‘ది ప్యారడైజ్‌’లో అదిరిపోయే ఐటమ్‌ సాంగ్‌.. ఆమెకే చాన్స్‌! | Keerthy Suresh To Feature In A Special Song In Nani's The Paradise Movie? Rumours Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘ది ప్యారడైజ్‌’లో అదిరిపోయే స్పెషల్‌ సాంగ్‌.. ఆమెకే చాన్స్‌!

Jul 28 2026 9:21 AM | Updated on Jul 28 2026 10:32 AM

This Crazy Actress Play SPecial Song In Nani The Paradise Movie

ఈ ఏడాది టాలీవుడ్‌ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ది ప్యారడైజ్‌’ ఒకటి. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంపై ఇప్పుటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రచార కంటెంట్‌.. సూపర్‌ హిట్‌గా నిలిచింది. పాటలు అయితే దుమ్మురేపుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ రూమర్‌ బయటకు వచ్చింది. ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండబోతుందట. సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఆ పాటను మరింత స్పెషల్‌గా తీర్చిదిద్దాడట. ఈ పాట కోసం మరో క్రేజీ హీరోయిన్‌ని రంగంలోకి దించబోతన్నట్లు సమాచారం. ఆ క్రేజీ బ్యూటీ మరెవరోకాదు..గతంలో నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’మూవీ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌.

ఫైనల్‌గా కీర్తి.. 
స్పెషల్‌ సాంగ్స్‌కి కేరాఫ్‌ అనిరుధ్‌. ఆయన ఇప్పటి వరకు అందించిన ప్రతి ప్రత్యేక పాట సూపర్‌ హిట్‌ అయింది. ఇందులో కూడా పాట పెట్టాలని ముందే భావించారట. అయితే ఆ పాట కోసం ఎవర్నీ తీసుకుందామా అని చాలా రోజులుగా ఆలోచించారట. ఫైనల్‌గా కీర్తి సురేశ్‌ని అనుకున్నారట. నాని, కిర్తి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరికి తెలుసు. ఆ చనువుతోనే నాని... కీర్తిని అడిగాడట. ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో భారీ సెట్‌..
ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని వేశారట. రేపటి నుంచి అందులోనే ఈ పాటను తెరకెక్కించబోతున్నారు. దాదాపు 1000 మందికి పైగా జానియర్‌ ఆర్టిస్ట్‌లు, డ్యాన్సర్లతో ఈ పాటను షూట్‌ చేయబోతున్నట్లు సమాచారం. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుటికే విడుదల కావాల్సింది. కానీ షూటింగ్‌ సరైర సమయానికి పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదిని ప్రకటించబోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement