మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్‌గా పేరొందిన స్టోరీ టీవీ వచ్చే 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా తెలుగు మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని ఎలోఎలో గ్రూప్ సారధ్యంలోని స్టోరీ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జిఎస్‌ఎన్ ఆదిత్య తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెలుగు ఒరిజినల్స్ రూపొందిస్తున్నామని తెలిపారు.
రొమాన్స్ , ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, రివెంజ్, కామెడీ, ఎమోషనల్ డ్రామా వంటి విభిన్న జానర్లలో చిత్రాలను తీసుకురానున్నామని జిఎస్‌ఎన్ ఆదిత్య వివరించారు. దీని కోసం నంది అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ (స్వాతి చినుకులు), చరణ్ లక్కరాజు (టెంపరరీ రూమ్‌మేట్స్) ’వన్ లాస్ట్ రైడ్’ దర్శకుడు అజ్జు, రాజ్ (బిగ్‌బాస్ తెలుగు), అన్విత (దేవయాని), విశాలాక్షి (లక్ష్మీ నివాసం), రక్ష (గుప్పెడంత మనసు), రోహిత్ (అభిషేకం), మోనిక (పద్మావతి కళ్యాణం) వంటి తదితర ప్రముఖ తెలుగు సినీ దర్శకులు, నటీనటుటు టెక్నీషియన్లతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన వివరించారు.


