నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ అండర్‌వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టుకి వాయిదా పడింది.
తాజాగా ఈ మూవీ మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 21న ది ప్యారడైజ్ రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24కు పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతోనే వాయిదా వేశారని సమాచారం. అంతేకాకుండా ప్రమోషన్స్‌కు తగినంత సమయం కావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


