ఆరేళ్లకు మళ్లీ! | Seerat Kapoor makes Bollywood comeback with Maarich | Sakshi
Sakshi News home page

ఆరేళ్లకు మళ్లీ!

Jan 7 2021 6:25 AM | Updated on Jan 7 2021 8:16 AM

Seerat Kapoor makes Bollywood comeback with Maarich - Sakshi

2014లో వచ్చిన ‘జిద్‌’ అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు సీరత్‌ కపూర్‌. ఆ తర్వాత వరుసగా తెలుగులో ‘రన్‌ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ వంటి సినిమాలతో బిజీ అయ్యారు. ఆమె నటించిన ‘మా వింత గాధ వినుమా’ లాక్‌డౌన్‌లో విడుదలైంది. తొలి హిందీ సినిమా తర్వాత వరుసగా తెలుగు సినిమాలే చేసుకుంటూ వచ్చిన సీరత్‌ ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా కమిటయ్యారు. ‘మారిచ్‌’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ మర్డర్‌ మిస్టరీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు సీరత్‌. నసీరుద్దిన్‌ షా, అనితా, తుషార్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది థియేటర్స్‌లోకి తీసుకొస్తారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement