బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమన్, భరణి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఒకే వారం వెళ్లిపోయారు. ఇప్పుడు హౌస్‌లో టాప్ 5 మిగిలారు. వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించే బాధ్యతను ప్రేక్షకుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. ఈ మేకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయం కాస్త పక్కనపెడితే ఆదివారం (డిసెంబర్ 14) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..
ప్రైజ్‌మనీతో ఏం చేస్తారు?
బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రైజ్‌మనీని రూ.50 లక్షలుగా ప్రకటించారు. ఈ ప్రైజ్‌మనీ మీ సొంతమైతే ఏం చేస్తారని నాగ్ అడిగాడు. భరణి వృద్ధాశ్రమానికి సాయం చేస్తానన్నాడు. ఇమ్మాన్యుయేల్.. తన ఇంటి అప్పు తీర్చేయడంతో పాటు ప్రియురాలిని బాగా చదివిస్తానన్నాడు. అలాగే తన అక్క పిల్లల చదువు, బాగోగులు అన్నీ చూసుకుంటానన్నాడు. డిమాన్ పవన్.. తండ్రికి క్యాన్సర్ ఉందని, ఆ ట్రీట్‌మెంట్ కోసం డబ్బు వాడతానన్నాడు. అలాగే అమ్మానాన్న కోసం ఓ ఇల్లు కడతానన్నాడు.
విరాళంగా ఇస్తా..
ప్రైజ్‌మనీని హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావ్? అని అడగ్గా.. కల్యాణ్‌కు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు. ఇద్దరం కామనర్స్ కాబట్టి తనతో పంచుకుంటానన్నాడు. తర్వాత సంజనా.. మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సంఘానికి కొంత విరాళం ఇస్తాను. కాళ్లు లేని పిల్లల కోసం కృత్రిమ కాళ్లు కొనిస్తాను, నా పిల్లల కోసం రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాను అంది. తనూజ పేద పిల్లల చదువుకు సాయం చేస్తానంది.

బంగారం కొనిస్తా
కల్యాణ్.. అనాథాశ్రమంలో ఒకరిద్దరిని దత్తత తీసుకుని వాళ్ల బాగోగులు చూసుకుంటాను. మా అమ్మకు వీలైనంత ఎక్కువ బంగారం కొనిస్తాను అని చెప్పాడు. తర్వాత తనూజను సెకండ్ ఫైనలిస్ట్‌గా, పవన్‌ను మూడో ఫైనలిస్ట్‌గా, ఇమ్మాన్యుయేల్‌ను నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రకటించారు. చివరగా భరణి, సంజన మిగిలారు. వీరిలో భరణి ఎలిమినేట్.. సంజనా ఐదో ఫైనలిస్ట్ అని ప్రకటించగానే ఇమ్మూ ఆనందంతో చప్పట్లు కొట్టాడు.
నాన్న దగ్గర ఆశీర్వాదం
భరణి వెళ్లిపోయేముందు తనూజ అతడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. గతంలో ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ హౌస్‌లోకి వచ్చిన భరణి.. ఈసారి బాగానే ఆడాడు. కానీ, ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అది సరిపోలేదు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన భరణి.. టాప్ 5లో ఉన్న ఐదుగురు ఫైటర్స్ అని ప్రశంసించాడు. కళ్యాణ్‌కు సైనికా, వందనం అంటూ సెల్యూట్ చేశాడు.
కప్పు గెలవాలి
సుమన్, కల్యాణ్‌ను ఏ రోజూ నామినేట్ చేయలేదు. కప్పు గెలిచే అర్హత నీకుంది అని బూస్ట్ ఇచ్చాడు. తనూజ.. నిన్ను కొన్నిసార్లు బాధపెట్టి ఉండవచ్చు. కానీ, నీకివ్వాల్సిన ప్రాధాన్యత నీకిచ్చాను. నాన్నా అని దగ్గరకు వస్తే దూరం తోసేంత దుర్మార్గుడిని కాదు. నువ్వు, దివ్య, సుమన్.. నాకు బెస్ట్ బెడ్డీస్ అన్నాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిన భరణి.. తనూజ మాత్రం కప్పు గెలవాలని కోరాడు.


