అజిత్ తన 64వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన ఆస్ట్రేలియాలో జరుగుతున్న అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అజిత్ ఇంతకుముందు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత కార్ రేస్ పోటీల్లో పాల్గొనడంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే మరోపక్క ఈయన నటించనున్న తన 64వ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
అదేవిధంగా సంబంధించిన కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న ప్రకటన కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రీలీల నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీలతోపాటు మరో నాయకి కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఆమె ఎవరో కాదు రెజీనా. ఈమె ఇంతకుముందు అజిత్‌తో కలిసి విడాముయర్చి చిత్రంలో నటించారన్నది గమనార్హం. అందులో ఆమె ప్రతినాయకి పాత్రలో నటించారు. అలాంటిది తాజా చిత్రంలో రెజీనా పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తి కలుగుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాత ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నది గమనార్హం.


