టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌లో వివాదంపై శ్రష్టి వర్మ స్పందించారు. గతంలో జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ తాజాగా నెలకొన్న వివాదంపై మాట్లాడారు. జానీ మాస్టర్ అనుచరులు రెచ్చిపోయారని అన్నారు. జానీ మాస్టర్ తన అసిస్టెంట్లతో కలిసి కొట్టించడానికి వచ్చారని శ్రష్టి ఆరోపించారు.
నన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని శ్రష్టి వర్మ ఆరోపించింది. నా వాయిస్ నొక్కేయాలని చూస్తే ఊరుకోనని ఆమె స్పష్టం చేసింది. జానీ మాస్టర్ వివాదంపై చిరంజీవి, రామ్ చరణ్ కూడా స్పందించాలని శ్రష్టి వర్మ విజ్ఞప్తి చేసింది.
శ్రష్టి వర్మ మాట్లాడుతూ..'అసోసియేషన్‌లో రూల్స్ అందరికీ ఓకేలా ఉండాలి. ఇక్కడ ఏకపక్షంగా చేయడం కరెక్ట్ కాదు. మేము డ్యాన్సర్లం.. మీ బానిసలం కాదు. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఫెడరేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరారు. ఇప్పటికీ మా అందరికీ ఫెడరేషన్ కావాలి. మిస్టర్ షేక్ జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్స్ కేవలం ఇక్కడికి కొట్టడానికే వచ్చారు. అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు' అని తెలిపింది.


