breaking news
shrasti Verma
-
బిగ్ బాస్ లో సంచలన ఎలిమినేషన్..!
-
ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి
మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్ హీరోహీరోయిన్ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా డివైడ్ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్‌గా ఉన్నారు. రెచ్చిపోయిన భరణిహౌస్లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్ చేయించాడు నాగ్ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడు. అనంతరం టెనెంట్స్‌లో నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ఫైట్ చేశారు. రెజ్లింగ్ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్ ఆడాడు.పర్మినెంట్ ఓనర్‌గా భరణిఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్‌లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీమ్ డిసైడ్ చేయాలన్నారు. సంచాలక్ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ ఓడిన బ్లూ టీమ్‌లోని ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి అందరూ భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్ ఓనర్‌గా మారిపోయాడు. భరణిని ఓనర్‌గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయాయి. మాట మార్చిన ఇమ్మాన్యుయేల్అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్ పవన్ సేవ్ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్ అయింది. వెళ్లిపోయేముందు ఆమె ఓ టాస్క్ ఇచ్చారు. నమ్మకం మీద దెబ్బ కొట్టారుఅందులో భాగంగా జెన్యూన్‌గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ జెన్యూన్ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. సంజనా పేరు ప్రస్తావించింది.. కానీ తను చాలా స్ట్రాంగ్ అని పేర్కొంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్ టాస్క్.. ఇకపై సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్‌బాంబ్ వేసింది.చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..? -
Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదటి వారం పూర్తి అయిపోయింది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) హౌస్ నుంచి బయటకు వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హోస్లో కొనసాగింది. మొదట ఫ్లోరా సైనీ(ఆషా షైనీ) ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో శ్రష్టి వర్మను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే, వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతుంది.బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభ పడింది లేదని చెప్పాలి. హౌస్‌లో ఆమె కేవలం వారంరోజులు మాత్రమే ఉండటంతో తను రెమ్యునరేషన్‌గా రూ. 2 లక్షలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది.బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రీతూ చౌదరి, రాము రాథోడ్,సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్,సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్‌తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు శ్రేష్టి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా ఆమె బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న నలుగురు పేర్లు చెప్పమని నాగార్జున కోరారు.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు.. భరణి, రీతూ చౌదరి, తనూజ, పేర్లు చెప్పింది. -
ఎలిమినేషన్లో ట్విస్ట్.. 'పుష్ప' కొరియోగ్రాఫర్ ఔట్!
మొన్ననే బిగ్‌బాస్ 9 మొదలైంది. అప్పుడే మొదటి వీకెండ్ వచ్చేసింది. వారాంతం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. నామినేట్ అయినవాళ్లలో కచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. అయితే ఈసారి సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో భరణి తప్పితే అందరూ నామినేషన్స్‌లో నిలిచారు. మరోవైపు సామాన్యుల నుంచి డీమాన్ పవన్ ఇందులో ఉన్నాడు. వీరిలో ఇద్దరు మాత్రం చివరి ప్లేసుల్లో నిలిచారు. ఇప్పుడు వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తేలింది.ఈ వారం నామినేట్ అయినవాళ్లలో లక్స్ పాప ఫ్లోరా సైనీ.. బయటకొచ్చేస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సంజనతో గొడవ పడటం తప్పితే ఈమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. అలా అని కెప్టెన్సీ టాస్క్‌లో ఏమైనా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే అదీ లేదు. దీంతో ఈమెనే తొలివారం ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ 'పుష్ప' కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మీదే తప్పు షో నుంచి వెళ్లిపోతా.. నాగార్జునకు మాస్క్ మ్యాన్ ఝలక్)బిగ్‌బాస్ హౌసులోకి శ్రష్ఠి వర్మ వస్తుందని రూమర్స్ వచ్చినప్పడు.. ఈమె కచ్చితంగా కొన్నివారాలైనా సరే ఉంటుంది. తన జీవితంలో జరిగిన వివాదం గురించి ఎప్పుడైనా మాట్లాడకపోదా అని అందరూ అనుకున్నారు. అలానే షో మొదలైన రోజు నాగార్జునతో మాట్లాడుతూ.. మనం కలిసి సినిమా చేయాలి సర్ అని అడిగింది. దీంతో త్వరగా బయటకొచ్చేయ్ అని నాగ్ సరదాగా అన్నాడు. మరి ఈ మాటల్ని సీరియస్‌గా తీసుకుందో ఏమో తొలివారమే ఈమెని ఎలిమినేట్ చేసినట్లు అనిపిస్తుంది.సాధారణంగా తొలివారం ఎలిమినేషన్ అనగానే సీనియర్ నటుల్ని బయటకు పంపిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం అనుహ్యంగా యంగ్ బ్యూటీని ఔట్ చేయడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు బిగ్‌బాస్ కూడా ఊహలకు అందని విధంగా చేస్తుంటాడు. మరి ఈసారి అసలేం జరిగింది? అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?) -
డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?
గంపెడాశలతో బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకర్ని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, డిమాన్ పవన్, తనూజ, ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్‌లో ఉన్నారు.వీళ్లంతా కనిపించారువీరిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు ఇమ్మాన్యుయేల్ (Emmanuel). ఓనర్ల (కామన్‌మ్యాన్)కు నచ్చిన వంటలు చేస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది తనూజ. కెప్టెన్సీ టాస్క్‌లో ఇరగదీశాడు రాము రాథోడ్. ఒక్క గుడ్డు దొంగిలించి హౌస్‌ను షేక్ చేసింది సంజనా. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమాయిషీ చూపించే కెప్టెన్‌గా నిలించింది. గ్లామరస్ కంటెంట్నిచ్చే రీతూకు ఎలాగో బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎపిసోడ్లో జాడ లేని కంటెస్టెంట్లుమిగిలిందల్లా డిమాన్ పవన్, శ్రష్టి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ (Flora Saini). సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పవన్ హౌస్‌లో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. కాబట్టి కొన్నాళ్లు అతడిని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రష్టి, ఫ్లోరా ఎపిసోడ్లో పెద్దగా కనిపించడమే లేదు. ఫ్లోరా అయితే సంజనాతో గొడవైనప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్ క్లీన్ చేసే పని అప్పజెప్పడంతో రోజులో ఎక్కువభాగం ఆ వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతోంది.ఇలాగైతే ఎలిమినేషన్ ఖాయంఆమె నుంచి పాజిటివ్ లేదా నెగెటివ్.. ఎటువంటి వైబ్స్ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అప్పుడే ఎలిమినేషన్ ఎందుకని నాగ్ (Nagarjuna Akkineni) కనికరించాడంటే మాత్రం ఈ వారం ఫ్లోరాకు గండం గడిచినట్లే! మరి నాగార్జున కనికరిస్తాడా? లేదంటే ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడనేది వేచి చూడాలి!చదవండి: ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
బిగ్‌బాస్‌లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్?
శ్రష్ఠి వర్మ.. మామూలుగా అయితే ఈమె ఎవరనేది పెద్దగా తెలీదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూ వచ్చిన ఈమె.. అతడిపైనే ఆరోపణలు చేయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కొన్నిరోజుల పాటు ఈ కాంట్రవర్సీ నడవగా.. ప్రస్తుతం అంతా సైలెంట్ అయిపోయింది.శ్రష్ఠి వర్మ ఆరోపణలు, ఫిర్యాదు చేయడం వల్ల జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు జైలులో ఉంచారు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన జానీ.. ప్రస్తుతం ఆడపాదడపా పాటలు చేస్తున్నాడు. మరోవైపు శ్రష్ఠి కూడా కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు దక్కించుకుంటోంది. అలాంటిది ఈమెని ఇప్పుడు బిగ్‌బాస్ 9వ సీజన్ కోసం టీమ్ అప్రోచ్ కాగా.. ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె గనక హౌసులో అడుగుపెడితే రచ్చ గ్యారంటీనే.(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే)శ్రష్ఠి వర్మ విషయానికొస్తే.. ఈమెది మధ్యప్రదేశ్. ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఆ టైంలో ఈమె ప్రతిభని గుర్తించిన జానీ మాస్టర్.. తన దగ్గర సహాయకురాలిగా అవకాశమిచ్చాడు. తర్వాత కాలంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. అయితే శ్రష్ఠి కామెంట్స్‌ని జానీ మాస్టర్ ఖండించాడు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర చేసి, శ్రష్టి వర్మతో ఇలా చెప్పించారని అన్నాడు.బిగ్‌బాస్ 9వ సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యుల కూడా పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అగ్నిపరీక్ష పేరుతో కామన్ మ్యాన్ ఎంపిక పోటీ జరుగుతోంది. నవదీప్-అభిజిత్-బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షో.. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. మూడు నాలుగు ఎపిసోడ్స్ అయిపోయాయి కూడా.(ఇదీ చదవండి: మాట తూలి.. ఇప్పుడు సారీ చెప్పిన నవదీప్) -
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ పెద్దగా ఫేమస్ అవ్వరు. కానీ కొన్నిరోజుల క్రితం జానీ మాస్టర్(Jani Master)పై పోలీస్ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది శ్రష్ఠి వర్మ(Shrasti Verma) అనే కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఈమె కొత్త కారు కొనుగోలు చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శ్రష్ఠి వర్మది మధ్యప్రదేశ్. షోలో పాల్గొన్న తర్వాత కొన్నాళ్లకు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టడం వరకు వెళ్లింది.మరోవైపు పుష్ప 2(Pushpa 2 Movie)మూవీలోనూ కొన్ని పాటలకు ఈమె కొరియోగ్రాఫీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలా బన్నీ సినిమాతో ఫేమ్ సంపాదించిన శ్రష్ఠి.. ఇప్పుడు హుండాయ్ కారు కొనుకున్నానని తెగ సంతోషపడిపోతుంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) -
జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!
కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ని అరెస్ట్ కూడా చేశారు. దాదాపు నెల రోజుల వరకు జైల్లో ఉండి..కొన్నాళ్ల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. తను ఏ తప్పు చేయలేదని, తనేంటో నిరూపించుకుంటాననీ, తన నిర్దోషిత్వాన్ని బయటపెడతానని వరుస ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక..భార్యతో కలిసి జానీ మాస్టర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ ఫిర్యాదు చేసిన లేడి కొరియోగ్రాఫర్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచనల విషయాలు వెల్లడించారు.మాస్క్ ఎందుకు వేసుకోవాలి?సదరు మీడియా చానల్ ఇంటర్వ్యూకి ముందు జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన లేడి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ(Shrasti Verma )ను మాస్క్ వేసుకోవాలని కోరింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. మాస్క్ వేసుకోకుండా ఇంటర్వ్యూ ఇస్తానని శ్రేష్ట చెప్పింది. అంతేకాదు ఒక అమ్మాయి అన్యాయం జరిగిందని కేసు పెట్టినప్పుపు మాస్క్ వేసుకొని మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదన్నారు. తాను వారియర్‌ని అని..మంచి కోసం ఫైట్ చేస్తున్నాని చెప్పింది. తనను ఆదర్శంగా తీసుకొని పది మంది అమ్మాయిలు మారినా చాలని అంటున్నారు. ఇక జానీ మాస్టర్ కేసు విషయం గురించి మాట్లాడుతూ.. రివేంజ్ కోసం ఆ కేసు పెట్టలేదని.. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే ఫిర్యాదు చేశానని చెప్పింది. అమ్మాయి అంటే ఆట బొమ్మ కాదని..వాళ్లకు ఇష్టం లేదని చెబితే దాన్ని గౌరవించాలని కోరింది.అందుకే నాలుగేళ్ల తర్వాత ఫిర్యాదుజానీ మాస్టర్ నాలుగేళ్ల క్రితం వేధిస్తే..ఇప్పుడెందుకు కేసు పెట్టావని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక అమ్మాయిని. అప్పుడు మైనర్ని కూడా. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తితో పోరాడే శక్తి నాకు లేదు. పైగా ఆ పర్సన్(జానీ మాస్టర్) మారతాడేమోనని భావించాను. కానీ నేను ఆశించినట్లుగా ఆయనలో మార్పు రాలేదు. వేధింపులు ఇంకా కొనసాగించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. కేసు పెట్టే ముందు నా దగ్గర రెండే ఆప్షన్లు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడమా లేదా ఆత్మహత్య చేసుకోవడమా? వాటిలో నేను మొదటిదే ఎంచుకున్నాను.నేను ఫైట్ చేయగలను అనుకున్నప్పడే బయటకు వచ్చాను. సొసైటీ గురించి ఆలోచించలేదు. సోషల్ మీడియాను పట్టించుకోలేదు. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేశాను. అందుకే మాస్క్ లేకుండా మీడియా ముందుకు వచ్చాను. ఫ్యామిలీ ఏదో అంటుంది. స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా నాలాగే అన్యాయం జరిగిన అమ్మాయిలంతా ధైర్యంగా ముందుకు రావాలి.ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు?నేను కేసు పెట్టిన తర్వాత సమీర్ అనే అబ్బాయితో నాపై ఫిర్యాదు చేయించే ప్రయత్నం చేశాడు. అతను నిందితుడు(జానీ మాస్టర్) బంధవు. ఆయన భార్యనే స్వయంగా తీసుకెళ్లి నాపై ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు అతని ఫిర్యాదు స్వీకరించలేదు. నేను అతన్ని మోసం చేశానని, లైంగికంగా వేధించానని సమీర్ చెప్పాడు. అదంతా మీడియా ప్రసారం చేసింది కూడా. అంతేకాదు పోలీసులు స్వీకరించకపోతే సూసైడ్ చేసుకుంటాను అన్నాడు. మరి నిజంగా సూసైడ్ చేసుకున్నాడా? ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మీడియా అతని గురించి ఎందుకు ఆరా తీయడం లేదు? బెదిరింపులకు భయపడే అమ్మాయిని కాదు. అతనికి తల్లి, చెల్లి ఉన్నారు కదా.. భవిష్యత్తులో భార్య కూడా వస్తుంది. ఇలాంటి చీప్ ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలి. నాలుగేళ్ల తర్వాత కేసు ఎందుకు పెట్టావని నన్ను అంటున్నారు. మరి సమీర్ నాలుగేళ్ల తర్వాత నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? నేనంటే అమ్మాయిని భయపడి ఇన్నాళ్లు ఫిర్యాదు చేయకుండా ఉన్నాను అనుకో. అతను అబ్బాయి కదా.. అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? ఇదంతా నిందితుడి భార్య ఆడుతున్న డ్రామా. ఆమె కొంచెం కూడా సిగ్గులేదు.నేషనల్ అవార్డు రద్దుతో నాకు సంబంధం లేదుజానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు కావడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రేష్ట చెప్పారు. ‘నేషనల్ రద్దు కోసం నేను ఎలాంటి లేఖలు రాయలేదు. నాకు లాయర్ కూడా లేరు. అతనిపై ఆరోపణలు వచ్చాయి కనుకే అవార్డు రద్దు అయింది. వ్యక్తిగత జీవితం వేరు..ప్రొఫెషినల్ లైఫ్ వేరు కదా.. అవార్డు ఎందుకు రద్దు చేస్తారని కొంతమంది అంటున్నారు. కానీ ప్రొఫెషనల్‌గా ఎంత బాగున్నప్పటికీ..బుద్ది మంచిగా లేకపోతే ఎలా? నేషనల్ అవార్డు అనేది చాలా పెద్దని.. అన్ని చూస్తారు. ఆరోపణలు ఉన్నాయనే అవార్డు రద్దు చేశారు. అంతేకానీ నేను అయితే ఎలాంటి లేఖ రాయలేదు.


