 'శత్రువు వెళ్లిపోయాడు.. మనలో మనల్ని శత్రువులుగా మార్చాడు' అనే డైలాగ్ అప్పటి పరిస్థితులకు అద్దం పడుతుంది.ఎవరెలా చేశారంటే?ఇందులో 95 ఏళ్ల వృద్ధుడిగా చేసిన నసీరుద్దీన్ షా కళ్లతోనే హావాభావాలు పలికించాడు. తన నటన అనుభవం ఏంటో ఇందులో మరోసారి చూపించాడు. యుక్త వయసు కీనుగా చేసిన వేదాంగ్ రైనా, జియాగా చేసిన శార్వరి వాఘ్ కూడా వాళ్ల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. చూస్తున్నంతసేపు వీళ్లు కనిపించరు సదరు పాత్రలే దర్శనమిస్తాయి. దిల్జీత్ దోసాంజ్ కూడా తాత కోరికని నెరవేర్చే మనవడి పాత్రలో పర్లేదనిపించాడు. మిగిలిన వాళ్లు కూడా తమకిచ్చిన రోల్స్‌కి న్యాయం చేశారు.ఈ సినిమాలో నటీనటులు ఎంత తోడ్పాటు అందించారో డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంతకుమించి కష్టపడ్డారు. విజయానికి మూలకారకులు వీళ్లే. తనదైన టేకింగ్‌తో దర్శకుడు.. కథలో లీనమయ్యేలా రెహమాన్ తన మ్యూజిక్‌తో ప్రేమకథకు ప్రాణం పోశాడు.ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలు. హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ స్క్రీన్ మీదున్న పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అందువల్ల సినిమా చూస్తున్నప్పుడు టైమ్ ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియదు. గడియారంలోని ముల్లుల కంటే పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మనల్ని కట్టిపడేస్తుంది. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో ఇంటెన్స్ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన
ప్రేమకథలు సరిగా తీయాలే గానీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అలా రీసెంట్ టైంలో ఆకట్టుకున్న చిత్రం 'మై వాపస్ ఆవుంగా'. హిందీ భాషలో తీసిన ఈ మూవీ ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించారు. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అధికారికంగా అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 07వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.భారత్-పాక్ విభజన జరిగిన టైంలో ఇద్దరు ప్రేమికులు విడిపోతారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు.. వృద్ధుడు అవుతాడు. ప్రియురాలిని మళ్లీ కలవాలనే ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు అనుకున్నది చేశారా లేదా అనేదే మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన) -
అవార్డులను బాత్రూమ్ డోర్లకు హ్యాండిల్స్‌గా..
-
ఆరేళ్లకు మళ్లీ!
2014లో వచ్చిన ‘జిద్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు సీరత్ కపూర్. ఆ తర్వాత వరుసగా తెలుగులో ‘రన్ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి సినిమాలతో బిజీ అయ్యారు. ఆమె నటించిన ‘మా వింత గాధ వినుమా’ లాక్డౌన్లో విడుదలైంది. తొలి హిందీ సినిమా తర్వాత వరుసగా తెలుగు సినిమాలే చేసుకుంటూ వచ్చిన సీరత్ ఆరేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్లో ఓ సినిమా కమిటయ్యారు. ‘మారిచ్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ మర్డర్ మిస్టరీలో హీరోయిన్గా నటిస్తున్నారు సీరత్. నసీరుద్దిన్ షా, అనితా, తుషార్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది థియేటర్స్‌లోకి తీసుకొస్తారట. -
మైనారిటీలతో ఎలా ఉండాలో మోదీకి చూపిస్తాం
లాహోర్: మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. మూకహింసపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. మైనారిటీలకు హక్కులన్నీ దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని, దేశ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా దార్శనికత కూడా ఇదేనన్నారు. çశనివారం లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇమ్రాన్ అన్నారు. పోలీసు హత్య కన్నా ఆవు చనిపోతేనే ప్రాధాన్యమిస్తున్నారని బులంద్‌షహర్ హింసను ఉద్దేశించిన షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
నసీరుద్దీన్ షా (బాలీవుడ్) రాయని డైరీ
ఊరికే వచ్చేస్తాయి కోపాలు మనుషులకు! మంచి విషయమే. బతికే ఉన్నామన్న సంగతిని ఒంట్లోంచి ఏదో ఒక కెమికల్ బయటికి తన్నుకువచ్చి చెప్పకపోతే ఎవరి గురించి ఎవరికి మాత్రం తెలుస్తుంది?! కోపం రావడం మంచిదే. కానీ కోపం తెచ్చిపెట్టుకోవడం? అది కూడా మంచి విషయమేనా! తెచ్చిపెట్టుకోవడం ఎక్కువైంది లోకంలో. లేనిది తెచ్చిపెట్టుకోవడం! నవ్వు ఉండదు. తెచ్చిపెట్టుకుంటారు. ప్రేమ ఉండదు. తెచ్చిపెట్టుకుంటారు. పోనీ అవంటే వేషాలు బతికేయడానికి. కానీ కోపాన్ని కూడానా తెచ్చిపెట్టుకోవడం! అప్పుడు మనం బతికి ఉన్నట్టా? బతికే ఉన్నాం అని చెప్పుకున్నట్టా? జావెద్ అఖ్తర్‌ని అడగాలి. బాల్కనీలోంచి కిందికి చూస్తూ కూర్చున్నాను.. రోడ్డు మీదకి. సన్నటి జల్లు. ముంబై మబ్బు పట్టేసి ఉంది. కొంచెం మిస్ట్ కూడా! ‘‘ఏమిటి చూస్తున్నారు’’ అంది రత్న నా పక్కనే వచ్చి నిలబడి. తన చేతిలోంచి నా చేతిలోకి ఒక కప్పు టీ అందడం నా జీవితంలో ఎప్పటికీ ఒక హృదయపూర్వక సందర్భం... రోజులో అది ఏ సమయంలోనైనా! ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది తను. అసలు ఇవ్వడానికే తను నా దగ్గరికి వస్తుంది. ఇచ్చాక తన పనిలోకి వెళ్లిపోతుంది. రోడ్డు మీదకే చూస్తూ ఉన్నాను. రాలిన చినుకులు పూల విత్తనాలై నేలలోకి ఇంకిపోతు న్నాయి. ప్రకృతిలోని చల్లదనంలో నన్ను సంతోషపరి చేదేమిటో ఎప్పటికీ నేను కనుక్కోలేను. ప్రకృతి దగ్గర, రత్న దగ్గర నేను యాంబివలెంట్! చిన్న పిల్లాడు. ఒక్కడే నడుస్తున్నాడు. వాణ్ణే చూస్తున్నాను. డక్బ్యాక్ రెయిన్ కోట్, భుజాలకు స్కూల్ బ్యాగ్. వాడు వాడిలా లేడు. నాలా ఉన్నాడు. దుఃఖపు వర్షంలో వణికిపోతూ, ఇష్టం లేకుండా నేనెలాగైతే స్కూలుకు వెళ్లేవాడినో వాడూ అలాగే వెళుతున్నాడు! పిల్లల వీపుల పైకెక్కి, దున్నపోతుల్లా కూర్చొనే స్కూలు బ్యాగులపై మాత్రం నాకు ఎలాంటి యాంబివలెన్స్ లేదు. ఐ స్టిల్ హేట్ ద డ్యామ్ థింగ్స్. జీవితంలోని పెద్ద అసంబద్ధత ఈ చదువు! కష్టాలను తట్టుకునే శక్తి లేనివారే లైఫ్ నుంచి పారిపోయి సినిమాల్లో నటించడానికి వచ్చేస్తారని నా నమ్మకం. చదువూ అంతే. జీవితంలో కష్టపడిపోతా రేమోనన్న భయంతో పిల్లల్ని కష్టపెట్టి చదివించడం! చినుకులు పెద్దవయ్యాయి. లోపలికొచ్చి కూర్చున్నాను. ‘వెయిటింగ్ ఫర్ గాడో’ని తిరిగి ర్యాక్‌లో పెట్టేశాను. జీవితం నిండా అసంబద్ధతలే అంటాడు బెకెట్. జీవితం నిండా కాదు, జీవితమే ఒక అసంబద్ధత. ఎంత అసంబద్ధత కాకపోతే కిశోర్‌కుమార్ మీద, ఆర్డీ బర్మన్ మీద బయోపిక్‌లు తీయడానికి తయారైపోతారు వీళ్లు... పాటలు, డాన్సులతో తలలు పగలగొట్టే ఈ డైరెక్టర్లు! ‘‘వద్దు, ఆర్ట్ పీస్‌లను అలా వదిలేద్దాం’’ అన్నాను. కోపాలొచ్చే శాయ్. అఖ్తర్జీకీ వచ్చింది! రావడం మంచిదే. ఆయనేమిటో నాకు తెలుస్తుంది. తెచ్చిపెట్టుకుంటేనే.. నేనేమిటో అఖ్తర్జీకి తెలియదా అనిపిస్తుంది. -మాధవ్ శింగరాజు


