breaking news
Sanjana galrani
-
సంజనాకు పెద్ద శిక్ష వేసిన నాగ్.. శ్రీజను ఇరికించి, రీతూది మోసం కాదని..
అందరి నోటికాడ గుడ్లు దొంగతనం చేసిన సంజనాకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి, అవతలివారు బాధపడేలా కాదని హెచ్చరించాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించాడు. అంతే కాదు ఓ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అవేంటో అక్టోబర్ 4వ ఎపిసోడ్ హైలైట్స్‌లో మీరూ చూసేయండి..సంజనాను శిక్షించిన నాగ్సంజనాను దొంగ వేషాలు మానుకోమని తిట్టిపోశాడు నాగార్జున (Nagarjuna Akkineni). అంతేకాదు, ఓనర్ నుంచి తప్పించి టెనెంట్‌గా మార్చాడు. హౌస్‌లో ఏ పని కావాలన్నా సంజనాతో చేయించుకోవచ్చని ఆమెను శిక్షించాడు. ఇప్పటికైనా ఆమె తప్పు తెలుసుకోకుంటే మాత్రం సంజనా ఎక్కువకాలం హౌస్‌లో ఉండటం కష్టమే! మాస్క్ మ్యాన్ ఒంటరిగా ఉండటం గురించి చురకలు అంటించాడు నాగ్. ఇంట్లో ఉన్న వస్తువులకు, మీకూ తేడా లేనట్లే ఉందన్నాడు. గోల్డెన్ స్టార్తర్వాత కంటెస్టెంట్లకు పర్ఫామెన్స్ ఆధారంగా స్టార్ బ్యాడ్జ్‌లు ఇచ్చాడు. నాలుగు వారాలుగా కామెడీతో, ఆటతో, మాటతో మెప్పించిన ఇమ్మాన్యుయేల్‌కు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తర్వాత శ్రీజను లేపి.. నువ్వు ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావ్.. అంటూ కెప్టెన్సీ టాస్క్‌లో ఆమె సృష్టించిన గందరగోళం... దాని వల్ల కల్యాణ్- రీతూ, పవన్ మధ్య ఏర్పడిన అగాధం గురించి కాసేపు ప్రస్తావించాడు. శ్రీజ, సుమన్, రాము, డిమాన్, కల్యాణ్, భరణి, దివ్య, రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చాడు.తనూజను హెచ్చరించిన నాగ్హౌస్కు గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? ఈ బంధాలనేవి ఇంకా పెరిగితే భారంగా మారతాయి. ఏడుస్తూ ఉంటే అదే నీ ఆటను మంచేస్తుంది అని తనూజ (Thanuja Puttaswamy)కు సలహా ఇచ్చాడు. సంజనా- తనూజల పోపు గొడవ గురించి ప్రస్తావిస్తూ.. టీ కప్పులో తుపానులా.. మీ గొడవ పోపులో సునామీలా ఉందని సెటైర్లు వేశారు. రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్‌లో.. కల్యాణ్‌ను తీసేయమని చెప్పడం కరెక్టేనని వంత పాడాడు నాగ్. కానీ తప్పించడం ఒకటే కాదు, గెలిచి చూపించాలన్నాడు. కల్యాణ్‌పై ప్రశంసలుఅటు కల్యాణ్‌తో మాత్రం.. మూడువారాలు ఆడిందేమీ లేదు, కానీ ఈవారం అదరగొట్టావ్ అని మెచ్చుకున్నాడు. అలాగే (రీతూ చేతిలో) మోసపోయావనీ అన్నాడు. సంజనాకు అసిస్టెంట్‌లా ఉన్న ఫ్లోరాకు, ఒంటరివాడిగా మిగిలిపోయిన హరీశ్‌కు బ్లాక్ స్టార్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అనర్హులు అని ఓటింగ్ పెట్టగా మెజారిటీ ఫ్లోరాకు ఓట్లేసి ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో నాగార్జున ఆమెను వరుసగా రెండు వారాలకు నామినేట్ చేశారు.చదవండి: బిగ్‌బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే! -
సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్‌స్టోరీ
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్‌స్టోరీ చెప్పాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాది శాడిజం: హరీశ్సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్‌ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.నాలుగో కెప్టెన్తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ. మోసపోయానని బాధనన్ను గేమ్‌లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.చూడకుండానే లవ్తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్‌సిరీస్ హీరోహీరోయిన్ హౌస్లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్‌లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు. తనకోసం కప్పు గెలుస్తా..చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్‌బాస్‌కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్‌కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.చదవండి: అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార -
ఇంగ్లిష్ వచ్చా? ఎక్కడినుంచి వచ్చావ్? నోరు పారేసుకున్న సంజనా
గతంలో గౌతమ్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చి నెగెటివ్ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ ఓవర్ డైలాగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు సంజనా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మిడ్‌వీక్ ఎలిమినేట్ అయి వీకెండ్లో మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజనా.. బ్రేకులు ఫెయిలైన బండిలా నోటికేదొస్తే అది మాట్లాడేస్తోంది. మొన్న తనూజను చీప్ అంటూ తిట్టిన ఆమె ఇప్పుడు రాముపై మాటలు వదిలింది. అసలేం జరిగిందో నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..వెరైటీ నామినేషన్స్ఈవారం నామినేషన్స్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). హౌస్‌మేట్స్‌తో లూడో గేమ్ ఆడించాడు. కాకపోతే డైస్ తిప్పడం.. దాని ప్రకారం ఎవరు పావులు ముందుకు జరపాలన్నది కెప్టెన్ పవన్ చేతిలో పెట్టాడు. దాంతో అతడు తనకు నచ్చిన టీమ్‌కు ఛాన్సులిచ్చుకుంటూ పోయాడు. అలా ఓ గేమ్‌లో సుమన్ శెట్టి టీమ్(సుమన్, ఫ్లోరా, రాము రాథోడ్) గెలిచింది. కెప్టెన్సీలో పవన్‌కు ఫేవర్ చేశావంటూ పాత కారణమే చెప్పి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు సుమన్. సుమన్ టీమ్‌కే మరొకర్ని నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. రాము సంజనాను నామినేట్ చేశాడు.ఇంగ్లిష్ వచ్చా?మీ వల్ల హౌస్ హార్మొని చెడిపోతుంది... మేము అమ్మలం కాబట్టి ఇలా చూస్తున్నారు. వాళ్లు అమ్మాయిలు కాబట్టి అలా చూస్తున్నారు అన్న మాట నచ్చలేదని కారణాలు చెప్పాడు. దీనికి సంజనా (Sanjana Galrani) ఒప్పుకోలేదు. దీందో రామ్.. హౌస్‌లో మోస్ట్ ఆఫ్ ది వయొలెన్స్ అంటూ ఏదో చెప్పబోయాడు. వయొలెన్స్ అంటే అర్థం తెలుసా? ఇంగ్లిష్ తెలుసా? వయొలెన్స్ అంటే కొట్లాట.. అంటూ కించపరిచినట్లు మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడినుంచి వచ్చావో.. నువ్వు ఓపిక అనేది నేర్చుకో అని మరో మెట్టు దిగి మాట్లాడింది.హరీశ్ బెదిరింపులుఎక్కడినుంచి వచ్చావంటే ఏంటి అర్థం? అని రాము నిలదీయగా.. అందులో తపఏపముంది? నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత ఫ్లోరా.. తనను బెదిరించాడంటూ హరీశ్‌ను నామినేట్ చేసింది. నేను బెదిరించలేదు. తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకే సమస్యవుతుందని చెప్పాని వివరణ ఇచ్చాడు. అప్పటికీ తగ్గని ఫ్లోరా.. దివ్య మేకప్ సామాన్లు దొంగతనం చేయాలని హరీశ్ చెప్పారు. నామినేషన్స్‌లో ఆరుగురుకానీ దివ్య బట్టలు దొంగతనం అయినప్పుడు మాత్రం అది చాలా తప్పు అన్నారు. ఇదే డబుల్ ఫేస్ అంటూ బాగానే పాయింట్లు లాగింది. ఇంతలో రాము, తనూజ కూడా హరీశ్‌పై తమ పాయింట్లు చెప్పేందుకు మధ్యలో వచ్చారు. రీతూ.. శ్రీజను, శ్రీజ.. దివ్యను నామినేట్ చేశారు. ఇక ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ నామినేట్ అయ్యారు. ఏదేమైనా మనీష్, ప్రియల ఎలిమినేషన్‌తో శ్రీజలో మార్పు వచ్చింది. అరుపులతో ఓటింగ్‌లు పడవు అని అర్థమై సైలెంట్ అయిపోయింది. కోపాన్ని, గొడవలను కాస్త పక్కనపెట్టి ఓర్పుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు -
ఈ వారం నామినేషన్స్.. ఎవరెవరు ఉన్నారంటే?
బిగ్‌బాస్ 9 మూడు వారాలు పూర్తయింది. ఆదివారం ఎపిసోడ్లో కామనర్ ప్రియ ఎలిమినేట్ అయింది. దీంతో ఈసారి ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారా? అని అనిపించింది. కానీ బిగ్‌బాస్ మాత్రం సోమవారం ఈ ప్రక్రియ పెట్టకుండా ఇమ్యూనిటీ కోసం గేమ్స్ ఆడిపించాడు. ఇందులో తనూజ, సుమన్ శెట్టి గెలిచి.. నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయారు. కెప్టెన్ పవన్ ఎలానూ ఈ ప్రక్రియలో ఉండడు. మరి ఈ ముగ్గురు కాకుండా ఎవరెవరు నామినేషన్స్ లిస్టులో ఉన్నారు?నామినేషన్ ప్రక్రియని ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ముగ్గురు చొప్పున మూడు జట్లగా విడగొట్టి వాళ్లతో గేమ్ ఆడిపించారు. ముగ్గురికి కలిపి ఓ ఎలస్టిక్ తాడు ఉంటుంది. దీని సహాయంతో హౌస్‌లో ఉన్న ఓ వస్తువుని చేతులతో తాకకుండా కింద పడకుండా తీసుకొచ్చి బయట లాన్లో పెట్టాల్సి ఉంటుంది. గెలిచిన టీమ్ నుంచి ఒకరు వచ్చి ఓడిపోయిన జట్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్.. ఇంతకీ ఎవరితడు?)అలా రెండుసార్లు ఎల్లో టీమ్ గెలిచింది. దీంతో ఈ జట్టులోని సుమన్ శెట్టి, రీతూని నామినేట్ చేశాడు. రాము.. సంజనని నామినేట్ చేశాడు. మొత్తంగా చూస్తే ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. రీతూ, సంజన, హరీశ్, ఫ్లోరా, శ్రీజ, దివ్య ఉన్నారు. వీళ్లలో దివ్య గతవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చింది. శ్రీజ కూడా గతవారం నామినేట్ అయింది కానీ కెప్టెన్ పవన్ సేవ్ చేయడంతో బయటపడింది. ఈసారి మాత్రం నామినేషన్స్ నుంచి తప్పించుకోలేకపోయింది.అయితే నామినేషన్స్ లిస్ట్ చూస్తే ఈసారి శ్రీజ బయటకొచ్చేయడం గ్యారంటీ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే దివ్య కాకుండా మిగిలిన నలుగురు ఇప్పటికే నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయ్యారు. కాబట్టి వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఉంది. అలానే గతవారం వచ్చిన దివ్యపై ఆడియెన్స్‌లో కాస్త పాజిటివిటీ ఉండొచ్చు. అయినా సరే ఈమె కూడా శ్రీజతో పాటు డేంజర్ జోన్లో ఉండొచ్చు. మరి ఈ వీకెండ్ ఏం జరుగుతుందో? ఎవరు ఔట్ అవుతారో చూడాలి?ఈ వారం నామినేట్ అయినోళ్లుదివ్యఫ్లోరాహరీశ్రీతూసంజనశ్రీజ(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి 'ఓజీ'కి లేదుగా సాహో రేంజీ...) -
సంజనాను కాపాడుతున్న బిగ్‌బాస్.. తనూజపై నెగటివ్
బిగ్‌బాస్ సీజన్-9 నుంచి ప్రియ ఎలిమినేట్ తర్వాత శ్రీజలో కాస్త ఎక్కువ ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్‌లో శ్రీజ చాలా జాగ్రత్తగా తన ఆట ఆడింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనే స్ట్రాటజీ శ్రీజ వేసింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ కంటే ఇమ్యూనిటీ టాస్కులు పెట్టి బిగ్‌బాస్ తన పంతా మార్చుకున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ఇందులో భాగంగా ఇద్దరికి ముందుగానే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. సోమవారం ఎపిసోడ్లో కిచెన్ చుట్టూ సంజన, తనూజ మధ్య పెద్ద వార్ నడిచింది. అయితే, తనూజపై సంజనా చేసిన కామెంట్స్‌ను బిగ్‌బాస్ కొన్ని టెలికాస్ట్ చేయలేదు. కేవలం తనూజాదే తప్పు అన్నట్లుగా ఎపిసోడ్లో చూపించారు. లైవ్ చూసిన నెటిజన్లు ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు.సోమవారం ఎపిసోడ్ కిచెన్ నుంచే మొదలైంది. కొంచెం పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను సంజనా అడుగుతుంది. దీనికి తనూజ ఓకే చెప్పింది. దీంతో సంజనా కిచెన్ దగ్గరికెళ్లి అక్కడున్న దివ్య, కెప్టెన్ డీమాన్‌తో చెప్పకుండానే తనపని తాను చేసుకుంటుంది. అలా మీరే ఫుడ్ చేసుకుంటే ఎలా అంటూ వాళ్లిద్దరూ ఆమెను ఆపేస్తారు. ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేశాం మళ్లీ ఇది దేనికి అని డీమాన్ అడుగుతాడు. మరోవైపు దివ్య కూడా రెడీ అవ్వాలి ఎక్కువ టైమ్ లేదంటూ కెప్టెన్‌తో చెప్పింది. అప్పుడు శ్రీజతో చేయించుకుంటానని సంజన అంటుంది. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే తనూజ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మధ్యలో శ్రీజ ఎందుకు వచ్చిదంటూ తనూజ అడుగుతుంది. దీంతో సంజనా ఫైర్ అవుతుంది. అయ్యో ఏంటమ్మా చిన్న పోపు పెట్టుకుంటా అంటే ఇంత చేస్తున్నారు అంటూ తన నోటికి పని చెప్పింది. ఆమెకు కౌంటర్‌గా తనూజ కూడా వాయిస్ పెంచింది. నా డిపర్ట్మెంట్కి వచ్చి మీరు వాయిస్ రైజ్ చేయకండి అంటూ సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే వారి మధ్య జరిగిన వాదనను పూర్తిగా బిగ్‌బాస్ చూపించలేదు.సంజనా కావాలనే ట్రిగ్గర్ చేస్తుందా..?సోమవారం ఎపిసోడ్ చూసిన వారందరూ తనూజాది తప్పు.. సంజనానే కరెక్ట్ అనుకుంటారు. కానీ, బిగ్‌బాస్ లైవ్ చూసిన వారికి మాత్రమే అసలు విషయం తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో సంజనాది మొత్తం నెగటివ్‌నే ఉంటుంది. తనూజపై ఆమె దారుణమైన కామెంట్లు చేసినప్పటికీ వాటిని టెలికాస్ట్ చేయలేదు. దీంతో తనూజపై నెగటివిటీ కనిపిస్తుంది. బిగ్‌బాస్ లైవ్ చూసిన వారందరూ ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఆమె కావాలనే కంటెస్టెంట్స్‌ను ట్రిగ్గర్ చేస్తుందని అర్థం అవుతుంది. సంజనా రీఎంట్రీ కోసం తనూజ చేసిన సాయం గురించి తెలిసిందే. కానీ, దానిని కూడా తక్కువ చేస్తూ ఆమె ఇమాన్యూల్తో విమర్శలు చేస్తుంది. అదొక సాయమా ఏంటి అంటూ దాటేసింది. ఆపై తనూజకు సిగ్గు, లజ్జా లేదంటూ సంజనా విరుచుకుపడింది. అదొక చీప్, చెత్త, చీప్ మెంటాలటీ అంటూ తనూజపై నోటికి వచ్చిన మాటలు సంజనా అనేసింది. ఆపై శ్రీజను కూడా విమర్శించింది. తన కోసం దుస్తులు కూడా త్యాగం చేయలేదంటూ శ్రీజను కూడా తిట్టేసింది. ఇవన్నీ బిగ్‌బాస్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. దీంతో అందరూ సంజనానే కరెక్ట్ అంటూ అనుకోవడం సహజమే.ఇద్దరికీ ఇమ్యూనిటీఈ వారం నామినేషన్స్ నుంచి ఇద్దరికి ఇమ్యూనిటీ లభించింది. అందుకోసం 'వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు' అంటూ ఒక టాస్క్‌ను పెట్టారు. ఇందులో 12 మందిని ఇద్దరిద్దరు చొప్పున ఆరు టీములుగా బిగ్‌బాస్ విభజించాడు. అయితే, ఫైనల్‌గా సుమన్ శెట్టి, తనూజ తమ గేమ్‌తో పాటు ఇంటి సభ్యుల సపోర్ట్‌తో ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకున్నారు.Sacrifice chesina gratitude kuda ledu 🤮 siggu lajja anta 👎🏻#BiggBossTelugu9 pic.twitter.com/ewyzHv3atI— Voice 🏎️ (@Ak12Mr_) September 30, 2025 -
లత్కోర్ హరీశ్.. దారుణంగా అవమానించిన నాగ్! జుట్టు కత్తిరించుకున్న రీతూ
నామినేషన్స్‌లోనే లేని సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేసిన ఇంటిసభ్యులు.. ఏంటి? నిజమే? అంత సీన్ లేదు! అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్‌లోకి పంపించారు. సంజనాలోని వైల్డ్ఫైర్తో శనివారం ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గానే సాగింది. ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తనకోసం స్టాండ్ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది. బిడ్డా, బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్‌బాల్ ఆడాడని రాముపై మండిపడింది. త్యాగాలు చేస్తే హౌస్‌లోకి సంజనా..అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీశ్ ఒకే డ్రెస్సుతో నాలుగురోజులుగా వంటచేస్తున్నాడు, ఏం చెప్పినా వినడు, ఈ మనిషితో బతకడం కష్టం అని మాస్క్ మ్యాన్ గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇమ్మాన్యుయేల్‌ను కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది. తర్వాత సంజనాకు బై చెప్పిన నాగ్.. ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు. బిగ్‌బాస్ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు. కానీ, దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు. క్షణం ఆలోచించకుండా ఇమ్మూ తన కెప్టెన్సీ బ్యాండ్ తిరిగిచ్చేశాడు. జుట్టు కత్తిరించుకున్న రీతూతనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్ అయిపోయేవరకు వెళ్లకూడదన్నాడు. అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది. రీతూ చౌదరిని టామ్‌బాయ్ హెయిర్‌కట్ చేయించుకోవాలన్నాడు. నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది, తనకోసం జుట్టు కత్తిరిచ్చుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది. దీంతో దివ్య నిఖిత.. రీతూ హెయిర్ కట్ చేసింది. జుట్టు కట్ చేస్తుంటే చిన్న పిల్లా ఏడ్చింది రీతూ. శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్‌తోనే సీజన్ అంతా ఉండాలి.. తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్. ఒప్పుకోని సుమన్, శ్రీజఅందుకు శ్రీజ ఒప్పుకోలేదు. పోనీ సుమన్.. సిగరెట్స్ త్యాగం చేయాలన్నాడు.. సుమన్ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు. భరణి.. తనకెంతో ఇష్టమైన లాకెట్ బాక్స్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు. వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్రూమ్లో ఉన్న బాక్స్ తీసుకుని స్టోర్ రూమ్‌లో పెట్టి ఎమోషనలయ్యాడు. తనకోసం ఈ నలుగురూ ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్‌లో ఉండిపోయింది. ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్‌లోకి పంపారు. ఆమె రావడమే గిట్టని హరీశ్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అని కామెంట్ చేశాడు.లత్కోర్ పంచాయితీఇకపోతే నామినేషన్స్‌లో హరీశ్.. పవన్-రీతూలు చాక్లెట్ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయం గురించి ప్రస్తావిస్తూ లత్కోర్ పనులు అన్నాడు. దాని గురించి మాట్లాడేందుకు నాగ్.. లత్కోర్ హరీశ్ అని పిలిచాడు. నేను వ్యక్తిని అనలేదు, అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీశ్ వివరణ ఇచ్చాడు. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్ పదం తప్పు.. నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్ పీకాడు. ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చిన టాస్క్‌లో సంచాలక్‌గా తుత్తరపడ్డ శ్రీజకు.. మళ్లీ బిగ్‌బాస్ చెప్పేవరకు ఈరోజు వేసుకున్న డ్రెస్‌లోనే ఉండాలని కండీషన్ పెట్టాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ద ట్రయల్ 2 సిరీస్ రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే! -
బిగ్‌బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!
ఈసారి బిగ్‌బాస్ మరీ బోర్ కొట్టించేస్తోంది. కామనర్స్ అంటూ హడావుడి చేసి ఏకంగా ఆరుగురిని హౌసులోకి తీసుకొచ్చారు. వీళ్లు గేమ్స్ ఆడటం, ఎంటర్టైన్ చేయడం కంటే నస పెట్టడం, ఆటిట్యూట్ చూపించడమే ఎక్కువైపోతోంది. ఈ క్రమంలోనే గత రెండు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్‌తో పాటు చివరి నిమిషంలో లెక్కలు కూడా మారాయని తెలుస్తోంది. ఇంతకీ ఈసారి హౌస్ నుంచి ఎవరు బయటకొచ్చేశారు?వారమంతా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఎలిమినేషన్ అంటే ప్రేక్షకులు బిగ్‌బాస్‌పై కాస్త ఆసక్తి చూపిస్తారు. అలా ఇప్పటికే శ్రష్ఠి, మనీష్ బయటకొచ్చేశారు. దీంతో ఈసారి ఎవరొస్తారా అనే అందరిలో టెన్షన్. ఇలాంటి టైంలో వైల్డ్ కార్డ్ అంటూ మరో కామనర్ దివ్య నిఖితని ఇప్పటికే హౌసులోకి పంపించారు. ఈమె బదులుగా ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని అడగ్గా అందరూ సంజన పేరు చెప్పారు. దీంతో ఈమెని శనివారం ఎపిసోడ్‌లోనే స్టేజీపై తీసుకొచ్చేశారు. అయితే ఈమెని నిజంగానే ఎలిమినేట్ చేసేస్తారా? సీక్రెట్ రూంలోకి పంపిస్తారా అనేది ఈ రోజు తేలుతుంది.(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)మరోవైపు ఈ వారం నామినేషన్లలో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉండగా.. వీళ్లలో ప్రస్తుతానికైతే రాము ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో ఫ్లోరా సైనీ ఉందట. గత కొన్నిరోజులుగా హౌసులో కాంట్రవర్సీలకు కారణమవుతున్న రీతూ చౌదరి మూడో స్థానంలో ఉండగా.. చివరి మూడు స్థానాల్లో హరీశ్, కల్యాణ్, ప్రియ ఉన్నారట. అలా తక్కువ ఓట్లు పడిన ప్రియని ఈసారి ఎలిమినేట్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సామాన్యుల నుంచి రెండో వికెట్ పడ్డట్లే. సీజన్ ప్రారంభంలో ఈమె కచ్చితంగా కొన్ని వారాలైనా ఉంటుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత త్వరగా ఎలిమినేషన్ అనేసరికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ సీజన్ మొదలైనప్పుడు ప్రియ కాస్తంత ఫాలోయింగ్తోనే హౌసులోకి వచ్చింది. కానీ తర్వాత ఏం చేయకుండా ముచ్చట్లు పెట్టడం, సెలబ్రిటీలపైన యాటిట్యూడ్ చూపించడం లాంటివి మాత్రమే చేస్తూ వచ్చింది. గతవారం సుమన్ శెట్టితో గొడవ లాంటివి కూడా ఈమెకు ఓ రకంగా మైనస్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఇలా ఇన్నింటి వల్ల ఈసారి ప్రియకు తక్కువ ఓట్లు పడ్డాయని, ఫలితంగా ఎలిమినేట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఆదివారం ఎపిసోడ్‌తో ఈసారి డబుల్ ఎలిమినేషనా లేదంటే ప్రియ ఒక్కతే హౌస్ నుంచి బయటకెళ్తుందా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్‌లా సంజనా) -
మిడ్ నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు!
-
మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్‌లా సంజనా
బిగ్ షాక్.. సంజనా ఎలిమినేట్ అంటూ అందరిచెవిలో పూలు పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). అది నమ్మించడం కోసం ఆమెను ఇప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చారు. ఎలిమినేట్ అయినవాళ్లు ఎలాగైతే వీడ్కోలు చెప్తారో.. తనతోనూ అలాగే చెప్పిస్తూ భలే డ్రామా క్రియేట్ చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. సుమన్ స్టాండ్ తీసుకోడుఅందులో సంజనా (Sanjana Galrani).. నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా! అని అమాయకంగా ముఖం పెట్టింది. దానికి నాగార్జున.. దొంగతనం ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే చేస్తే వాళ్లకు కూడా చిరాకొస్తుందన్నాడు. ఇక ఇంటిసభ్యుల గురించి సంజనా మాట్లాడుతూ.. సుమన్ దేనికీ స్టాండ్ తీసుకోడు. హరీశ్.. ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు. ఏం బిడ్డా? తక్కువ చూశానా?ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. తనే గొప్ప.. తనే ప్రధానమంత్రి అని ఫీలవుతాడు. మనుషుల్ని తొక్కుతున్నాడు. అతడితో బతకలేం.. ఒక్కసారి కూడా తన తప్పు ఒప్పుకోడు. రాము (Ramu Rathod).. నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేసాన్రా బిడ్డా.. నేను చీప్ అమ్మాయినా? అని నిలదీసింది.రికార్డింగ్ ఉంది, ఊరుకో..అందుకు రాము.. నేను చీప్ అనలేదండి అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. రికార్డింగ్ ఉంది, ఊరుకో.. అని నోరు మూయించింది. భరణితో.. ప్రతిరోజు అన్నాచెల్లిలా ఉండాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటూ అతడిని కడిగిపారేసింది. ఇక ఇమ్మూ పేరెత్తగానే అటు ఇమ్మూ, ఇటు సంజనా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఒళ్లో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది అని ఏడ్చాడు. చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్ -
'బిగ్‌బాస్' సంజనాకు సుప్రీం కోర్ట్ నోటీసులు
డ్రగ్స్ కేసులో సినీ నటి సంజన గల్రానీకి సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2020లో కన్నడ పరిశ్రమను ఈ డ్రగ్స్ కేసు కుదిపేసింది. ఆ సమయంలో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు సినీ నటి సంజనా గల్రానీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో 14వ నిందితురాలిగా సంజనాను చేర్చారు. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ దొరకడంతో జైలు నుంచి విడుదలయ్యారు.సంజన గల్రానీపై కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాల వినియోగించడంతో పాటు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2024 మార్చి 25న, కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, Section 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్‌లో జరపలేమని పేర్కొంది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు సంజనా గల్రానీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు గురించి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.సంజన గల్రానీ మత్తు పదార్థాలు వినియోగించడమే కాకుండా నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పేర్కొన్నారు.. ఆర్థిక లాభాల కోసం పార్టీల సమయంలో ఆమె వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించిందని, అందుకు సంబంధించిన ఆధారాలను సుప్రీం కోర్టుకు అందించారు. సినీ, రాజకీయాలతో సంబంధం ఉన్న చాలామంది డ్రగ్స్ వాడినట్టు సమాచారం ఉంది. విచారణలో వారి పేర్లు చెప్పాలని సంజనాను గతంలోనే బెంగళూరు పోలీసులు కోరారు. కానీ, ఆమె ఆ వివరాలు చెప్పలేదని సమచారం. ఇప్పుడు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో మరిన్ని వివరాలు మళ్లీ తెరపైకి రానున్నాయి.బిగ్‌బాస్9లో సంజనబిగ్బాస్9 తెలుగు సీజన్లో సంజన గల్రానీ సత్తా చాటుతున్నారు. ఈ సీజన్‌కు హైప్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందారు. అయితే, ఎలిమినేషన్ పేరుతో ఆమెను సీక్రెట్ రూమ్‌కు బిగ్‌బాస్ పంపారు. ప్రస్థుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఆమె రాణిస్తున్నారు. -
మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్‌రూమ్‌కు!
ఏమాటకామాట.. ఈ సీజన్‌కు హైప్ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి సంజనా. ఆమె గుడ్డు దొంగతనం చేయకపోయుంటే హౌస్మేట్స్ అసలు రూపాలు, ఎమోషన్స్ అంత ఈజీగా బయటపడేవి కావు. నెగెటివ్ అవుతానని తెలిసినప్పటికీ షో కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న ఆమె కోరిక, తాపత్రయం మెచ్చుకుని తీరాల్సిందే! కానీ ఒక్కసారి క్లిక్ అయింది కదా అని పదేపదే దొంగతనాలు చేయడమే ఆమె విషయంలో నెగెటివ్‌గా మారుతూ వచ్చింది. అదే ఈరోజు కొంపముంచింది. అసలేం జరిగిందో చూసేద్దాం...మళ్లీ దొంగతనం.. ఈసారి శ్రీజ తోడుబిగ్బాస్ 9లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే హౌస్‌లో ఉన్నవారిని 1 నుంచి 13 ర్యాంకుల్లో నిల్చోబెట్టింది. టాప్ 7లో నుంచే కెప్టెన్సీ కంటెండర్లున్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. తనతోపాటు సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజను కంటెండర్లుగా ప్రకటించింది. వీళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. మరోపక్క సంజనా.. కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కాజేసి దాచిపెట్టింది. ఇందుకు శ్రీజ కూడా సాయం చేసింది. ఆమె బట్టల్ని కొట్టేయడమనేది చాలామందికి నచ్చలేదు. ఈ దొంగతనమే ఆమెను ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.అర్ధరాత్రి సైరన్ మోగించిన బిగ్బాస్ఇక బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు సడన్‌గా ఏదో గుర్తొచ్చినవాడిలా అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటిసభ్యులను నిద్రలేపాడు. చక్రవ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది.. ఇప్పటివరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు ఎరుపు రంగు విత్తనాలు పొందినవారి వంతు.. వారికి ఇంట్లో ఒకర్ని బయటకు పంపే అధికారాన్నిస్తున్నా.. దివ్య నేను పంపిన సభ్యురాలు, ఫ్లోరా ఇమ్యూనిటీ గెల్చుకుంది. కాబట్టి వీరిద్దరూ మినహా.. రెడ్ సీడ్ పొందనివారిలో నుంచి ఒకర్ని బయటకు పంపాలన్నాడు. అందరి నిర్ణయం ఒక్కటేదీంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీశ్, కల్యాణ్, పవన్, రాము చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీశ్.. ఈ షోని దొంగతనాల షో అనిపించుకోవడం నాకిష్టం లేదు. అన్నీ దొంగిలిస్తుంది.. తనది సైకో ఆనందం అంటూ సంజనా (Sanjana Galrani) పేరు చెప్పాడు. దివ్య విషయంలో అలా చేయడం నచ్చలేదని భరణి కూడా వంతపాడాడు. అందరూ ఆమె పేరే నిర్ణయించుకుని చెప్పారు. అప్పుడు సంజనా మాట్లాడుతూ.. ఈరోజు చేసిన దొంగతనంలో నేను ఒంటరిగా లేను. సంజనా అవుట్.. ఏడ్చేసిన ఇమ్మూఅలాగే దివ్య నాకు మూడో ర్యాంక్ ఇచ్చింది. నేను స్ట్రాంగ్, కాంపిటీషన్ కాబట్టే కార్నర్ చేసి పంపించేయాలనుకుంటున్నారు. ఎవరినీ నేను హర్ట్ ఏయలేదు. అందరితోనూ స్వీట్‌గానే ఉన్నాను. ఈ షో కోసం నేను 100% కాదు, 500% ఎఫర్ట్స్ ఇచ్చాను అంది. సంజనా వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయేల్ పిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు నువ్వే గెలవాలంటూ సంజనా అతడికి ధైర్యం చెప్పి బయటకు వెళ్లిపోయింది. అటు ఇమ్మూ మాత్రం కన్నీళ్లు ఆపలేదు.ఒంటరివాడ్ని అయిపోయా!నెగెటివ్ అయినా పర్లేదు, షో కోసం ఏదో ఒకటి చేస్తా.. నేను తప్పులు చేసేటప్పుడు దగ్గరకు రావొద్దని నన్ను దూరం పెట్టేది. ఇప్పుడు ఒంటరివాడ్ని అయిపోయా! ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదు. తను రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడ్చేది. రెండువారాలు ఏడుస్తూనే ఉంది. ఏరోజూ బాధను బయటకు చూపించేది కాదు అని ఏడుస్తుంటే సీక్రెట్ రూమ్‌లో ఉన్న సంజనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భరణి, హరీశ్, రాము కూడా.. తను సీక్రెట్ రూమ్‌లో ఉండొచ్చని బలంగా నమ్మారు.చదవండి: దీపికా పదుకొణెకు మరో బిగ్ సినిమా ఛాన్స్ -
సంజనా ఎలిమినేట్! వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఈవారం మొదట్లో హౌస్‌మేట్స్‌కు కొన్ని ఫలాలిచ్చాడు. అందులో రంగురంగుల విత్తనాలున్నాయి. నీలిరంగు విత్తనం అందుకున్నవారు ఫ్యామిలీ నుంచి సర్ప్రైజ్లు అందుకున్నారు. నలుపు రంగు విత్తనం అందుకున్నవారు ఇమ్యూనిటీ కోసం పోటీపడ్డారు. ఇప్పుడిక ఎరుపు విత్తనం అందుకున్నవారికి పెద్ద టాస్కే ఇచ్చాడు బిగ్‌బాస్.గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్హౌస్లో ఒకర్ని బయటకు పంపాలన్నాడు. ఈ షోని దొంగతనాల షోగా మార్చడం నాకిష్టం లేదంటూ సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సూచించాడు హరీశ్. భరణి, రాము, డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ అందరూ కలిసి చర్చించుకున్నారు. మెజారిటీ సభ్యులు సంజనాకే ఓటేశారు. దీంతో సంజనాను వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లమన్నాడు బిగ్‌బాస్. ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ, ఈ ఎలిమినేషన్ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది.నామినేషన్స్‌లోనే లేదుఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. అప్పటివరకు సీక్రెట్‌రూమ్‌లో ఉంచుతారు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్‌కు దాదాపు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే సంజనా అసలు నామినేషన్స్‌లోనే లేదు. అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఇదంతా స్టంట్ అని అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. చదవండి: 8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్! -
సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. నటి లవ్‌స్టోరీ
డిమాన్ కెప్టెన్ అవ్వడం కోసం అడ్డదారులు తొక్కిన రీతూ చౌదరి (Rithu Chowdary)కి పెద్ద ఝలక్ తగిలింది. కెప్టెన్‌గా డిమాన్ ఒకర్ని సేవ్ చేయొచ్చంటే అతడు రీతూకి బదులుగా శ్రీజను సేవ్ చేశాడు. అది చూశాక రీతూ.. నా హార్ట్ బ్రేక్ అయిందంటూ ఏడ్చేసింది. అటు శ్రీజ.. ఓనర్లందరూ కలిసి తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదన్నారంటూ ఏడుపు అందుకుంది. దీంతో ఇమ్మూ రంగంలోకి దిగి నువ్వు నా చెల్లివి.. అని ఓదార్చడంతో తను కుళాయి కట్టేసింది. తర్వాత బిగ్‌బాస్ రీతూను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. చికెన్ కోసం సీక్రెట్స్ బట్టబయలుఅక్కడ తనకెంతో ఇష్టమైన చికెన్ ఎదురుగా కనిపించేసరికి ఏడుపు ఆపుకోలేకపోయింది రీతూ. అమ్మ, అన్నయ్య నాకు ప్రేమగా చికెన్ చేసి పెడతారు.. అంటూ వాళ్లను గుర్తు చేసుకుంది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల రహస్యాలు చెప్తేనే ఆ చికెన్ తినొచ్చన్నాడు. తనూజకు.. కల్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ పైకి మాత్రం చూపించదు. అతడు దగ్గరుంటే తను సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. డిమాన్ గురించి అడగ్గా.. పవన్ సింగిల్, గతంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ తనకు కరెక్ట్‌గా ప్రపోజ్ కూడా చేయలేదు.సీక్రెట్ చెప్పి సంజనాదీంతో తను వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పటివరకు ఎవర్నీ సరిగా ప్రేమించలేదన్నాడు. ఇప్పుడైతే నా మీద మంచి అభిప్రాయం ఉందన్నాడు అని ఉన్నదంతా చెప్పేసింది. ఇవి అందరికీ తెలిసినవేగా! మంచి రహస్యాలు కావాలన్నట్లుగా బిగ్‌బాస్ డిమాండ్ చేశాడు. దీంతో రీతూ.. సాయంత్రం లోపు కనుక్కుని మంచి సీక్రెట్స్ చెప్తానంది. అలా సంజనా దగ్గర ఓ రహస్యాన్ని కనుక్కుంది. సంజనా మాట్లాడుతూ.. కాలేజీలో ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. అయితే, అతడు నన్ను కొట్టేందుకు ప్రయత్నించాడు. నా తలపై కొడితే కుట్లు వేస్తారు.. ముఖం పాడవుతుంది, హీరోయిన్ కాలేను, అప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చనుకున్నాడు. సినిమా చూపిస్తాతర్వాత మా మధ్య గొడవై నేను వదిలేశాను. అప్పుడతడు పిచ్చోడై గడ్డం, మీసాలు పెంచాడు. ఓ రోజు కారు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పింది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీల గురించి అందరికీ హింటిచ్చాడు. నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆటను నా చేతిలోకి తీసుకోబోతున్నా.. అసలు సినిమా ఎలా ఉంటుందో వచ్చేవారం చూపిస్తా.. జరగబోయేది మీ ఊహకు మంచి ఉండబోతోంది అన్నాడు. గార్డెన్ ఏరియాలో చెట్టుపై ఎవరి పేర్లు రాసి ఉన్న పండ్లను వారు తీసుకోవాలన్నాడు. అందులోని విత్తనం మీ భవిష్యత్తును సూచిస్తుందన్నాడు. అప్పుడే ఇంటి నుంచి సందేశాలుఅయితే ఫలాన్ని మార్చుకోవాలనుకునేవారు ముందుకు రమ్మంటే రీతూ, ప్రియ, శ్రీజ ముందుకొచ్చారు. దీంతో వాళ్లు తమ పండ్లకు బదులుగా బిగ్‌బాస్ పంపిన మరో మూడు పండ్లను తలా ఒకటి తీసుకున్నారు. ఒక్కో రంగు విత్తనం దేన్ని సూచిస్తుందనేది సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాడు. ముందుగా బ్లూ విత్తనం వచ్చినవారి (ఇమ్మాన్యుయేల్, సంజన, సుమన్ శెట్టి, తనూజ, ప్రియ)కి బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఏడ్చేసిన ఇమ్మూఇంటి నుంచి వచ్చిన సందేశాలను, జ్ఞాపకాలను గెలుచుకోవాలన్నాడు. ఇందుకోసం 100% ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగా.. తండ్రి లెటర్ కావాలంటే బ్యాటరీలో 45%, తల్లి ఆడియో మెసేజ్ కావాలంటే 35%, ఫ్యామిలీ ఫోటో కావాలంటే 25% బ్యాటరీని వాడాల్సి ఉంటుందన్నాడు. అన్నింటికంటే తక్కువ బ్యాటరీ ఖర్చయ్యే ఫోటోను ఇమ్మూ సెలక్ట్ చేసుకుని ఎమోషనలయ్యాడు. చదవండి: రాజకీయాల్లోకి హీరో వరుణ్ సందేశ్ తల్లి -
హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్
బిగ్‌బాస్ షోలో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, అతి చేష్టలతో ఎలిమినేషన్ ఏరికోరి తెచ్చుకున్నాడు. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కామనర్‌గా నిలిచాడు. వెళ్తూ వెళ్తూ కామనర్‌పై ఓ బిగ్‌బాంబ్ విసిరాడు. మరి సండే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.. రీతూ చౌదరి వల్ల కెప్టెన్సీ పెంటపెంటయింది. దీంతో కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేసి మళ్లీ గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ కష్టపడి కెప్టెన్సీ సాధించుకున్నాడు. తర్వాత ఓ ఫన్ గేమ్ ఆడించగా అందులో కామనర్స్ గెలిచారు.మనీష్ ఎలిమినేటెడ్ఇక నాగ్ ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ రాగా చివరకు ఫ్లోరా, మనీష్ (Manish Maryada) మిగిలారు. ఎలాగో ఫ్లోరా ఎలిమినేషన్ ఖాయమని ఫిక్సయిన కామనర్లు.. ఆమెకు ఆల్ ద బెస్ట్, మిస్ యూ అంటూ డైలాగులు చెప్పారు. తీరా ఫ్లోరా సేఫ్, మనీష్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించగానే అందరూ నోరెళ్లబెట్టారు. మనీష్ వెళ్లేముందు అతడితో ఓ గేమ్ ఆడించారు. ఈ షోలో టాప్ 3 ఎవరు? బాటమ్ 3 ఎవరు? చెప్పాలన్నాడు. బాటమ్ 3లో శ్రీజఅందుకు మనీష్ ముందుగా బాటమ్ 3లో శ్రీజ (Dammu Srija) పేరు చెప్తూ తను గేమ్ సరిగా ఆడట్లేదన్నాడు. తర్వాత ఫ్లోరా సైనిని బాటమ్‌లో పెడుతూ.. ఆమె పని తప్ప గేమ్ కనిపించట్లేదన్నాడు. సుమన్‌ను కూడా బాటమ్ 3లో యాడ్ చేశాడు. సుమన్ అన్నా.. హ్యాట్సాఫ్. మీరు ఏం ఆడుతున్నారన్నా.. నేనసలు ఊహించనేలేదు. అయినా బాటమ్‌లో ఎందుకున్నారంటే.. అలా కనిపించి, ఇలా వెళ్లిపోతారు. మీకంటూ ఓ స్టాండ్ తీసుకోరు అని చెప్పుకొచ్చాడు. తర్వాత టాప్ 3 గురించి మాట్లాడాడు. ఆయనే నెం.1నా ప్రకారం భరణిగారు నెం.1. ఆయన అందరి కోసం ఆలోచిస్తారు, మరోపక్క గేమ్ కూడా ఆడతారు. మీరు చాలా స్ట్రాంగ్ కంటెండర్. మీలాంటివాళ్లతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు, మీతో ఫైట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్.. మొదట ఇతడిని నేను సీరియస్‌గా తీసుకోలేదు. కామెడీ చేస్తారంతే అనుకున్నా.. కానీ ఇచ్చిపడేసిండు. కామెడీ, ఎమోషన్స్, గేమ్.. అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని తప్పకుండా టాప్ 3లో చూడాలనుకుంటున్నా.. వేరేవాళ్ల కోసం ఆటను వదిలేయకండి అని సూచనలిచ్చాడు.అపార్థం చేసుకున్నా..కామనర్ల నుంచి ఏకైక వ్యక్తిని టాప్ 3లో చేర్చాడు. అతడే హరీశ్. ఎమోషన్స్ దగ్గరే ఆగిపోకండి. కొంచెం కోపం తగ్గించుకుంటే టాప్ 1కి వెళ్తారు అన్నాడు. తర్వాత నాగార్జునను అడిగి మరో వ్యక్తిని టాప్ 4గా వెల్లడించాడు. ఆవిడే సంజన. సంజనను నేను ఎంత అపార్థం చేసుకున్నానో తర్వాత అంత అర్థం చేసుకున్నాను. నాకు, తనకు ఇంట్లో ఏ పనీ లేదు. అయితే పని రాలేదు కాబట్టి తనే పని తెచ్చుకుంటా.. అది కూడా గేమే అంది. అప్పుడే నాకు మైండ్ బ్లాక్ అయింది.రాత్రి ఒంటరిగా కన్నీళ్లుపగలంతా అందర్నీ సతాయిస్తుంది. రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఎక్కువ మిస్ అయ్యేది సంజననే.. అని ఎమోషనలయ్యాడు మనీష్. అందరినీ పని అడిగాను, ఎవరూ ఇవ్వలేదు. ఈమె ఒక్కరే నాకు వర్క్ ఇచ్చింది. తనకు నేను వంట చేసి పెట్టాను. మీరు టాప్ 3లో ఉండాలి. భాష నీకు అడ్డు కాదు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనీష్ ధైర్యం చెప్పాడు. జైల్లోకి ఫ్లోరా..అందుకు సంజనా.. నేను తెలుగమ్మాయినే, నాకు భాష ఏం అడ్డం కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో మోస్ట్ బోరింగ్ మనిషిగా ఫ్లోరాను ఎంపిక చేశారు. దీంతో ఆమె జైల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆమె చేసే వాష్‌రూమ్ డ్యూటీ టెనెంట్స్‌లో ఒకరికి వేయాలన్నాడు నాగ్. దీంతో ఈ బిగ్‌బాంబ్‌ను మనీష్ ఇది నా రివేంజ్ అంటూ ప్రియకు ఆ క్లీనింగ్ పని అప్పగించి సెలవు తీసుకున్నాడు.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్ కామెంట్స్
ఒక్కసారి నోరు జారితే ఆ మాటను తిరిగి తీసుకోలేం. ఆ విషయం తెలిసి కూడా చాలామంది అదేపనిగా నోరు జారుతూ ఉంటారు. తీరా తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుంటారు. బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో అదే జరిగింది. నిన్న బిగ్‌బాస్ టెనెంట్లకు ఓనర్లయ్యే అవకాశం కల్పించాడు. ఒక్కో రౌండ్లో ఎలిమినేట్ అయినవారు మిగతావారిలో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చన్నాడు.గాజులేసుకుని కూర్చోండిదాంతో సంజనా, ఫ్లోరా.. ఫస్ట్ సుమన్‌ను టార్గెట్ చేసి అతడు ఎలిమినేట్ అయ్యేలా చేశారు. అయితే సుమన్ (Suman Shetty) కాసేపు ఆడకుండా సోఫాలో కూర్చున్నందుకు అతడిపై సెటైర్లు వేసింది. మీరు మమ్మల్ని చెడ్డోళ్లను చేసి మీరు గాజులేసుకుని కూర్చోండి అని సుమన్‌పై ఫైర్ అయింది. అందుకతడు మీరెప్పుడో చెడ్డోళ్లయ్యారు అని కౌంటర్ ఇచ్చింది. సంజనాకు వార్నింగ్ఇక అక్కడే ఉన్న శ్రీజ.. అలాంటి మాటలు మాట్లాడొద్దంటూ సంజనాకు వార్నింగ్ ఇచ్చింది. సంజనా కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. మాస్క్ మ్యాన్ హరీశ్.. ఆడవాళ్లను చాలా చులకన చేసి మాట్లాడాడంటూ గతవారం నాగార్జునతోనే వాదించింది సంజనా. మరిప్పుడు తనే స్వయంగా.. సుమన్‌ను గాజులేసుకుని కూర్చోండి అనడంలో అర్థమేంటి? అంటే, ఆడవారికి ఏదీ చేతకాదు, ఓ మూలన కూర్చోమనా? ఈ కామెంట్స్‌తో ఆమె స్త్రీలను అవమానించట్లే అవుతుంది కదా! క్షమాపణలు కోరిన సంజనాఆవేశంలో నోటికి ఎంతొస్తే అంత వాగుతారా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇకపోతే గేమ్ అయ్యాక తన తప్పు తెలుసుకున్న సంజనా.. సుమన్‌కు సారీ చెప్పింది. నీ చెల్లి అనుకుని క్షమించమని కోరింది. దీంతో అతడు కూడా ఆమె సారీని యాక్సెప్ట్ చేశాడు. మరి నాగార్జున ఈ విషయాన్ని ప్రస్తావించి సంజనాకు క్లాస్ పీకుతాడో? లేదో? చూడాలి! We stand with #SumanSetty anna.Worst #SanjanaGalrani 💦She degraded women by saying they’re only capable of wearing bangles and sitting.Last week she tried assassinate #Harish #Maskman character using the same point.What sanjana did is actually insulting women. 🤬… pic.twitter.com/tpKSWotVi4— Guru (@Guruprasath_02) September 19, 2025 చదవండి: నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? -
4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లుంది కథ! హౌస్‌లో గుడ్డు దొంగతనం చేసింది సంజనా.. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజనా ఐదు నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్లందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండోవారం నామినేషన్స్‌లో ఎవరున్నారో చూసేద్దాం..తలతిక్క సమాధానాలునాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీశ్‌ను రీతూ చౌదరి (Rithu Chowdary) నామినేట్ చేసింది. నేను తినను, వెళ్లిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా.. అంది. దీనికి హరీశ్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం.. నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి. నాపై ముద్ర వేశారునేను చరిత్రహీనుడని ముద్రవేశారు కదా.. దాన్నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతూ అంది. అప్పటికీ తగ్గని హరీశ్ (Mask Man Harish) టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలనడంతో రీతూ ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతీ కార్డ్ అన్నాడు హరీశ్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతీ కార్డే అని రీతూ ఇచ్చిపడేసింది.దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండితర్వాత శ్రీజ కూడా హరీశ్‌ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయేల్‌ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్‌గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయేలే బాడీ షేమింగ్ చేశాడంటూ హరీశ్ మళ్లీ ఫైరయ్యాడు. మా మధ్య ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండి, పంపిస్తే వెళ్లిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్‌బాస్ కెప్టెన్ సంజనాకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకర్ని నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు.సుమన్‌ను బలి చేసిన కెప్టెన్ సంజనాదీంతో ఆమె.. ఆరోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8మందిమే అని నన్ను పక్కనపెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు.. ఆ తొమ్మిదో వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? నేను అయ్యుండొచ్చుగా అని కౌంటరిచ్చాడు. ఇక ఫైనల్‌గా భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. మరోవైపు లైవ్‌లో తనూజ ఎంతో బతిమాలడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడంట హరీశ్!చదవండి: 'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక అసలు నిజం చెప్పిన పేరేంట్స్! -
నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కామనర్స్ కామన్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లను ఓనర్లను చేయగానే నిజమైన ఓనర్లలా తెగ ఫీలైపోతున్నారు. టెనెంట్స్/సెలబ్రిటీలతో కావాల్సినన్ని పనులు చేయించుకుంటూ వారితోనే చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. అలా ఈ వారం చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటి లెక్కలు సరిచేసేందుకు శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చేశాడు.కామనర్స్‌కు క్లాస్ పీకిన నాగ్సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ మధ్య ఏర్పడిన విభేదాలను క్లియర్ చేశాడు. ఫ్రీ బర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేవి తప్పు పదాలు కావని క్లారిటీ ఇచ్చాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. చివరకు ఆ తప్పును తనూజ మీదకే నెట్టేసిన కామనర్స్ ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు. అలాగే గుండు అంకుల్ కామెంట్‌పై పెద్ద చర్చే జరిగింది. ఇమ్మాన్యుయేల్ నిన్ను గుండంకుల్ అనడం తప్పే, మరి దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ అని నువ్వు అనడం తప్పు కాదా? అని మాస్క్ మ్యాన్ హరీశ్‌ను నిలదీశాడు నాగ్.రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా?అందుకతడు తను దురుద్దేశంతో ఆ మాట అనలేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగైతే గుండంకుల్ కూడా సరదాగా అన్నాడనుకోవచ్చుగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్. అగ్నిపరీక్ష కోసం గుండు చేయించుకున్నా.. అలాంటిది నాపై జోక్ వేస్తే తీసుకోను, బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు హరీశ్. గుండంకుల్ అన్నందుకు ఇమ్మాన్యుయేల్‌తో సారీ చెప్పించుకున్నావ్.. మరి రెడ్ ఫ్లవర్ అన్నందుకు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదా? అని ప్రశ్నించాడు. వీడియో బయటకు లాగిన నాగ్అప్పటికే ముఖంలో నెత్తురు చుక్క లేని హరీశ్ (Haritha Harish).. సారీ బ్రదర్, అవసరం అయితే ఈ షో నుంచి వెళ్లిపోతా అని అసందర్భంగా మాట్లాడాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా హరీశ్ గురించి ఓ వీడియో ప్లే చేశాడు నాగ్. అందులో హరీశ్.. 'ఇమ్మాన్యుయేల్ ఆడాళ్లతో అయితేనే మాట్లాడతా అన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఈ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది' అని మాట్లాడాడు. ఇందులో ఆడాళ్లపై హరీశ్‌కు చిన్నచూపు ఉందని క్లియర్‌గా అర్థమైందని రీతూ తప్ప హౌస్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.అడ్డంగా వాదించిన మాస్క్ మ్యాన్కానీ మోనార్క్ హరీశ్ మాత్రం.. ఆడాళ్లను తక్కువ చేయలేదన్నాడు. పైగా.. నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్‌ను రాంగ్గా చిత్రీకరిస్తున్నారు అని హౌస్‌మేట్స్‌తో పాటు నాగ్పైనా ఆవేశపడ్డాడు. ఆ మాటతో నాగ్.. ఎవరు రాంగ్ సెట్ చేస్తున్నారు? అని ఫైర్ అయ్యాడు. అక్కడున్న లైవ్ ఆడియన్స్‌ని అడగ్గా వారు కూడా.. హరీశ్ ఫ్లిప్ అవుతున్నాడని చెప్పడంతో మాస్క్ మ్యాన్ దండం పెట్టేశాడు. ఎవరెన్ని చెప్పినా హరీశ్ మాత్రం తలపొగరుతో తను చెప్పిందే కరెక్ట్ అని అడ్డంగా వాదించాడు.చదవండి: ‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్ -
'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్
బిగ్‌బాస్ 9లో ఐదు రోజులు విజయవంతంగా పూర్తయింది. అలానే వీకెండ్ వచ్చేసింది. దీంతో హోస్ట్ నాగార్జున.. హౌస్మేట్స్ ముందుకు వచ్చేశారు. ఓవైపు అందరినీ సరదాగా నవ్విస్తూనే మరోవైపు తనదైన స్టైల్లో కౌంటర్స్ వేశారు. ఈసారి కెప్టెన్ సంజనకి కాస్త గట్టిగానే పంచులు పడ్డాయి. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోంది. మరోవైపు శనివారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందా అనేది ప్రోమోతో కాస్త క్లారిటీ ఇచ్చారు. వస్తూవస్తూనే అందరిని పలకరించిన నాగార్జున.. రాము రాథోడ్ బట్టలు ఉతకడం గురించి, ఇమ్మాన్యుయేల్.. హరీశ్‌ని గుండంకుల్ అనడం గురించి పంచులు వేశారు. అలానే సంజన.. ఫ్లోరా రిలేషన్ గురించి కల్పించుకోవడంపైన స్పందించారు.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రాము రాథోడ్‌కి తన రిలేషన్ టాపిక్ గురించి చెబుతుంటే మధ్యలో వచ్చిన సంజన.. తనని ఫ్రీ బర్డ్ అనడం అస్సలు నచ్చలేదని ఫ్లోరా, నాగార్జునకు కంప్లైంట్ చేసింది. తను చెబుతున్నప్పుడు సంజన మధ్యలో దూరడం కరెక్ట్ కాదనేది ఫ్లోరా వాదన. కానీ సంజన మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్రీ బర్డ్ అనడం తప్పెలా అవుతుందని అడిగింది. కెప్టెన్ అయిన తర్వాత సంజన.. తనకు కాఫీ ఇవ్వొద్దని హౌస్‌మేట్స్‌తో చెప్పిందని ఫ్లోరా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కాఫీ టాపిక్కే రాలేదని సంజన చెప్పింది గానీ మిగతా టీమ్ మేట్స్ మాత్రం సంజన అలానే అనిందని క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ ఏదీ ఇవ్వకూడదని మిమ్మల్ని మందలించినప్పుడు రాముకి టీ ఇవ్వాలని మీరు ఎలా డిసైడ్ చేశారు? అని సంజనని నాగ్ అడిగాడు. ఇలా అడిగిన అన్ని ప్రశ్నలకు సంజన ఎలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?) -
ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ కూడా!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్‌బాస్ షోకి కావాల్సిన కంటెంట్ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచింది.సత్తా చూపించిన రాముఅయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో కామనర్లు అతి చేశారు. పవన్ కల్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్‌పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్ అయింది.బాడీ షేమింగ్నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజనా.. తన లగేజీకి రూమ్‌లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్‌బాస్ చాక్లెట్లు, చిప్స్ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు. ముగ్గురు ఆడోళ్లుఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.దొంగతనం చేసిన మాస్క్ మ్యాన్కెప్టెన్ సంజనా హౌస్‌మేట్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్‌డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్ ఓ కూల్‌డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్‌డ్రింక్ ఇచ్చేముందు ఓ కూల్‌డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి! -
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
-
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్‌ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్‌బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్‌గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్‌ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్‌గా నిలబడేవారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్‌కు భరణి, సంజనకు శ్రీజ, పవన్‌కు ప్రియ, హరీశ్‌కు పవన్ కల్యాణ్ సపోర్ట్‌గా వచ్చారు.సంచాలక్‌గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్‌ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్‌కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్‌ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్‌ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్‌గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్‌గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్‌ఫెయిర్ అంటూ అని మనీష్‌ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్‌గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్‌బాస్‌కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్‌లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ -
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలుపెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికేవాళ్లుంటారు. ఈ సీజన్లో కూడా మూడు రోజుల్లోనే కావాల్సినదానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజనా (Sanjana Galrani)! ఈమె సరదాసరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతోంది. నిజంగా గొడవపడితే హౌస్ ఏమైపోతుందో మరి!అందరికీ పూనకాలు తెప్పిస్తున్న సంజనాతను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్‌లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజనా మాత్రం తాపీగా సోఫాలో కూర్చుని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఆ ఒక్క సీన్ చాలు.. నువ్వుండాలమ్మా.. కచ్చితంగా ఉండాల్సినదానివే! అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటోంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ, అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్‌లో ఈమెనే అందరికంటే హైలైట్‌గా నిలుస్తోంది.కెప్టెన్‌గా..ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలక్ట్ చేయమని బిగ్‌బాస్ సంజనాకు బాధ్యత అప్పగించాడట! దాంతో ఆమె హరీశ్, శ్రష్టి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్‌లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి కెప్టెన్సీ సంజనా చేతికి చిక్కిందట! గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడదే ఇంట్లో కెప్టెన్ బెడ్రూమ్లో దర్జాగా సేద తీరనుంది సంజనా. కెప్టెన్‌గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాలి!చదవండి: 5 నెలల పాప.. గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?: సంజనా ఫైర్ -
బిగ్‌బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో మొదటివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. కామనర్స్ నుంచి డిమాన్ పవన్, సెలబ్రిటీలలో భరణి మినహా మిగతా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఈ షోకి కావాల్సిన కంటెంట్ నేనిస్తానంటూ ఫుల్ జోష్ మీదుంది సంజనా. మొన్న షాంపూ కోసం పంచాయితీ పెట్టిన ఆమె నిన్న గుడ్డు దొంగిలించి అందరికీ బీపీలు వచ్చేలా చేసింది. గుడ్డు ఎవరు కొట్టేశారో అర్థం కాక ఓనర్స్ (కామనర్స్) తల పట్టుకున్నారు. టెనెంట్స్లోనే అసలైన దొంగ ఉన్నాడని తెలిసి వాళ్లందరిపైనా ఒంటికాలిపై లేచారు.అందరి అనుమానం తనపైనేమీరు ఇంట్లో అడుగుపెట్టేదే లేదని టెనెంట్స్‌పై ఆంక్షలు విధించారు. అయితే అందరి అనుమానం సంజనా (Sanjana Galrani)పైనే.. కానీ ఆమె మాత్రం ఓపక్క నవ్వుతూ, మరోపక్క అమయాకంగా ముఖం పెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. ఈ క్రమంలో భరణి, హరీశ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇలా అందరూ అరుచుకుంటూ ఉంటుంటే అప్పుడు సంజనా సైలెంట్‌గా వచ్చి.. ఆకలేసి నేనే గుడ్డు తిన్నా.. అడిగితే ఇవ్వరనే అలా చేశాను అని తాపీగా చెప్పింది. ఇరికించేసిందిగా!దీంతో ఓనర్లు.. అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పొచ్చు కదా? అని ఫైర్ అయ్యారు. ఇక సంజనా తాను తినేటప్పుడు కిచెన్‌లో ఉన్న భరణి, తనూజ కూడా చూశారని, రాముకు కూడా తెలుసని ఇరికించేసింది. దాంతో అందరూ షాకయ్యారు. శ్రష్టి అయితే సంజనా దగ్గరకు వెళ్లి.. గుడ్డు తినడానికి సిగ్గు లేదా? అని తిట్టేసింది. అటు రీతూ చౌదరి.. మీ ముగ్గురూ కలిసి గేమ్ ఆడారు అని భరణిపై ఫైర్ అయింది. అప్పుడు భరణి నోరు విప్పి జరిగిందంతా చెప్పాడు. ఏడ్చేసిన సంజనామేము కిచెన్‌లో ఉన్నప్పుడు సంజనా అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజకి చెప్పిందట. 5 నెలల బేబీని వదిలేసి వచ్చాను.. ఏదో ప్రాబ్లమ్ ఉందంది. అందుకే నేను సైలెంట్‌గా ఉన్నా అన్నాడు. అప్పుడు సంజనా ఎంటరై.. నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, నా గురించి మీకు తెలీదు. నేను బాధితురాలిని. నేను ప్రతిరోజు ఏడుస్తూనే పడుకుంటాను అని ఏడ్చేసింది. అలా ఒక్క గుడ్డు దొంగతనంతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేసింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా -
రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!
బిగ్‌బాస్ షో (Bigg Boss 9 Telugu)లో మొదటివారం నామినేషన్స్ సిల్లీగా ఉంటాయి. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు, ఆయన సరిగా ఇల్లు తుడవలేదు, నాకింకో ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అందరికీ బలమైన పాయింట్ అందించేందుకు నేనున్నానంటూ సంజనా గల్రానీ అభయమిచ్చింది. చీటికిమాటికి చిరాకు పడుతూ, గొడవలతో విసుగు తెప్పిస్తూ అందరికంట్లో పడింది. నీ పనిమనిషినా?ఇంకేముంది ఓనర్స్ అందరూ కలిసి సంజనాను ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. తర్వాత వాష్‌రూమ్ దగ్గర రచ్చ మొదలైంది. కండీషనర్, షాంపూ బాత్రూంలో పెట్టకండి, బయటపెట్టుకోండి అని ఫ్లోరా చెప్తుంటే సంజనా అడ్డంగా వాదించింది. విసుగెత్తిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా? బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా? అని నిలదీసేసరికి సంజనా కోపం నషాళానికంటింది. మ్యానర్స్ లేదు, అదీ ఇదీ అని చెడామడా తిట్టేసరికి ఫ్లోరా ఏడ్చేసింది.ఫుటేజ్ కోసమా?అదంతా చూసిన శ్రీజ.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమైన సంజనా.. ఏమన్నావ్? ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తూనే చీప్ అని తిట్టింది. తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్‌తో శ్రీజను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అని చీదరించుకుంది తర్వాత టెనెంట్స్‌లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలన్నాడు బిగ్‌బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్‌లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. రీతూ తలకు గాయంసుత్తిని అందుకున్నవారు నామినేషన్స్ చేస్తారు. ఈ ప్రక్రియలో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దాంతో ఆమెను మెడికల్ రూమ్‌కు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎక్కువగా మౌన వ్రతంలోనే ఉంటున్న సుమన్.. ఎట్టకేలకు నిన్న నోరు విప్పాడు. కానీ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి.చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ -
బిగ్‌బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!
బిగ్‌బాస్ షో లాంచ్ అయి రెండు రోజులు అయింది. ఇంకా నామినేషన్స్ మొదలు కాలేదేంటా అని అనుకుంటుండగానే ఆ ప్రోమో రిలీజైంది. నిన్నటివరకు అంతా ఒక్కటి అనుకున్నోళ్లు కాస్త ఇప్పుడు వేరు అయిపోయారు. ఒక్కొక్కరు కారణాలు చెబుతూ తోటి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేశారు. ఈ వారం లిస్టులో ఎవరెవరు ఉన్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.అగ్నిపరీక్షలో గెలిచి వచ్చిన సామాన్యులు ప్రస్తుతం హౌసులో ఓనర్స్‌గా చెలామణి అవుతున్నారు. సెలబ్రిటీలు టెనెంట్స్‌గా ఉన్నారు. ప్రతిసారిలా ఈసారి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున చేయడం లాంటివి ఈసారి లేవు. బిగ్‌బాస్ చెప్పిన ప్రతిసారి సామాన్యులంతా కలిసి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. అలానే సెలబ్రిటీలు కూడా తమలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో తొలుత హౌసులో అందరికీ ఎదురు సమాధానం చెబుతున్న సంజనని నామినేట్ చేశారు.(ఇదీ చదవండి: రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ)అలానే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాము రాథోడ్.. శ్రష్ఠి వర్మని, భరణి.. సంజనని, హరీశ్.. సుమన్ శెట్టిని ఇలా మొత్తంగా సెలబ్రిటీలంతా నామినేషన్లలో నిలిచారు. అయితే లిస్టులో ఒక్కరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో భరణి సేవ్ అయ్యారు. ఈయన ప్లేసులో సామాన్యుల నుంచి డీమన్ పవన్.. నామినేషన్లలో నిలిచాడు.ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. మరి వీళ్లలో తొలివారం ఎవరు బయటకెళ్లిపోతారనేది చూడాలి?(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్) -
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్‌లో హీరోయిన్
బిగ్‌బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్‌బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్‌లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరైతే కిచెన్‌లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్‌లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి! -
నాకు చావెందుకు రాలేదు? నిరూపించుకోవడానికే వచ్చా: హీరోయిన్ కన్నీళ్లు
సినిమాలకన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమసైంది సంజనా గల్రాని (Sanjana Galrani). బుజ్జిగాడు మూవీతో టాలీవుడ్లో పరిచయమైంది. తెలుగులో కన్నా కన్నడలో మంచి స్టార్డమ్ సంపాదించింది. 2020లో రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం. అంతా బాగున్న సమయంలో డ్రగ్స్ కేసుతో తన కెరీర్ కుప్పకూలింది. డ్రగ్స్ కుంభకోణంలో జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగు పెట్టింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా పేరు అర్చన. ఏడో తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. జాన్ ఇబ్రహీంతో ఓ యాడ్ చేశాను. అప్పుడు పూరీ జగన్నాథ్ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్‌గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది.ఒక్కో మీడియా ఛానల్ ఒక్కోలాగా చెప్పింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ, అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్‌బాస్‌కు వచ్చాను అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది. -
మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనా గల్రానీ.. తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా చేసింది. కాకపోతే అనుకున్నంత పేరు రాలేదు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులోనూ ఈమె పేరు వినిపించింది కానీ ప్రస్తుతానికి అంతా సైలెంట్. ఇకపోతే నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమెకు ఇదివరకే ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తాజాగా ఉగాది సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో బేబీ బంప్ కనిపించేలా ఉన్న వీడియోస్, ఫొటోలని సంజన.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి ఈ ఫొటోషూట్ లో పాల్గొంది. దీంతో ఈమెకు నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
శాండల్‌వుడ్‌లో ‘శ్వా’ ఏర్పాటు కావాలి: సంజనా గల్రానీ
చలన చిత్రపరిశ్రమలో మహిళల భద్రత, సమాన గౌరవం, పని హక్కు వంటి అంశాలపై నటి సంజనా గల్రానీ కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఆర్టిస్టు అసోసియేషన్‌తో కలిసి ఈ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ పని చేయాలి. ఓ నటికి ఉండాల్సిన కనీస హక్కులు గురించిన చర్చ జరగాలి. ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల నిర్వహణ జరగాలి. ప్రస్తుతం తోటి పరిశ్రమల్లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. అలాంటి బ్లాక్ మార్క్స్ కన్నడ ఇండస్ట్రీపై పడకూడదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను.కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టిస్టు అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, టెక్నీషియన్స్ అసోసియేషన్ల విలువైన సలహాలతో ‘శాండిల్‌వుడ్ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్’ (ఎస్డబ్ల్యూఏఏ – ‘శ్వా’) ఏర్పాటు కావాలి. ముఖ్యంగా ఈ ‘శ్వా’పై కర్ణాటక ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి’’ అని సంజన ఆ లేఖలో రాసుకొచ్చారు.అలాగే ఈ లేఖను పరిశీలించవలసినదిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, హోం మినిస్టర్ పరమేశ్వర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ లక్ష్మీ హెబ్బాల్కర్లను అడ్రస్ చేశారు సంజన. అలాగే సెట్స్‌లో నటీమణులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక క్యారవేన్ ఉండాలని, ఓ గది అయినా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని, రాత్రి షూట్ సమయంలో సరైన పరిస్థితులు ఉండాలని... ఇవన్నీ ‘శ్వా’కి ప్రాథమిక నియమాలుగా ఉండాలంటూ మరికొన్ని నియమాలను కూడా స్పష్టం చేశారు సంజన. -
డ్రగ్స్ కేసులో సంజనకు ఊరట
యశవంతపుర: మత్తు పదార్థాలను సేవించిన కేసులో నటి సంజనా గల్రానితో పాటు వ్యాపారవేత్తలు శివప్రకాశ్, ఆదిత్య మోహన్ అగర్వాల్‌పై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో నటికి పెద్ద ఊరట కలిగింది. తమపై దాఖలైన డ్రగ్స్ కేసును రద్దు చేయాలని కోరుతూ వీరు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయమూర్తి హేమంత్ చందన గౌడర్ ధర్మాసనం కేసును విచారించింది. సంజనపై బెంగళూరు పోలీసులు 2020 ఏప్రిల్, సెప్టెంబర్‌లో కేసులు నమోదు చేశారు. 2015, 2018, 2019లోను వీరు డ్రగ్స్ సేవించారంటూ అక్రమంగా కేసులు నమోదు చేశారని వారి తరఫున వకీలు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి వారిపై కేసులను రద్దు చేశారు. -
డబ్బు చుట్టూ... జనవరి మొదటి వారంలో సినిమా
శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మణిశంకర్’. జీవీకే (జి. వెంకట్ కృష్టణ్) దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ నిర్మించారు. ఎంఎల్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ‘మణిశంకర్’ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్ సీఈవో సతీష్ రెడ్డి విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న నటుడు మురళీ మోహన్, నిర్మాత సి. కల్యాణ్ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథా కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జి. వెంకట్ కృష్టణ్. ‘‘నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు శివ కంఠమనేని. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎల్ రాజా పాల్గొన్నారు. -
కరోనా తర్వాత నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది: సంజనా
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “మణిశంకర్”.ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. 'ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు. చాలా త్వరగానే సినిమాను పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమాను నిర్మించాను. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు సంగీతం అందించాడు' అన్నారు. డైరెక్టర్ జి. వెంకట్ కృష్టణ్ మాట్లాడుతూ.. 'సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. ఇదే టీంతో మళ్లీ ఇంకో సినిమా చేస్తున్నా. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి' అన్నారు. సంజన గల్రానీ మాట్లాడుతూ.. 'కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు' అన్నారు. చదవండి: షూటింగ్‌కు అస్వస్థతకు లోనైన కన్నడ స్టార్ ఓటీటీలో నవీన్ చంద్ర రిపీట్ -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బుజ్జిగాడు, సత్యమేవ జయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సంజనా గల్రానీ. ఇటీవలే గ్రాండ్‌గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. బాబు పుట్టాడు, కంగ్రాచ్యులేషన్స్ అన్న క్యాప్షన్‌ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. మరో వైపు సంజన చెల్లి నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మే 18న ఆమె హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గుడ్‌న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బిగ్‌బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ అయిన సంజన గల్రానీ శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు అజీజ్ పాషాను పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) చదవండి 👇 తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, అంతేకానీ.. విడాకుల బాటలో బాలీవుడ్ దంపతులు! -
రెండోసారి గ్రాండ్‌గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
హీరోయిన్ సంజనా గల్రానీ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్ గత నెలలో హిందూ సాంప్రదాయం ప్రకారంలో సీమంతం జరుపుకుంది. అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. తాజాగా అందరి సమక్షంలో మరోసారి గ్రాండ్‌గా సీమంతం చేసుకుంది సంజనా. ఈసారి ముస్లిం పద్ధతిలో ఈ వేడుక చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన యోగక్షేమాలను పట్టించుకునేవారిని మాత్రమే ఈ శుభకార్యానికి ఆహ్వానించానని తెలిపింది. అలా ఓ 300 మందికి ఆహ్వానం పంపామంది. ఈ ఫంక్షన్‌కు హాజరై తనను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫంక్షన్‌లోని మెనూలో మటన్ బిర్యానీ హైలైట్ అని చెప్పింది. మరో 20 రోజుల్లో చిన్నారి బుజ్జాయి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందంటూ తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె సీమంతం ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) చదవండి: సమంత 'ఊ అంటావా మావా' పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో అక్కడికి ఎందుకు వెళ్లాలి? బాలీవుడ్‌పై మహేశ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు -
హీరోయిన్ సంజనకు సీమంతం చేసిన స్నేహితులు
బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలు సహా పలు విషయాలను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంజన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సౌత్ ఇండియన్ స్టైల్లో సీమంతం జరుపుకుంది. చదవండి: బన్నీకి ఫేవరెట్ అదే.. సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి దీనికి సంబంధించిన ఫోటోలను సంజన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది. 'కొన్నిసార్లు కుటుంబం కంటే కొంతమంది స్నేహితులే నయమనిస్తుంది. ఎంతో ప్రేమగా నా సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ నా సీమంతం చేశారు. 9వ నెలలోకి ప్రేవేశిస్తున్నా. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు' అంటూ పేర్కొంది. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
హీరోయిన్ చెల్లెలితో టాలీవుడ్ హీరో ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి
Aadi Pinisetty Marriage With Actress Nikki Galrani?: టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పాటలు ఎక్కనున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తుంది. బుజ్జిగాడు హీరోయిన్ సంజన చెల్లెలే నిక్కీ గల్రానీ. చదవండి: ప్రభాస్‌కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్,అసలేమైందంటే.. ‘యాగవరాయినుం నా కాక్క’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అంతేకాకుండా రెండేళ్ల క్రితం ఆది పినిశెట్టి ఇంట్లో జరిగిన ఓ వేడకకు సైతం నిక్కీ హాజరైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ ఎయిర్‌పోర్ట్‌లో వీరు జంటగా దర్శనమివ్వడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా నిక్కీ- ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' సినిమాలతో అలరించిన ఆది ఇటీవలె గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అభిమాని మృతి -
నటి సంజనకు అభ్యంతరకర సందేశాలు
యశవంతపుర(కర్ణాటక): నటి సంజనా గల్రానికి అభ్యంతరకర సందేశాలు పంపిన ఓ ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని ఇందిరానగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 అర్ధరాత్రి నటి సంజనాకు అభ్యంతరకర సందేశాలు పంపాడు. దీంతో సంజనా వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు అందజేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను సంజనకు ఎలాంటి సందేశాలను పంపలేదని పోలీసులకు వివరించినట్లు సమాచారం. -
మేని మెరుపులతో మురిపిస్తోన్న సంజనా గల్రానీ
-
త్వరలోనే తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్
Actress Sanjana Galrani Pregnant Expecting First Child In May 2022: బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ అభిమానులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పేర్కొంది. 'మాతృత్వం అనేది ఓ అందమైన అనుభూతి. ఇప్పుడు నేను 5నెలల గర్భంతో ఉన్నాను. డెలివరి ముందు వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు. ప్రసవం అయ్యేంతరకు పనిచేయాలనుకుంటున్నా. కొంత మంది మహిళలు డెలివరికి రెండు వారాల వరకు కూడా పని చేస్తారు. వారి లాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలె ఆమె భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఆమె తన వైవాహిక జీవితం చాలా బాగుందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. గతేడాది శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. -
Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Actress Sanjjanaa Galrani Respond On Her Divorce Rumours: ‘బుజ్జిగాడు’ బ్యాటీ, కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీకి 2020 గడ్డు కాలమని చెప్పుకొవచ్చు. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లింది. ఈ క్రమంలో 2020 డిసెంబర్లో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. అప్పటి వరకు తరచూ వార్తల్లో నిలిచిన సంజన పెళ్లి అనంతరం మీడియాకు దూరంగా ఉంది. చదవండి: ఇలా జరగడం బాధగా ఉంది: నాని భావోద్వేగం ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ అంటూ కన్నడ మీడియాల్లో వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలో సంజనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంజనకు తన భర్తతో మనస్పర్థలు వచ్చాయని, త్వరలో ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియా, మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవి కాస్తా సంజన దృష్టికి వెళ్లడంతో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ మండిపడింది. చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ వైవాహిక జీవితం చాలా బాగుందని, తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. అంతేకాదు ఆధారాలు లేని వార్తలు సృష్టించందని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సంజన హెచ్చరించింది. కాగా కన్నడ నటి అయిన సంజన తెలుగులో పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితాలు అయ్యింది. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్లో మెరిసిన సంజన ఆ తర్వాత పలు చిత్రాల్లో సహా నటిగా, హీరోయిన్గా మెప్పించింది. -
ఆకట్టుకుంటున్న ‘మణిశంకర్’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మణిశంకర్’. యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘మణిశంకర్’ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్‌లో శివ కంఠమనేని ఉన్న ఈ క్రియేటివ్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా హీరో శివకంఠమనేని మాట్లాడుతూ.. ‘ఈ రోజు విడుదలైన మా ‘మణిశంకర్’ టైటిల్, ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సంజన గల్రాని, ప్రియా హెగ్దేలతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు జీవీకే మేకింగ్ చాలా కొత్తగా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’ అన్నారు. అలాగే దర్శకుడు జీవీకే మాట్లాడుతూ.. ‘మణిశంకర్ అనేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. -
బిగ్‌బాస్ : ప్రియాంక సింగ్‌కు కన్నడ నటి మద్దతు
Sanjana Galrani Support To Bigg Boss 5 Contestant Priyanka Singh: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-5 అదరగొడుతుంది. అప్పుడే హౌస్‌లో అలకలు, గ్రూపు రాజకీయాలు, లవ్ యాంగిల్స్ మొదలైన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్న కంటెస్టెంట్లు టాస్కుల విషయానికి వచ్చే సరికి ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ హౌస్‌ను హీటెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్‌మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ట్రాన్స్ జెండర్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటా, బయటా మంచి మార్కులే కొట్టేస్తుంది. ఇప్పటికే ఆమెకు ప్రేక్షకుల నుంచి భారీగానే మద్దతు లభిస్తోంది. ఇటీవలె నటుడు నాగబాబు సైతం ప్రియాంకకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. హౌస్‌లో తనకు తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నా, తన పూర్తి సపోర్ట్ మాత్రం ప్రియాంకకే అని ఇదివరకే ఆయన ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ సైతం ప్రియాంకకు తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఎప్పుడూ అబ్బాయిలు లేదా అమ్మాయిలే షోలో గెలుస్తారు. కానీ ఈసారి ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్‌జెండర్స్ ఎప్పుడూ వాళ్ల జీవితం కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ల మీద ఎప్పుడూ నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకే ప్రియాంక సింగ్ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి' అంటూ సంజన ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చింది. కన్నడ నటి అయినప్పటికీ ఒక తెలుగు షో గురించి మాట్లాడటమే కాకుండా, ఓ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుండటంపై పింకీ(ప్రియాంక సింగ్)ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తొలి వారం సరయూ ఎలిమినేట్ కాగా ఈవారం ఉమాదేవి, కాజల్, ప్రియ,నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోలతో పాటు ప్రియాంక సింగ్‌లు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఇప్పటికే లోబో, ప్రియాంక సింగ్, ప్రియలు సేఫ్ జోన్లో ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. మరి వీరిలో ఈవారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారన్నది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ఉమాపై గెలుపు, ఏడుస్తూనే ట్విస్ట్ ఇచ్చిన లోబో! టీఆర్పీ రేటింగ్‌లో సత్తా చూపిన బిగ్‌బాస్ 5, కానీ.. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన
Sandalwood Drug Case: డ్రగ్స్ కేసులో నిందితురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమె తల్లీ రేష్మా గల్రాని ఈ విషయం తెలిపారు. అన్నింటికీ తలరాత బాగుండాలి. అయితే మేం ఎలాంటి తప్పు చేయలేదు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని చెప్పారు. సంజన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాము డ్రగ్స్ సేవించినట్లు సీసీబీ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడంపై శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలు, అందాల నటి రాగిణి ద్వివేది స్పందించారు. దేవుడు వేసిన ప్లాన్‌పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్‌తో సంప్రదిస్తున్నారు. డ్రగ్స్‌పై కఠిన చర్యలు: హోంమంత్రి రాష్ట్రంలో మత్తు దందాను నియంత్రిస్తామని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. బుధవారం కోరమంగళ్‌లోని కేఎస్ఆర్పీ మైదానంలో పోలీసు పబ్లిక్ స్కూలును ప్రారంభించి విలేకర్లతో మాట్లాడారు. మత్తు పదార్థాలతో యువత జీవనం నాశనమవుతోందన్నారు. పోలీసుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించడానికి పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐపీఎస్ రజనీశ్ గోయల్, డీజీపీ ప్రవీణ్ సూద్ పాల్గొన్నారు. చదవండి : Drugs Case: శాండల్‌వుడ్ నటీమణులు రాగిణి, సంజనకు షాక్ నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్ -
సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టు: నటీమణులు రాగిణి, సంజనకు షాక్
Sandalwood Drug Case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతితో సినీ పరిశ్రమలో డ్రగ్ వ్యవహరం కలకలం సృష్టించింది. బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో డ్రగ్ కేసు సంచలనం సృష్టించింది. బాలీవుడ్లో పలువురు సినీ నటీనటులు, స్టార్ హీరోయిన్స్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఇక శాండల్‌వుడ్‌కు వస్తే సంజన గల్రానీ, రాగిణీ ద్వివేది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని, తరచూ డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వారి తలవెంట్రులను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సాంపుల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నెటిజన్ రూ. కోటి డిమాండ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనూసూద్ తాజాగా సీఎఫ్ఎస్ఎల్ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్టులో రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. 2020 అక్టోబర్‌లో వీరిద్దరి వెంట్రకల నమూనాలను సేకరించిన బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడవ్వడంతో బెంగళూరు పోలీసులు మరోసారి రాగిణి, సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సంజనా ప్రభాస్ బుజ్జీగాడు మూవీతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాగిణి కన్నడలో స్టార్నటిగా గుర్తింపు పొందింది. కాగా ఈకేసులో జైలుకు వెళ్లిన సంజనా, రాగిణిలు ఇటీవల బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన డాక్టర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? -
ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు: హీరోయిన్
Sanjana Galrani About Prabhas: బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా క్లాస్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా విజయవంతం అయినా సంజనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ పరిశ్రమకు పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవలె డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. శాండల్‌వుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన ఈ కేసుతో సంజన పేరు ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది.ఇక ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంజన.. ఇటీవలె నటిగానూ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ఓ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది. 'అరెస్ట్ అయి జైళ్లో ఉన్నప్పుడు ప్రతీరోజు జీసెస్, అల్లా, శివయ్యలను ప్రార్థించేదాన్ని. అంతేకాకుండా ప్రతీరోజు యోగా చేసేదాన్ని. వీటివల్లే ఇంత త్వరగా కంబ్యాక్ చేయగలిగాను. ఆ నెగిటివిటి నుంచి బయటపడగలిగాను' అని తెలిపింది. ఇక బుజ్జిగాడు సినిమా గురించి మాట్లాడుతూ..ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.ఆయన చాలా డెడికేటెడ్ యాక్టర్. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎంతో కష్టపడేవాడు. బుజ్జిగాడు షూటింగ్ సమయంలో ప్రభాస్ చాలా సన్నగా కనిపిస్తారు. క్యారెక్టర్ కోసం ప్రతిరోజు ఆయన కేవలం పెసరెట్టు మాత్రమే తినేవారు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారన్నది ప్రభాస్ ఫిజిక్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్‌తో పనిచేసినందుకు సంతోషంగా భావిస్తున్నా' అని సంజన తెలిపింది. -
జైలు నుంచి వచ్చాక నటి సంజన సైన్ చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇదే..
'బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ. కన్నడలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సంజనకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు కలిసిరాలేదు. ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. గతేడాది శాండిల్‌వుడ్ ఇండస్ట్రీలో జరిగిన డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్ అయ్యే ఇటీవలె బెయిల్ మీద బయటకు వచ్చింది. అనంతరం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ..తన కంట్లో కన్నీళ్లు అయిపోయాయని, ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అంటూ ఆదేవన వ్యక్తం చేసింది. ఇక అదే సమయంలో ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో నటిగా మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుందట సంజన. ఇందులో భాగంగానే కథలు వింటుందని, తాజాగా వెంకట కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఓ ప్రాజెక్టుకు సంజన సైన్ చేసినట్లు సమాచారం. ఫిమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు మణిశంకర్ అనే టైటిట్‌ను కూడా ఫిక్స్ చేశారట. అంతేకాకుండా తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో ఈ మూవీ తెరకెక్కనుందని, వచ్చే నెలలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. చదవండి : డాక్టర్‌తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు! -
డాక్టర్‌తో రహస్య పెళ్లి : అందుకే అందరికి చెప్పలేదు.. సంజన
Sanjana Galrani: శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్‌పై విడుదలైన హీరోయిన్ సంజన గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకుంది. గతేడాది లాక్ డౌన్లోనే వివాహం చేసుకున్న సంజన.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. అలాగే రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో కూడా వివరించింది. ‘పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే డ్రగ్స్ కేసు ఇష్యూలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నా పెళ్లి విషయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారితో పంచుకోలేకపోయాను. అయితే అందర్నీ పిలిచి రిసెప్షన్‌ని గ్రాండ్‌గా చేసుకోవాలనుకున్నాం. కానీ లాక్డౌన్ వల్ల అది సాధ్యం కాలేకపోయింది’అని సంజన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తెలుగులో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన. ఈ చిత్రం తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైంది. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై, మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటికొచ్చింది. చదవండి : డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో హీరో ఆశీష్ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్ -
మా డేటింగ్ను సీక్రెట్‌గా ఉంచాను, తప్పలేదు: నటి
శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన నటి సంజన గల్రానీ బెయిల్‌పై బయటకు రాగానే రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంతో అడుగుపెట్టిన ఆమె ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన సీక్రేట్ డేటింగ్ గురించి చెప్పుకొచ్చింది. అంతేగాక గతేడాది తను పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా భర్త అజీజ్ పాషా. ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో డాక్టర్. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. మా స్నేహం పెద్దాయ్యాక ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఎప్పుడో మేము కన్ఫాం చేసుకున్నాం కానీ ఎవరికి చెప్పలేదు. ఇన్నేళ్లు సీక్రేట్‌గా డేటింగ్లో ఉన్నాం. ఇక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకునే లోపే ఈ సంఘటన జరింగింది(డ్రగ్ కేసు)’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక డ్రగ్స్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నట్లు చెప్పింది. కానీ బయటకు వచ్చిరాగానే తను కరోనా బారిన పడటంతో కాస్తా నిరాశకు గురయ్యాన్నంది. అప్పుడు అజీజ్ సపోర్టుతోనే కరోనా నుంచి కోలుకున్నానని, ఆనంతరం తాను అనుకున్నట్లుగానే కొద్ది మంది సమక్షంలో అజీజ్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అయితే తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని అందుకే ఎవరీకి చెప్పకుండా ఇన్నేళ్లు సీక్రేట్ డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. అయితే ఆయన డాక్టర్ కావడంతో కరోనా రోగులకు వైద్యం అందించే క్రమంలో ఆయన ఎక్కువ సమయంలో ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోందని, దీంతో నా ఆరోగ్యం కంటే ఆయన ఆరోగ్యం పట్ల బెంగగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: అతడు నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన సంజన రహస్య పెళ్లి..ఫోటో వైరల్ -
అతడు నన్ను మోసం చేశాడు : స్టార్ హీరోయిన్
బెంగుళూరు : శాండిల్ వుడ్లో గతేడాది వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో హీరోయిన్ సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు ఆమె జైలు శిక్ష అనుభవించింది. తాజాగా సంజన చెల్లెలు నిక్కీ గల్రానీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిఖిల్ హెగ్డే అనే బిజినెస్‌మెన్‌పై చీటింగ్ కేసు పెట్టడమే ఇందుకు కారణం. ఇందులో కర్ణాటకలోని కోరమంగలలో 2016లో కేఫ్ పెట్టాలని నిఖిల్ హెగ్డే ఆశ్రయించాడని,ఇందుకు గానూ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అగ్రిమెంట్ ప్రకారం.. ప్రతీ నెలా తనకు లక్ష రూపాయలు చెల్లించాలని, అయితే ఇప్పటివరకు పేమెంట్ చేయలేదని నిక్కీ గల్రానీ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా నా ఫోన్‌కాల్స్‌కు సైతం సమాధానం ఇవ్వడం లేదని పేర్కొంది. నిక్కీ గల్రానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలని అతడికి నోటీసులు పంపారు. కాగా 2014లో సినీ ఇండసస్స్ర్టీలోకి అడుగుపెట్టిన నిక్కీ గల్రానీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో 30కి పైగా సినిమాల్లో నటించింది. చదవండి : జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్ ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా! -
జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్
కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్‌పై విడుదలైన హీరోయిన్ సంజన గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకుంది. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి పెళ్లికి అతి కొద్ది మంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. తెలుగులో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన. ఈ చిత్రం తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైంది. ఇక గత ఏడాది శాండిల్ వుడ్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సంజన గల్రానీ జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపుగా మూడు నెలలపాటు జైల్లో ఉండి ఇటీవల బెయిల్ పై బయటికొచ్చింది. -
డ్రగ్స్ కేసు: నటి రాగిణి, సంజనాపై చార్జిషీట్
సాక్షి, బెంగళూరు : సంచలనాత్మక డ్రగ్స్ వాడకం– రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన శాండల్‌వుడ్ నటీమణులు రాగిణి ద్వివేది (30), సంజనా గల్రాని (31)తో పాటు 25 మందిపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ), కాటన్‌పేటే పోలీసులు మంగళవారం ఎన్డీపీఎస్ కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. డ్రగ్స్ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీల చార్జిషీట్లో సమాచారం పొందుపరిచారు. 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇంకా పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్లో ప్రస్తావించారు. డ్రగ్స్ కేసులో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచడం తెలిసిందే. రాగిణి మత్తు పార్టీలు ఇలా ► 2019 మే 26 న నటి రాగిణి పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వద్ద గల హోటల్లో ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి పార్టీ నిర్వహించడం, ఎక్స్టసీ డ్రగ్ మాత్రల సేవనంతో పాటు ఇతరులకూ సరఫరా చేసినట్లు చార్జిషీట్లో ప్రస్తావించారు. ► 2020 జూలై 5 న యలహంక లెరోమా హోటల్లో పార్టీలో డ్రగ్స్ సేవించారు. ► 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ముఖ్య నిందితుడు లూమ్పెపే సాంబాకు ఫోన్ చేసి డ్రగ్స్ కొనుగోలు చేశారు. నైజీరియా పర్యాటకుడు నుంచి రాగిణి డ్రగ్స్ తీసుకుంది. ► ఆమె ఇతర నిందితులకు వాట్సాప్ ద్వారా డ్రగ్స్ కావాలని అడిగారు. ఆమె ఐఫోన్ 11 ప్రోమ్యాక్స్ మొబైల్‌ఫోన్‌ను సోదా చేయగా కీలక సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. సంజన గురించీ పెద్దసంఖ్యలో అభియోగాలు ఉన్నాయి. ► ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి డ్రగ్స్ డీల్ గురించి ఏమేం మాట్లాడారు అనేది ప్రస్తావించారు. 69వ పేజీలో 2018 డిసెంబర్ 8వ తేదీన నటి రాగిణికి వ్యతిరేకంగా రవిశంకర్ భార్య చేసిన చాటింగ్‌ను పొందుపరిచారు. -
ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా!
‘‘నేను ప్రయాణించనున్న రోడ్డు చాలా రఫ్‌గా ఉంటుందని నాకు అర్థం అయింది. కానీ దాన్ని దాటేసి మళ్లీ ఎప్పటిలానే పైకి ఎగరాలనుంది’’ అన్నారు నటి సంజనా గల్రానీ. ఇటీవలే శాండిల్‌వుడ్ ఇండస్ట్రీలో జరిగిన డ్రగ్స్ ఆరోపణల్లో నటి సంజనా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బెయిలు మీద బయటకు వచ్చారామె. ఈ విషయాల గురించి సంజనా మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలలుగా నేను ఏడుస్తూనే ఉన్నాను. బహుశా నా కంట్లో కన్నీళ్లు అయిపోయి ఉంటాయేమో? ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అని దేవుణ్ణి ప్రార్థించాను. కానీ నాకు ఎదురయ్యే ప్రతీ విషయాన్ని నవ్వుతూ ఎదుర్కొని విజయం సాధించాలనుకుంటున్నాను. మన న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. టైమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’’ అన్నారు. పెళ్లికి గురించి మాట్లాడుతూ– ‘‘నాకు నిశ్చితార్థం అయింది. లాక్డౌన్లో ఎంగేజ్ అయ్యాను. దాన్ని ప్రకటించే వీలు లేకుండా పోయింది. ఇంత జరిగాక నా పెళ్లిని చిన్న వేడుకలా చేసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా ఛారిటబుల్ ట్రస్ట్‌లో పెళ్లి చేసుకుంటాం’’ అన్నారామె. అయితే పెళ్లాడబోయే వ్యక్తి పేరు బయటపెట్టలేదామె. -
డ్రగ్ కేసులో నటి సంజనాకు ఊరట..
సాక్షి బెంగళూరు : శాండల్‌వుడ్ నటి సంజనా గల్రానీకి ఊరట లభించింది. ఆమెకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో సంజనాను సీసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలల నుంచి ఆమె పరప్పన అగ్రహార జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం న్యాయమూర్తి శ్రీనివాస్ హరీశ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ .3,00,000 విలువైన బాండ్‌తోపాటు అంతే మొత్తం విలువైన రెండు పూచీకత్తు పత్రాలను సమర్పించాలనే షరతు విధించారు. అలాగే నెలకు ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్) ఇంతకు మందు సంజనా పలుమార్లు బెయిల్ దరఖాస్తు చేసుకోగా వాటన్నింటిని హైకోర్టు తిరస్కరించింది. కాగా ఇటీవల శాండిల్‌వుడ్‌ని డ్రగ్స్ కేసు కుదిపేసిన విషయం తెలిసిందే. సీసీబీ అధికారుల విచారణలో పలువురు కన్నడ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో పలువురిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నటి సంజనా. ఆమె కంటే ముందు రాగిణి ద్వివేదిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: వారికి అండర్‌వరల్డ్ డాన్లతో సంబంధాలు..!) -
వారికి అండర్‌వరల్డ్ డాన్లతో సంబంధాలు..!
సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు అనుమతితో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను పరప్పన జైలులో ఐదు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆదివారం ముగించారు. సినిమాల ద్వారా ఎంతెంత సంపాదించారనే వివరాలను సేకరించారు. రాగిణి తండ్రి రిటైర్డు మిలిటరీ అధికారి కాగా, ఆయన పలు వివరాలను ఈడీకి అందజేశారు. రాగిణిపై అధిక అనుమానాలు మరో నటి సంజన విచారణలో అనేకసార్లు ఆవేదనతో విలపించినట్లు తెలిసింది. ఎన్ని సినిమాలు నటించారు. ఎంత డబ్బులు సంపాదించారు. పిత్రార్జితం ఎంత?, ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఏమిటి అని ఈడీ అధికారులు సంజనపై ప్రశ్నలవర్షం కురిపించారు. పలు భాషల్లో 42 సినిమాలలో నటించిన సంజన సినిమా రంగంలో పెద్ద పేరును సంపాదించలేకపోయినా ఆదాయానికి మాత్రం ఢోకా లేదని గుర్తించారు. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో సమాచారం కోసం ఈడీ ఇప్పటికే ఐటీశాఖకు లేఖ రాసింది. రాగిణి, సంజన ఆస్తులు, వారి సంపాదన తీరుపై ఈడీ అవగాహనకు వచ్చింది. సంజన బెయిల్ దొరికి బయటకు వచ్చినప్పటికీ విచారణ కోసం మళ్లీ అదుపులోకి తీసుకువాలని ఈడీ భావిస్తోంది. (అనుశ్రీకి అండగా మాజీ సీఎం.. ఎవరా గాడ్‌ఫాదర్ ?) బెయిల్ కోసం ఆరాటం రాగిణి, సంజనల విచారణలో పలు ముఖ్యమైన అంశాలను సీసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా మరికొన్ని రోజులు ఇద్దరినీ ప్రశ్నించాలని నిర్ణయించారు. సీసీబీ విచారణలో రౌడీలు, అండర్‌వరల్డ్ డాన్లతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో వారికి సహకారం అందించిన కొందరు రౌడీలపై నిఘా పెట్టారు. ఇక హైకోర్టులో బెయిలు కోసం నటీమణులు లాయర్లను సంప్రదిస్తున్నారు. (డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!) ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్ డాలర్స్ కాలనీలోని అపార్ట్మెంట్లో గంజాయి సేవిస్తున్న వరుణ్, వినోద్ అనే డ్రగ్ పెడ్లర్లను బెంగళూరు సంజయ్‌నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారిని విచారించగా బెంగళూరులో జరిగే పార్టీలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారని తెలిసింది. -
ఐఎంఏ స్కాంలో చేతులు కాల్చుకున్న సంజన!
బెంగళూర్ : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది బయటపడిన ఐఎంఏ స్కామ్‌లో ఐఎంఏ, దాని అనుబంధ కంపెనీలు అధిక రాబడి ఆశ చూపుతూ ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. శాండల్‌వుడ్ డ్రగ్ కుంభకోణంలో ఇప్పుడు ఐఎంఏ నిర్వాకం వెలుగులోకి వస్తోంది. సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలతో పాటు కస్టడీలో ఉన్న ఇతరుల ఆస్తులు, పెట్టుబడులపై ఆరా తీస్తున్న సీసీబీ, ఈడీలు పలు విషయాలను రాబట్టాయి. ఐఎంఏ స్కీమ్‌లో తాను భారీగా వెచ్చించి నష్టపోయానని విచారణ సందర్భంగా సంజనా వెల్లడించినట్టు తెలిసింది. చదవండి : డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు! పెట్టుబడిపై వేగంగా మెరుగైన రిటన్స్ రాబట్టుకోవచ్చని తాను ఆ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టగా ఐఎంఏ అవకతవకలతో లక్షల రూపాయల మొత్తాన్ని పోగొట్టుకున్నానని ఆమె దర్యాప్తు అధికారులకు వివరించినట్టు సమాచారం. సంజనా, రాగిణిలు హవాలా లావాదేవీలకు పాల్పడ్డారనే అనుమానంతో వీరిద్దరినీ ప్రస్తుతం సీసీబీ అధికారులు విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న మరో నిందితుని సమాచారంతో ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు సంజనా, రాగిణి బెయిల్ పిటిషన్‌ను ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయస్ధానం తోసిపుచ్చింది. వారికి బెయిల్ కోసం లాయర్లు హైకోర్టును సంప్రదించాలని యోచిస్తున్నట్టు సమాచారం. -
డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!
యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. ఈ బాగోతంలో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్ఫోన్ల నుంచి సీసీబీ అధికారులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఇద్దరి మొబైల్ఫోన్లలో సెక్స్ రాకెట్ బయటపడినట్లు సీసీబీ వర్గాల కథనం. వారి మొబైళ్లలో నీలి వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు కొందరు సీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో డ్రగ్స్ కథలో మరో మరో దందా వెలుగుచూసినట్లయింది. నీలి స్కాంతో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో నీలి దందా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉందని, డ్రగ్స్ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్ చేశారని సీసీబీ కథనం. మరో ఇద్దరు అరెస్ట్ మత్తు బాగోతంలో మంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కెంగేరికి చెందిన ఒకరు, నైజీరియాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. మంగళూరుకు చెందిన సీసీబీ బృందం వీరిని పట్టుకొంది. వీరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్‌ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) మరికొందరి విచారణ పరప్పన అగ్రహార జైల్లో ఉన్న నటి రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా సీసీబీ పోలీసులు మూడు రోజుల నుండి కొందరిని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించారు. వీరిద్దరూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. మాఫియా డాన్‌తో సంబంధాలున్న ఒక యువకున్ని సీసీబీ అదుపులోకి తీసుకొని విచారించింది. ఇటీవల సస్పెండయిన ఒక ఏసీపీతో ఇతనికి సంబంధాలున్నట్లు తెలిసింది. -
డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్
బెంగుళూరు: సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వీరిద్దరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా స్పెషల్‌కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వేరు వేరు ప్రాంతాల నుంచి డ్రగ్స్ సేకరించి వాటిని ఫైవ్ స్టార్ హోటలల్లో, క్లబ్స్‌లో, పబ్‌లలో సంజన టీం అమ్మేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మొదట తయారు చేసిన ఎఫ్ఐఆర్లో సంజనా పేరు లేదని ఆమె తరుపు న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. కేవలం డ్రగ్స్ అమ్మే వారి పేర్లనే రిపోర్టులో ఉంచారని తెలిపారు. ఇక రాగిని ద్వివేదిని రిమాండ్‌లోకి తీసుకొని 24 రోజులు అవుతుండగా ఇప్పుడు ఆమె తరుపు న్యాయవాది కల్యాణ్‌కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక మరోవైపు కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ సుశాంత్ మరణానంతరం డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే లాంటి ప్రముఖ కథనాయకుల పేర్లే కాకుండా ఇంకా మరికొంత మంది పేర్లు ఆ డ్రగ్స్ కేసు వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. చదవండి: రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే -
డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్‌కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?) డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్లో ఉన్నారు. శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్‌లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్‌లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. -
సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు
బెంగళూరు : డ్రగ్స్ దందాలో దక్షిణ ఆఫ్రికా పౌరులే శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో సూత్రధారులని సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. పెప్పర్ వెల్లడించిన సమాచారం ప్రకారం బెనాల్డ్ ఉడేన్నా అనే ఆఫ్రికన్న అరెస్ట్ చేశారు. అతడు అన్ని వివరాలూ వెల్లడించాడు. కన్నడ సినిమారంగానికి చెందిన సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఉడేన్నా ఆదిత్య ఆళ్వాకు చాలా సన్నిహితుడని, డ్రగ్స్ నిందితులు రవిశంకర్, వీరేన్ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవాడని తెలిసింది. బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల రిసార్ట్‌లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. (నా పరువు తీస్తున్నారు!) జైల్లో పుస్తక పఠనంలో నటీమణులు జ్యుడిషియల్ కస్టడీ కింద నటీమణులు రాగిణి, సంజనలను పరప్పన అగ్రహార జైలుకు తరలించి అక్కడ క్వారంటైన్లో ఉంచారు. జైలులో పెట్టిన టిఫిన్, భోజనాలను ఇద్దరూ ఆరగించారు. కొంతసేపు నిద్రపోతూ, మరికొంత సేపు పుస్తకాలను చదువుతూ పొద్దుపుచ్చుతున్నారు. రాగిణికి వెన్నునొప్పి సమస్య ఉండటంతో జైలు వైద్యులు ఔషధాలను అందించారు. రాగిణి, తల్లి, న్యాయవాదులను అధికారులు కలవనివ్వడం లేదు. ఫోన్లో మాట్లాడడానికి అవకాశమిచ్చారు. కింగ్పిన్లతో నటీమణులకు లింక్‌లు దీని ఆధారంగా ఆదిత్య ఆళ్వకు చెందిన రిసార్ట్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తుండగా వీరి వెనుక కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్ చేస్తుండగానే ముగ్గురు కింగ్పిన్లు పరారు కావడంతో కేసుపై సీసీబీ గోప్యత పాటిస్తోంది. ఈ ముగ్గురు దొరికితే మరెంతోమంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చు. ఈ కింగ్పిన్లు నటీమణులు రాగిణి, సంజనలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు సీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆదిత్య ఆళ్వ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సంజన ఇంట్లోని వస్తువులే ముఖ్య సాక్ష్యాలు? 14వ నిందితురాలు సంజన హై–ఫై పార్టీలలో పాల్గొనడంతో పాటు ప్రకాశ్ రాంకా, రాహుల్‌తో కలిసి బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకలో పబ్, బార్, అపార్ట్మెంట్ పార్టీలకు డ్రగ్స్‌ను గుట్టుగా సరఫరా చేసేవారని సీసీబీ చెబుతోంది. సెలబ్రిటీలకు కూడా మత్తు పదార్థాలను పంపేవారమని రాంకా ఒప్పుకున్నాడు. సంజన ఇంటిలో 9 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా ఆమె డ్రగ్స్ మాఫియాలో పాల్గొన్నట్లు సీసీబీ అనుమానిస్తోంది. సిమ్‌కార్డ్, ఐఫోన్, ప్రోమాక్స్ కంప్యూటర్, సీసీ కెమెరాల డీవీఆర్‌లను స్వాధీనం చేసుకొని సమాచారం సేకరించగా ఆసక్తికర సాక్ష్యాలు బయట పడినట్లు తెలిసింది. నేడు సంజనా బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది. కేసు విచారణలో ఉంది, నేనేం మాట్లాడను : ఐంద్రిత డ్రగ్స్ కేసుపై నేను ఏమీ మాట్లాడకూడదు, సీసీబీ అధికారులు విధించిన నియమాలను పాటించాలి అని నటి ఐంద్రితా రై అన్నారు. విచారణ జరుగుతున్నందున తను మీడియాతో మాట్లాడితే నియమోల్లంఘన కిందకు వస్తుందన్నారు. దిగంత్ సినిమా షూటింగ్‌లకు వెళ్లవచ్చని, కానీ బెంగళూరు విడిచి వెళ్లరాదని చెప్పారన్నారు. ఒకటి రెండురోజుల్లో ఐంద్రిత దంపతులకు మరోసారి నోటీసులు పంపవచ్చని సమాచారం. కాగా, రాధారమణ సీరియల్ నటి శ్వేతాప్రసాద్ తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన ఒక నటితో కలిసిఉన్న పోటో వైరల్ అయ్యింది. ఆ ఫోటో మీద అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టవద్దన్నారు. -
డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి
బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన శాండల్‌వుడ్ అందాల తారామణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్‌ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలను సీసీబీ పోలీసులు సేకరించారు. ఇందులో డ్రగ్స్ దందాతో అనేక మంది ప్రముఖులకు లింకులు ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. డ్రగ్స్ కేసు బయటపడగానే రాగిణి, సంజనలు వారి మొబైల్ ఫోన్లోని డేటాను మొత్తం డిలీట్ చేశారు. అందులో పార్టీల నిర్వహణ, డ్రగ్స్‌తో మజా చేస్తున్న వ్యక్తుల ఫోటోలు, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వారు జరిపే పార్టీల్లోకి డ్రగ్స్ తీసుకొనేవారిని మాత్రమే లోనికి అనుమతించేవారని సీసీబీ పోలీసులు చెబుతున్నారు. నిందితులు పార్టీల్లో కాకుండా, నివాసం ఉండే అపార్టుమెంట్లలో వాడే డ్రగ్స్ వేరేగా ఉండేవని తెలిసింది. దీంతో వారి ఫ్లాట్లలో మళ్లీ సోదాలు జరిపే అవకాశం ఏర్పడింది. మళ్లీ కస్టడీ కోరతారా? సోమవారం సాయంత్రంతో రాగిణి, సంజనల పోలీసు కస్టడీ ముగియనుంది. దీంతో వారిని కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు మరింత కాలం కస్టడీ కోరతారా?, లేదా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. వారిద్దరూ బెయిలు అర్జీలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రాగిణిని మూడుసార్లు, సంజనను రెండుసార్లు కస్టడీకీ తీసుకుని ప్రశ్నించారు. ఇద్దరూ మహిళా సాంత్వన కేంద్రంలో ఎంతో దిగులుగా ఉంటున్నారు. ( సంజన ఫ్లాట్స్‌కు నటులు, సంగీత దర్శకులు ) సంజనపై డ్రగ్స్ సప్లై కేసు నటి సంజన గల్రానిపై డ్రగ్స్ సేవించడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా పోలీసులు నమోదు చేశారు. సంజన తన వ్యాపార లావాదేవీలను ఎక్కువగా ఒకే సముదాయం చెందిన వ్యక్తులకు అప్పగించటంపై కూడా సీసీబీ దృష్టి సారించింది. సీసీబీకీ పూర్తి అధికారం: హోంమంత్రి డ్రగ్స్ కేసు దర్యాప్తుకు సీసీబీకి పూర్తి అధికారం అప్పగించిన్నట్లు హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అయన ఆదివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. సీసీబీకి సిబ్బంది కొరతను నివారించి వసతులను కల్పిస్తామని చెప్పారు. డ్రగ్స్‌తో యువత జీవనం నాశనం కాకూడదన్నారు. ఎమ్మెల్యే జమీర్‌కు నోటీసు? డ్రగ్స్ దందా కేసులో చామరాజపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్‌కు నోటీసులు ఇవ్వాలని సీసీబీ నిర్ణయించింది. జమీర్ అహ్మద్, నటి సంజనలు శ్రీలంకలో క్యాసినోలో పాల్గొన్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఆరోపించటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సంబరగి నుంచి సీసీబీ సమాచారాన్ని సేకరించింది. జమీర్ అహ్మద్‌ను కూడా ప్రశ్నించవచ్చని తెలిసింది. ( డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం ) కొలంబో క్యాసినోకు తారల ప్రచారం శ్రీలంకలో క్యాసినో జూదాల్లో పాల్గొనడం గురించి నటీనటులు బహిరంగ ప్రచారం చేసిన వ్యాపార ప్రకటనలు బయటపడుతున్నాయి. క్యాసినోకు మేం వెళ్లాం, మీరూ వెళ్లండి అని ఐంద్రితారై, కాజల్, బిపాసా బసు, ఊర్వశి రౌటేలా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోను సూద్ తదితర అనేకమంది నటీనటులు పాల్గొన్న ప్రకటన అది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన షేక్ ఫాసీల్‌కు వీరు ధన్యావాదాలు చెప్పడం గమనార్హం. వివిధ బాషలకు చెందిన నటీనటులను డ్రగ్స్ నిందితులు కావలసిన నజరానాలు ఇచ్చి క్యాసినోకు తీసుకెళ్లినట్లు సీసీబీకీ బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి. దీంతో మరికొందరు నటీనటులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. -
సంజన ఫ్లాట్స్‌కు నటులు, సంగీత దర్శకులు
బెంగళూరు : డ్రగ్స్ కేసు దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. డ్రగ్స్ వినియోగం, రవాణాపై ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన నటీమణులు రాగిణి, సంజనాతో పాటు ఆరుగురిని సీసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు జాయిట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ శుక్రవారం ఉదయం మహిళా సాంత్వన కేంద్రానికి వెళ్లి నటీమణులు రాగిణి, సంజనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు, ఎప్పటి నుంచి పార్టీలను నిర్వహిస్తున్నారనే వివరాలు సేకరించారు. కొందరు రాజకీయ నాయకుల పుత్రులు మత్తు పదార్థాలను తీసుకొనేవారని రాగిణి, సంజనాలు వెల్లడించినట్లు తెలిసింది. విచారణలో వారు వెల్లడించిన వివరాల మేరకు సదరు రాజకీయ నేతల పుత్రులకు నోటీసులు ఇవ్వాలని సీసీబీ పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టి అరెస్ట్ మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టికి ప్రముఖ డ్రగ్స్ పెడ్లర్‌గా పేరుంది. ఇతనిని శుక్రవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. తప్పించుకుని తిరుగుతున్న షేక్ ఫైజల్, ఆదిత్య ఆళ్వల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతీక్‌శెట్టికి డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నిశాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఫైజల్ ఇంటిపై దాడి చేసి అతడి తమ్ముడిని విచారించిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ప్రతీక్‌శెట్టిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. డ్రగ్స్ కేసులో ఫైజల్ పాత్ర అధికంగా ఉన్నట్లు గుర్తించిన సీసీబీ అతని కోసం గాలిస్తున్నారు. ( డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం ) పది ఫ్లాట్సూ నావే : సంజన నటి సంజనాను పోలీసులు శుక్రవారం కూడా సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు నగరంలో 10 ప్లాట్స్ ఉన్నట్లు అంగీకరించారు. ఫ్లాట్స్‌కు ఎవరెవరు వచ్చి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కన్నడ సినీ రంగానికి చెందిన అనేక మంది నటులు, సంగీత దర్శకులు వచ్చి వెళ్లినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో సంజనా ఫ్లాట్‌కు వెళ్లిన సినిమా రంగానికి చెందిన ప్రముఖులు న్యాయ సలహాలను తీసుకుంటున్నట్లు సమాచారం. కేసు నుండి తప్పించుకోవటానికి రాజకీయ నాయకులు, వ్యాపారులు, శ్రీమంతుల పుత్రులు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రాగిణి బెయిల్ పిటిషన్ వాయిదా బెయిల్ కోసం నటి రాగిణి 33వ సీసీహెచ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది. రాగిణి పోలీసు కస్టడీ అవధి శుక్రవారంతో ముగియటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరు పరిచారు. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సీసీబీ పోలీసులు పేర్కొనడంతో పోలీస్ కస్టడీని 14 వరకు పొడిగించింది. మరో నిందితురాలు సంజనాను కూడా శుక్రవారం కోర్టు ముందు హాజరు పరిచి కస్టడీకి తీసుకున్నారు. క్యాసినోలో మాజీ ఎమ్మెల్సీ శ్రీలంకలోని క్యాసినోలో బెంగళూరుకు చెందిన మాజీ ఎంఎల్సీ ఒకరు పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో ముగ్గురు ప్రముఖ నటులు కూడా క్యాసినోలో పాల్గొన్నట్లు సీసీబీ సమాచారం సేకరించింది. ప్రశాంత్ సంబరగిపై కేసు నమోదు సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగిపై పోలీసులు సెక్షన్ ఐపీసీ 120బి, 504 సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ఖాన్ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జమీర్ తరఫు న్యాయవాది చామరాజపేట పోలీసులకు వివరణ ఇచ్చారు. -
నన్ను బకరా చేస్తున్నారు: సంజనా
బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో బహుభాషా నటి సంజనా గల్రాని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెపై సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డోప్ టెస్టు చేయించేందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. డ్రగ్ టెస్టు నిమిత్తం గురువారం ఉదయం ఆమెను బెంగళూరులోని కేపీ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పోలీసులతో, వైద్యులతో వాగ్వాదానికి దిగారు. టెస్టు చేయించుకోనని తేల్చి చెప్పారు. తను ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎందుకు పరీక్ష చేయించుకోవాలని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: టచ్‌లో బడాబాబులు) "నేనేం తప్పు చేయలేదు. అయినా ఎందుకు అరెస్ట్ చేశారు? అందరి ముందు నన్ను బకరా చేస్తున్నారు. నాకు పోలీసులపై నమ్మకం నశిస్తోంది. నన్ను రక్షిస్తామని మీడియా ముందు చెప్పారు, ఇప్పుడేమో రక్తపరీక్ష చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? నేను తప్పు చేసినట్టు ఏ సాక్ష్యం లేకపోయినా నన్ను బలిపశువును చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. పరీక్షకు అంగీకరించడం, అంగీకరించకపోవడం నా హక్కు. నేను చేయించుకోను" అంటూ సంజనా పోలీసులపైకే ఎదురు తిరిగారు. కాగా డ్రగ్స్ కేసులో సంజనా సన్నిహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. అతడి ఫోన్లో స్వాధీనం చేసుకున్న సమాచారం ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో నటి రాగిణి ద్వివేదిని, సంజన గల్రానిని సైతం అరెస్ట్ చేశారు. (చదవండి: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు: సంజన అరెస్టు!) -
డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడు బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలన్నీ చూపడంతో సంజన పెళ్లయిందని ఒప్పుకోక తప్పలేదు. మత్తు గుట్టురట్టు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో సీసీబీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసులో అరెస్టయిన నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. వారి సన్నిహితులు, మిగతా నిందితులు ముఖ్య సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ను డెబిట్, క్రెడిట్, బిట్ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డార్క్ వెబ్‌లో డ్రగ్స్ ముఠాలు, ఆఫ్రికన్ల నుంచి కొనుగోలు చేసేవారని తెలిసింది. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన) మరికొందరు నటీమణులు? కొందరు నటీమణులు డ్రగ్స్ పార్టీలలో పాల్గొనేవారని సీసీబీ విచారణలో బయటపడింది. రవిశంకర్, రాహుల్, వీరేన్ఖన్నాలు ముగ్గురూ విచారణలో రాగిణి, సంజనల పేర్లు చెప్పినట్లు తెలిసింది. మరికొందరు నటీమణులకు కూడా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు నిందితులు తెలిపారు. నటి సంజనా గతంలో కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుంటున్న వీడియో సీసీబీ పోలీసులకు చిక్కింది. డ్రగ్స్ కేసులో 13వ నిందితుడు నియాస్ అహమ్మద్ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తుండగా సీసీబీ పోలీసులు మరింతకాలం విచారించాల్సి ఉన్నందుకు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరికీ విడి విడి గదులు డ్రగ్స్ కేసులో మహిళా సాంత్వన కేంద్రంలో ఉంటున్న రాగిణి, సంజనా గల్రానీలకు ప్రత్యేక గదులను కేటాయించారు. ఐదు పడకలు ఉన్న హాల్‌ను ఇద్దరికీ ఉమ్మడిగా ఇవ్వగా, ప్రత్యేక గదులు కావాలని పట్టుబట్టారు. వారిద్దరి మధ్య విభేదాలున్నందున ప్రత్యేక గదులను కేటాయించి భద్రతను పెంచారు. ల్యాబ్‌కు ఇద్దరి మొబైళ్లు సీసీబీ పోలీసులు రాగిణి, సంజనాల మొబైల్ఫోన్ల నుంచి వాట్సాప్, అవుట్ గోయింగ్ కాల్ డేటాను సేకరిస్తున్నారు. సుమారు 100 మందితో వీరు నిత్యం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అరెస్ట్ చేస్తారని తెలియడంతోనే వీరు మొబైళ్లలోని సమాచారాన్ని తొలగించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి సమాచార పునరుద్ధరణ చేస్తున్నారు. రాగిణికి అస్వస్థత రాగిణి తల తిరుగుతున్నట్లు, ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో ఆమెను కేసీ జనరల్ ఆస్పత్రికీ తీసుకెళ్లి పరీక్షలు చేయించగా లో బీపీతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు బయట పడింది. రక్తపరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పగా రాగిణి వ్యతిరేకించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఐ అంజుమాల చెప్పగా, సరేనన్నారు. -
ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన
బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్టయిన శాండల్‌వుడ్ నటీమణి సంజనా గల్రానిని బుధవారం 10 గంటల సమయంలో సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి తీసుకురాగా, మహిళా సీఐ అంజుమాల బృందం సంజనాను విచారించారు. మహిళా సాంత్వన కేంద్రంలో రాగిణి ద్వివేదిని మహిళా సీఐ కాత్యాయని ప్రశ్నించారు. నిందితుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో పాటు వివిధ కోణాల ద్వారా సేకరించిన వివరాలపై సంజనాను విచారించారు. 34 మంది పెద్ద పెద్ద వ్యక్తుల పుత్రుల పేర్లను సంజనా సీసీబీకి వెల్లడించిన్నట్లు సమాచారం. ఆమె చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలుసుకొంటున్నారు. బెంగళూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల పుత్రులున్నట్లు తెలిసింది. మంగళూరు, యలహంక, కమ్మనహళ్లిలో జరిగిన హై–ఫై పార్టీలలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఆరా తీస్తున్నారు. సంజనా, రాగిణి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఇతర నిందితులు వీరేన్ ఖన్నా, రాహుల్ నిర్వహించిన పార్టీలలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల బడాబాబులు పాల్గొనేవారని సంజనా తెలిపింది. తను తప్పు చేశానని సంజన ఆవేదన చెందినట్లు సమాచారం. తనను మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజన పట్టుబట్టగా అధికారులు ఒప్పుకోలేదు. ( ఫోన్లో మెసేజ్‌లను తొలగించిన నటి ) సంజన కంట నీరు నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాని కేసుల గొడవతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. బెంగళూరు డైరీ సర్కిల్లోని మహిళా సాంత్వన కేంద్రంలో వీరిద్దరినీ ఉంచారు. మంగళవారం రాత్రి వీరికి ఐదు బెడ్లు ఉన్న ఒకే గదిని కేటాయించారు. ఇద్దరి మధ్య మాటలు లేకుండా గడిపారు. ఆ చివర, ఈ చివర బెడ్లను ఇద్దరికీ కేటాయించగా, మధ్యలో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. తనకు రాత్రి భోజనం వద్దని చెప్పిన సంజనా ఇదంతా నా కర్మ అంటూ బోరున విలపించినట్లు తెలిసింది. రాగిణి, సంజనకు కేపీఎల్‌లో విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి మాటలు లేవు. మహిళలే దొరికారా? డ్రగ్స్ దందాలో రాగిణి, సంజనా పేర్లను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారని మరో నటీమణి పారూల్ యాదవ్ ఆక్రోశించారు. వారికి మద్దతుగా ఆమె గళమెత్తారు. దేశంలో డ్రగ్స్‌ను సేవిస్తున్నదీ, అమ్ముతున్నదీ ముగ్గురు (రియా చక్రవర్తి, రాగిణి, సంజనా) మాత్రమేనా, ఇంక ఎవరూ ఈ దందాలో లేరా? అని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ సిబ్బంది, క్రీడాకారులు, నటులు డ్రగ్స్ వ్యవహారంలో లేరా? అని ఆమె సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. -
నటి సంజన అరెస్ట్
యశవంతపుర: కర్ణాటక సినీరంగాన్ని డ్రగ్స్ భూతం కుదిపేస్తోంది. డ్రగ్స్ రవాణా ఆరోపణలపై తాజాగా బహుభాషా నటి సంజనా గల్రానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఉంటున్న బెంగళూరులోని ఇందిరానగర రోడ్డు సాయితేజ్ అపార్ట్‌మెంట్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌తో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో సంజనా సన్నిహితులు రాహుల్, పృథ్వీశెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో గత శుక్రవారం ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసి విచారిస్తుండడం తెలిసిందే. అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు నటి సంజనా.. నోటీసు లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహించారు. నీవు చెప్పినట్లు మేం నడుచుకోలేం అని స్పష్టంచేశారు. కోర్టు వారంట్‌ను చూపించి అరెస్టు చేశారు. కాగా, ఓ ఎమ్మెల్యే తనయుడు, ఓ వర్ధమాన నటి, ఇద్దరు సీరియల్ నటుల పేర్లు బయటపడినట్లు సమాచారం. -
డ్రగ్స్ కేసు: నటి సంజన అరెస్టు!
సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా నటి సంజన సన్నిహితుడు, రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే.(చదవండి: రంగుల తెరపై డ్రగ్స్ మరక!) అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందారు.( చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) టాలీవుడ్ డ్రగ్స్ కేసును తలపిస్తున్న కన్నడ చిత్ర సీమ వ్యవహారం రెండేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ అనేక మంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైన తారల లిస్టులో ఉన్నారు. ఇక ఇటీవల శాండల్‌వుడ్‌లోనూ ఇదే తరహా డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ క్రమంలో ఆగష్టులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనిఖా అనే యువతి కూడా ఉంది. సోదాల్లో భాగంగా ఆమె.. డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను గుర్తించారు. విచారణలో భాగంగాపలువురు హీరోలు, హీరోయిన్లు, సింగర్లకు అనిఖా డ్రగ్స్ సరఫరా చేసినట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని.. పలువురు సెలబ్రిటీలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు బీ-టౌన్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. -
నటి సంజనకు పోలీసుల నోటీసు
కర్ణాటక,యశవంతపుర : నడుస్తున్న కారులో సెల్ఫీ తీసుకున్న కేసుకు సంబంధించి శాండిల్‌వుడ్ నటి సంజనకు పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే తనకు కొంత వ్యవధి కావాలని ఆమె పోలీసులను కోరారు. తను షూటింగ్ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నానని, వచ్చిన తరువాత హాజరవుతానని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంజనా కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అవి వైరల్‌గా మారండంతో సీరియస్‌గా పరిగణించిన పోలీసులు వివరణ ఇవ్వాలని సంజనకు నోటీసులు పంపారు. ఆమె సెల్ఫీపై నెటిజన్లు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. View this post on Instagram Hey guys I'm going to watch #sarileruneekevvaru ! Can’t Wait to go watch my love love loveeee ❤ #maheshbabu #fangirl A post shared by SANJJANAA GALRANI (@sanjjanaagalrani) on Jan 12, 2020 at 8:33am PST -
సంజన వర్సెస్ వందన
సాక్షి, బెంగళూరు : బహుభాషా నటి సంజనా గల్రాని, ప్రముఖ నిర్మాత వందన జైన్ల మధ్య క్రిస్మస్ ముందు రోజు జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. ఇద్దరు పరస్పర ఆరోపణలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి బెదిరించుకునే స్థాయి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరి రచ్చ శాండిల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... క్రిస్మస్ పండగకు ముందు రోజు నగరంలోని ప్రముఖ పబ్‌లో జరిగిన ఓ పార్టీ లో సంజన, నిర్మాత వందన జైన్లు పాల్గొన్నారు. మద్యం మత్తులో ఇద్దరు పరస్పరం గొడవపడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సంజనా ఏకంగా బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం సంజన మీడియాతో మాట్లాడుతూ...వందనకు రూ. 200 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ దందాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ నాయకులు, క్రికెటర్ల నుంచి వందన జైన్ అక్రమ దందాలు చేసినట్లు ఆరోపించారు. ఇదే విషయంపై నిర్మాత వందన జైన్ మాట్లాడుతూ... తనను ప్రశ్నించటానికి సంజన ఎవరిని, తాగిన మైకంలో తనపై దాడి చేయడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంజన విషయాలు తనకు అన్నీ తెలుసని, అవి బయటపెడితే రోడ్డున పడుతుందని వందన అన్నారు. సంజన మద్యం బాటిల్‌తో తనపై దాడి చేసిన దృశ్యాన్ని అందరూ చూశారని, తనను సంజన హత్య చేస్తానని బెదిరిస్తున్నారని అన్నారు. తనకు బెంగళూరులో స్నేహితులు ఉన్నారని, నగరానికి వచ్చిన ప్రతిసారి వారిని కలుస్తానని, క్రిస్మస్ ముందురోజు స్నేహితులతో ఉండగా సంజన తనపై మద్యం బాటిల్‌తో దాడి చేసిందని వందన ఆరోపించారు. నటి సంజనపై ఫిర్యాదు నటి సంజనా తనపై దాడి చేశారని బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న బెంగళూరులోని ఒక పబ్‌లో సంజన తనపై దాడి చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదుపై సంజన వివరణ ఇచ్చారు. తాను ఎవరిపైనా దాడి చేయలేని స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, కేవలం తన స్నేహితులతో వాగ్వాదం జరిగిందన్నారు. -
హీరోయిన్ సంజనకు సర్జరీ
సాక్షి, బెంగళూరు : 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ నటి సంజనా గల్రానీకి సర్జరీ జరిగింది. తన అండాశయంలో పెరిగిన 550 ఎమ్ఎల్ డెర్మాయిడ్‌ని సర్జరీ చేసి తీసివేశారని సంజన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు తెలిపారు. అందుకే దాదాపు ఒక నెల నుంచి ఎక్కువగా బయటకు రావడం లేదని పేర్కొన్నారు. ప్రతి మహిళ కనీసం ఆరునెలలకొకసారి అయినా మమ్మోగ్రామ్ చేపించుకోవాలని, అండాశయం, గర్భాశయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 45 సినిమాల్లో సంజనా నటించారు. సంజనా ప్రస్తుతం తెలుగులోని ఓ ప్రముఖ టీవీ చానెల్లో ప్రసారమవుతున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్లో నటిస్తున్నారు. -
ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదు..
సాక్షి బెంగళూరు: తనపై నటి సంజన చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని దర్శకుడు రవి శ్రీవత్స కొట్టిపారేశారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలకు ఆమె క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘గండ హెండతి’ చిత్రం షూటింగ్ సందర్భంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రవి శ్రీవత్సపై నటి సంజనా ఆరోపణలు చేశారు. షూటింగ్లో మొదట ఒక ముద్దు అంటూ ఆపై 10, ఆ తర్వాత 30 ముద్దులు పెట్టారంటూ సంజనా ఆరోపించారు. రవి శ్రీవత్స స్పందిస్తూ తాను ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదని తెలిపారు. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీమణులు, సీనియర్ పాత్రికేయుడు రవి బెళగెరె సైతం ఉన్నారని పేర్కొన్నారు. ఇంతమంది షూటింగ్లో ఉండగా తాను ఎలా ముద్దు పెట్టగలనని అన్నారు. ఒకటికి రెండు సార్లు సినిమా గురించి వివరించి తెలిపాకే ఆమెను తీసుకున్నట్లు తెలిపారు. హిందీ సినిమా ‘మర్డర్’ రీమేక్ అని చెప్పి ఆ సినిమా సీడీని కూడా ఇచ్చి చూడమని తెలిపానని చెప్పారు. సంజనా పబ్లిసిటీ కోసమే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న మరో దర్శకుడు వి.నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ #మీటూను దుర్వినియోగం చేస్తున్నారని, దర్శకులు సంఘం సంజనా ఆరోపణలను ఖండిస్తోందని చెప్పారు. -
నాతో అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు..
సినిమా: తననూ మోసం చేశారు అని నటి సంజనా గల్రాణి అంటోంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో వివిధ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు నటి నిక్కీగల్రాణి సహోదరి అన్నది గమనార్హం. ఇప్పుడు సినీ పరిశ్రమలో లైంగికవేధింపుల ఆరోపణలు వీరవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెడుతున్నారు. అలా మీటూ అంటోంది సంజనా గల్రాణి. హిందీ చిత్రంలో నటిస్తున్న సమయంలో నేనూ లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పింది. ఆ కథేంటో ఆమె మాటల్లో చూద్దాం. నేను 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టాను. అప్పుడు ప్లస్‌ఒన్ చదువుతున్నాను. ఆ సమయంలో సినిమాల్లో నటించి మళ్లీ చదువుకోవచ్చుననే ఆలోచనతో వచ్చాను. తొలి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు హిందీ చిత్రం మర్డర్‌ను చూపించి దీన్నే కన్నడంలో రీమేక్ చేస్తున్నామని చెప్పారు. అందులో పలు అశ్లీల సన్నివేశాలు చోటు చేసుకోవడంతో నేను నటించనని చెప్పాను. అందుకా దర్శకుడు మర్డర్ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులకు తగ్గట్టుగా పలు మార్పులు చేస్తున్నట్లు చెప్పడంతో అందులో ఒక్క ముద్దు సన్నివేశంలో నటించడానికి మాత్రం నేను అంగీకరించాను. చిత్ర షూటింగ్ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్ వెళ్లడానికి అంగీకరించిన దర్శకుడు అక్కడకు వెళ్లిన తరువాత అమ్మను షూటింగ్ స్పాట్‌కు రావొద్దని చెప్పారు. అక్కడ నాతో పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయగా మేము చెప్పినట్లు చేయకుంటే నీ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరించారు. అలా ఎన్నో కలలతో వచ్చిన చిన్న పిల్లనైన నన్ను వారు ఇష్టానికి వాడుకున్నారు అని నటి సంజనా గల్రాణి ఆవేదన వ్యక్తం చేసింది. -
సిద్దు తరపున నటి సంజనా ప్రచారం
యశవంతపుర : కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయాటనికి కన్నడ చిత్రసీమ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపుర చాముండేశ్వర నియోజకవర్గం నుండి ప్రచారం చేయనున్నట్లు నటీ సంజనా తెలిపారు. సినిరంగానికి చెందిన నటుడు యశ్ కేఆర్ నగర జేడీఎస్ అభ్యర్థి సారా మహేశ్, కృష్ణరాజ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రామదాస్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. బెంగళూరు నగరంలోని దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున లూస్ మాదయోగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాదామిలో శ్రీరాములు తరపున కూడ సినీ రంగానికి చెందిన నటులు ప్రచారం చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. -
గెడ్డం గీయించుకున్న హీరోయిన్
హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు. హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే.. అందరిలా కేవలం మేకప్‌తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు అనుమానంగా వచ్చిందా? పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం. -
నేచురల్లే నుంచి రైస్ బ్రాన్ ఆయిల్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేచురల్లే బ్రాండ్ పేరుతో వంట నూనెల విక్రయంలో ఉన్న సరైవాలా అగ్రి రిఫైనరీస్ తాజాగా రైస్ బ్రాన్ ఆయిల్ విభాగంలోకి ప్రవేశించింది. అలాగే ఇదే బ్రాండ్‌లో సోనా మసూరీ రైస్‌ను సైతం సినీ నటి సంజనా గల్రానీ చేతుల మీదుగా సోమవారమిక్కడ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నూనె) కోసం ప్రత్యేక యూనిట్‌ను రూ.25 కోట్లతో ఏర్పాటు చేసింది. రోజుకు 100 టన్నుల నూనె ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉంది. ఇక వంట నూనెల పరిశ్రమ 7 శాతం వృద్ధి చెందుతోందని సరైవాలా డెరైక్టర్ అంజని కుమార్ గుప్తా ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అయితే రైస్ బ్రాన్ విభాగం మాత్రం అత్యధికంగా 25-30 శాతం వృద్ధి నమోదు చేస్తోందని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కంపెనీలు నెలకు 4,000 టన్నుల రైస్ బ్రాన్ ఆయిల్ విక్రయిస్తున్నాయి. కాగా, సరైవాలా అగ్రి రిఫైనరీస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద రూ.50 కోట్లతో రిఫైనరీ నెలకొల్పుతోంది. రోజుకు 550 టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటులో జూన్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. నేచురల్లే బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సైతం కంపెనీ విక్రయిస్తోంది.