ఈ రోజుల్లో సోషల్ మీడియా ఖాతా లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని అడిగితే టక్కున లేరనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ డిజిటల్ యుగం అంతా సామాజిక మాధ్యమాల మీదనే నడుస్తోంది. ఇప్పుడంతా అరచేతిలోనే ప్రపంచం కనిపిస్తోంది. సోషల్ మీడియాతో ఒక్క రోజులోనే వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతున్న రోజులివి. మరి ఇంతలా ప్రపంచాన్ని శాసిస్తోన్న సోషల్ మీడియాలో స్టార్ నటుడు ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదంటే నమ్ముతారా? మీరు అవునన్నా.. కాదన్నా ఇది నమ్మి తీరాల్సిందే. తాజాగా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఆ నటుడు ఎవరో మీరు చదివేయండి.
నాగార్జున శివ మూవీలో తన విలనిజం, నటనతో మెప్పించిన జేడీ చక్రవర్తి. ఆయనకు ఇప్పటి వరకు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా లేదు. తాజాగా జేడీ చక్రవర్తి సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా ప్రకటించింది. జేడీ మ్యాక్స్ మోడ్ పేరుతో ఈ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఇందులో జేడీకి సంబంధించిన ఓ వీడియోను కూడా చేశారు. నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. నేను దేవుళ్లను నమ్ముతాను.. అందరి దేవుళ్లను నమ్ముతాను.. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా అంటూ వీడియోలో జేడీ చక్రవర్తి మాట్లాడారు.
కాగా.. జేడీ చక్రవర్తి శివ, గాయం, సత్య లాంటి చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాతో అభిమానులతో టచ్‌లోకి వచ్చేస్తున్నారు. కాగా.. జేడీ చివరిసారిగా దయా అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ 2023లో జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది.


