హీరో నాని చేస్తున్న లేటెస్ట్ సినిమా ద 'ప్యారడైజ్'. సాధారణంగా ఏడాది రెండు మూడు మూవీస్ చేసే నాని.. దీని కారణంగా వేరే ప్రాజెక్టులేం చేయట్లేదు. లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. అయితే ఈసారి కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ చర్చ అలా ఉండగానే టీజర్ అప్‌డేట్ వచ్చేసింది.
(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకోవడంపై నటి సురేఖావాణి క్లారిటీ)
ఆగస్టు 06న అంటే వచ్చే గురువారం నాడు 01:35 నిమిషాల టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా దీనితో పాటు విడుదల తేదీపైనా క్లారిటీ ఇస్తారేమో. ఇకపోతే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని, కాయదు లోహర్ జంటగా నటించారు. మోహన్ బాబు, రాఘవ్ జుయోల్, సంపూర్ణేశ్ బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పటికే 'ఆయా షేర్' అనే పాట రిలీజైంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ హీరోయిన్)


