
శ్రష్ఠి వర్మ.. మామూలుగా అయితే ఈమె ఎవరనేది పెద్దగా తెలీదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూ వచ్చిన ఈమె.. అతడిపైనే ఆరోపణలు చేయడం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కొన్నిరోజుల పాటు ఈ కాంట్రవర్సీ నడవగా.. ప్రస్తుతం అంతా సైలెంట్ అయిపోయింది.
శ్రష్ఠి వర్మ ఆరోపణలు, ఫిర్యాదు చేయడం వల్ల జానీ మాస్టర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు జైలులో ఉంచారు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన జానీ.. ప్రస్తుతం ఆడపాదడపా పాటలు చేస్తున్నాడు. మరోవైపు శ్రష్ఠి కూడా కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు దక్కించుకుంటోంది. అలాంటిది ఈమెని ఇప్పుడు బిగ్‌బాస్ 9వ సీజన్ కోసం టీమ్ అప్రోచ్ కాగా.. ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె గనక హౌసులో అడుగుపెడితే రచ్చ గ్యారంటీనే.
(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే)
శ్రష్ఠి వర్మ విషయానికొస్తే.. ఈమెది మధ్యప్రదేశ్. ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఆ టైంలో ఈమె ప్రతిభని గుర్తించిన జానీ మాస్టర్.. తన దగ్గర సహాయకురాలిగా అవకాశమిచ్చాడు. తర్వాత కాలంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. అయితే శ్రష్ఠి కామెంట్స్‌ని జానీ మాస్టర్ ఖండించాడు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర చేసి, శ్రష్టి వర్మతో ఇలా చెప్పించారని అన్నాడు.
బిగ్‌బాస్ 9వ సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యుల కూడా పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అగ్నిపరీక్ష పేరుతో కామన్ మ్యాన్ ఎంపిక పోటీ జరుగుతోంది. నవదీప్-అభిజిత్-బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షో.. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. మూడు నాలుగు ఎపిసోడ్స్ అయిపోయాయి కూడా.
(ఇదీ చదవండి: మాట తూలి.. ఇప్పుడు సారీ చెప్పిన నవదీప్)