అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా అదరగొడుతోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించింది.
తాజాగా ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా లెనిన్ వందకోట్ల మార్క్ చేరుకుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయ్యగారే నంబర్‌వన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
The ROAR has reached 100 CRORE+ WORLDWIDE GROSS ❤️🔥❤️🔥
A celebration that belongs to every audience member who stood by #LENIN 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/gncmWpZkZT— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2026


