ఆ విషయంలోనే నేను సిగ్గుపడాల్సిందేమి లేదు : కంగనా | Kangana Ranaut Slams Trolls Using Her Film Roles and Calls Out Misleading Comparisons | Sakshi
Sakshi News home page

ఆ విషయంలోనే నేను సిగ్గుపడాల్సిందేమి లేదు : కంగనా

Aug 1 2026 2:07 PM | Updated on Aug 1 2026 2:37 PM

Kangana Ranaut Fires At Trolls Using Examples Of Her Film Roles Against Her

తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ స్పందించారు. సినిమాల్లో తాను పోషించిన పాత్రలకు, నిజ జీవితానికి ముడిపెట్టొద్దని ఆమె కోరారు. ఇటీవల యువతను ఉద్దేశించి కంగనా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జెన్‌-జీ నిరసనకారులు గట్టర్‌ జనరేషన్‌ అని అనడంతో సోషల్‌ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

కొంతమంది నెటిజన్స్‌ కంగనా వ్యాఖ్యలను తప్పుపడుతూ.. ఆమె సినిమాల్లోని కొన్ని పాత్రలను, పాత వీడియోలను నెట్టింట్లో వైరల్‌ చేస్తున్నారు. దీనిపై తాజాగా కంగనా స్పందిస్తూ..నేను రూ.కోట్లు పారితోషికం తీసుకుని సినిమాల్లో ఆయా పాత్రలు పోషిస్తాను. పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు నా చుట్టూ భారీ భద్రత ఉంటుంది. 

అలాంటి వాటిని ఉదాహరణగా చూపిస్తూ.. పబ్‌లలో, రోడ్ల మీద, ఫంక్షన్లలో కూడా యువత అలాగే ప్రవర్తించొచ్చని అంటారా? ఈ రెండూ ఒకటేనా?. నటిగా నా వృత్తికి తగ్గట్లుగా విభిన్న పాత్రలు పోషిస్తాను. ఈ విషయంలో నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. దయచేసి యువతను తప్పుదోవ పట్టించకండి’ అని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement