అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రియాంక.. నెటిజన్స్‌ ప్రశంసలు | Priyanka Chopra Wins Hearts After Politely Apologising To Fans For Not Taking Selfies At Airport, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

క్షమాపణలు చెప్పి మనసు గెలుచుకున్న ప్రియాంక చోప్రా

Aug 1 2026 11:15 AM | Updated on Aug 1 2026 12:03 PM

Priyanka Chopra Apologises To Fans For Not Taking Selfies At Airport

సాధారణంగా సినిమా తారలు కనిపిస్తే వాళ్లతో ఫోటోలు దిగడానికి జనాలు ఎగబడతారు. అయితే కొంతమంది హీరోహీరోయిన్లు మాత్రం.. సెల్ఫీలు అడిగితే చిరాకుగా వెళ్లిపోతుంటారు. మరికొంతమంది అయితే దగ్గరకు వచ్చిన అభిమానులను తోసేస్తారు. సెల్ఫీలు ఇవ్వడం ఇష్టంలేకుంటే..ఫ్యాన్స్‌ వైపు చూడకుండా సైలెంట్‌గా వెళ్లిపోతారు.  కానీ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా మాత్రం.. సెల్ఫీలు ఇవ్వలేకపోయినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పింది. తన పరిస్థితిని మర్యాదగా వివరించి.. సెల్ఫీలు ఇవ్వకుండా వెళ్లిపోయింది.

అసలేం జరిగింది?
ఎక్కడి వెళ్తుందో తెలియదు కానీ.. తాజాగా ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లింది. కూతురుని చేతుల్లో ఎత్తుకొని.. ఎయిర్‌పోర్ట్‌లోపలికి వెళ్తుండగా.. ఆమెను గుర్తుపట్టి కొంతమంది సెల్ఫీలు అడిగారు. అయితే ప్రియాంక చేతిలో పాప ఉండడంతో సెల్ఫీలు ఇవ్వలేకపోయింది. అలా అని వారిని పట్టించుకోకుండా వెళ్లలేదు. ఒక క్షణం ఆగి.. ‘క్షమించండి..నేను పాపతో ఉన్నాను’ అని చెప్పింది. ఆమె అలా చిరునవ్వుతో మర్యాదగా చెప్పడం అభిమానులను విపరీతంగా హత్తుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అంతర్జాతీయంగా కీర్తి గడించినప్పటికీ ఒదిగి ఉండడమే కాదు..గౌరవంగా ప్రవర్తించారని నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మహేశ్‌కి జోడీగా.. 
ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి చిత్రంలో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది. ఇందులో అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేసినట్లు ఆమె చెప్పారు. ఇక ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement