ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత | Veteran Actress Pavala Syamala Passes Away After Prolonged Illness | Sakshi
Sakshi News home page

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

Jul 28 2026 6:51 AM | Updated on Jul 28 2026 12:46 PM

Pavala Syamala Passed Away

ప్రముఖ నటి, కమెడియన్ పావలా శ్యామల కన్నుమూశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ మరణించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఆమె భౌతిక కాయానికి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.



కాగా.. టాలీవుడ్ చాలా సినిమాల్లో పావలా శ్యామలా తన నటనతో మెప్పించారు. పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. చివరి రోజుల్లో ఆమె దీన స్థితిని గడిపారు. చికిత్సకు డబ్బుల్లేక ఎన్నో అవస్థలు పడ్డారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి.. చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో మరణించడం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement