బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో టాప్-5 ఎవరనేది తేలిపోయింది. తనూజ, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీలు కప్ రేసులో ఉన్నారు. డిసెంబర్ 21న బిగ్‌బాస్ ట్రోఫీని అందుకునేది ఎవరనేది తేలనుంది. అయితే, శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా.. ఆదివారం నాడు భరణి హౌస్ నుంచి వచ్చేశారు. అయితే, రీఎంట్రీ ఇచ్చిన భరణి రెమ్యునరేషన్ పరంగా భారీగానే అందుకున్నాడు.
ఈ సీజన్‌లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఈ సీజన్‌లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరో వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌గా వచ్చినట్లు సమాచారం. కానీ, భరణి 8వ వారంలో హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో ఆరు వారాల పాటు కొనసాగారు. దీంతో అదే లెక్కన మరో రూ. 21 లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. రూ. 42లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా భరణి రికార్డ్ క్రియేట్ చేశారు.


