
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదటి వారం పూర్తి అయిపోయింది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) హౌస్ నుంచి బయటకు వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హోస్‌లో కొనసాగింది. మొదట ఫ్లోరా సైనీ(ఆషా షైనీ) ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో శ్రష్టి వర్మను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే, వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతుంది.
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభ పడింది లేదని చెప్పాలి. హౌస్‌లో ఆమె కేవలం వారంరోజులు మాత్రమే ఉండటంతో తను రెమ్యునరేషన్‌గా రూ. 2 లక్షలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది.
బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రీతూ చౌదరి, రాము రాథోడ్,సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్,సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్‌తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు శ్రేష్టి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆమె బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న నలుగురు పేర్లు చెప్పమని నాగార్జున కోరారు.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు.. భరణి, రీతూ చౌదరి, తనూజ, పేర్లు చెప్పింది.