ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బిగ్ డీల్ ఖరారు కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ఒప్పందం కోసం బిడ్ వేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌కు చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 72 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)గా ఉంది.
ఈ లెక్కన ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేరుకు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) బిడ్ వేసినట్లు తెలిసింది. సీఎన్‌ఎన్, టీబీఎస్, టీఎన్‌టీ వంటి కేబుల్ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను వార్నర్ బ్రదర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. హాలివుడ్‌లో అత్యంత విలువైన కెంపెనీగా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి బిగ్ డీల్ చేపట్టడం ఇదే తొలిసారి.
ఈ బిగ్ డీల్ కొనుగోలుతో హెచ్‌బీఓ నెట్‌వర్క్ నెట్‌ఫ్లిక్స్ సొంతం కానుంది. అలాగే ది సొప్రానోస్, ‘ది వైట్ లోటస్ వంటి హిట్ షోల లైబ్రరీలతో పాటు హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి సినిమా, టీవీ ఆర్కైవ్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్లనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అసాధారణమైన వినోదాన్ని అందిస్తామమని తెలిపింది.
Today, Netflix announced our acquisition of Warner Bros. Together, we’ll define the next century of storytelling, creating an extraordinary entertainment offering for audiences everywhere. https://t.co/rXPFMNIs1A pic.twitter.com/0pdsMUEob8
— Netflix (@netflix) December 5, 2025


