అక్కినేని హీరో అఖిల్ కెరీర్‌లో అందుకున్న తొలి సక్సెస్ 'లెనిన్'. గత నెలలో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. ఇకపోతే ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఎందులోకి రానుంది?
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన రూరల్ యాక్షన్ సినిమా 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు కాగా నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న థియేటర్లలో రిలీజైంది. బాగానే అలరించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 7వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
'లెనిన్' విషయానికొస్తే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు.
ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్‌ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి దీని తర్వాత ఏమైంది? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.
The roar begins. 🔥
A story of love, revenge, and revolution is all set to take over your screens.#Lenin premieres on August 7, exclusively on Telugu ZEE5.#BlockbusterLENIN@akkineniakhil @BhagyashriBose @nagavamsi19 @KishoreAbburu @MusicThaman pic.twitter.com/erTH7OLf5W— ZEE5 Telugu (@ZEE5Telugu) August 1, 2026


