తెలుగులో పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్స్.. విడుదలకు ముందే పూర్తయిపోతాయి. చిన్నచిత్రాలకు మాత్రం కొన్నిసార్లు రిలీజ్ తర్వాత లేదంటే ఎప్పటికో అవుతాయి. అలా కొన్నిసార్లు థియేటర్లలోకి వచ్చిన నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా ఓ తెలుగు చిత్రం దాదాపు 8 నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది.
అప్పట్లో పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా చేసిన సత్యప్రకాశ్.. ప్రస్తుతం ఒకటి అరా చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'నాన్నా మళ్లీ రావా!'. ప్రభావతి, రిత్విక్, హారిక, శిరీష ఇతర పాత్రలు పోషించారు. నిర్దేశ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
రిలీజ్ టైంలో ఈ సినిమా గురించి మాట్లాడిన సత్యప్రకాశ్.. నన్నెంతగానో కదిలించిన కథ ఇది. చిత్రీకరణలో ప్రతిరోజూ గ్లిజరిన్ అవసరం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి. కథలోని ప్రతి సందర్భం వాస్తవంలా అనిపించేది అని చెప్పుకొచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ 'నాన్న చుట్టూ తిరిగే కథ ఇది. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది' అని అన్నారు.
ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ విడుదలయ్యాయి. రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా జీ5లో, స్టీఫెన్ అనే డబ్బింగ్ బొమ్మ నెట్‌ఫ్లిక్స్‌లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా.. హాట్‌స్టార్‌లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్..: దర్శకుడు)


