ఎమోషనల్‌ గాయత్రీ దేవి | Abhirami joins Sudigali Sudheer Joker in a key role | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌ గాయత్రీ దేవి

Aug 1 2026 12:30 AM | Updated on Aug 1 2026 12:30 AM

Abhirami joins Sudigali Sudheer Joker in a key role

అభిరామి

నటుడు, యాంకర్‌ సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుధీర్స్‌ జోకర్‌’. ఈ సినిమా ద్వారా బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అయేషా హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. పీఎస్‌ సునీల్‌ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిరామి, మురళీ శర్మ, అజయ్‌ ఘోష్, రమేష్‌ ఇందిర, విష్ణు ఓయ్, మురళీధర్‌ గౌడ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘పరదా’ వంటి విభిన్నమైన చిత్రం తర్వాత శ్రీనివాసులు పి.వి, విజయ్‌ డొంకాడ, శ్రీధర్‌ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించి, ఆమె లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘సుధీర్స్‌ జోకర్‌’లో గాయత్రీ దేవి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు అభిరామి. ఆమె పాత్ర మంచి ఎమోషనల్‌గా ఉంటుంది. అభిరామి నటన కథకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement