టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తోన్న భారీ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. స్పిరిట్‌తో బిజీగా ఉన్న సందీప్.. తాజాగా రామాయణ ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ కేవలం ట్రైలర్ మాత్రమే కాదని ట్వీట్ చేశారు. అధర్మంపై ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే దానికి శాశ్వతమైన గుర్తు అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముడుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈనెల 30న రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయగా విజువల్స్ పరంగా ఆకట్టుకుంది. రావణుడి పాత్రలో యశ్ మరింత గంభీరంగా కనిపించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్.. శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. ఈ ఎపిక్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
"YEH RAM YUG KA AARAMBH HAI."
Not just a trailer, but the eternal reminder that DHARMA will always triumph over ADHARMA.https://t.co/5uAgQKUlqg— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 31, 2026


