
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలుపెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికేవాళ్లుంటారు. ఈ సీజన్‌లో కూడా మూడు రోజుల్లోనే కావాల్సినదానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజనా (Sanjana Galrani)! ఈమె సరదాసరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతోంది. నిజంగా గొడవపడితే హౌస్ ఏమైపోతుందో మరి!
అందరికీ పూనకాలు తెప్పిస్తున్న సంజనా
తను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్‌లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజనా మాత్రం తాపీగా సోఫాలో కూర్చుని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఆ ఒక్క సీన్ చాలు.. నువ్వుండాలమ్మా.. కచ్చితంగా ఉండాల్సినదానివే! అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటోంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ, అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్‌లో ఈమెనే అందరికంటే హైలైట్‌గా నిలుస్తోంది.
కెప్టెన్‌గా..
ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలక్ట్ చేయమని బిగ్‌బాస్ సంజనాకు బాధ్యత అప్పగించాడట! దాంతో ఆమె హరీశ్, శ్రష్టి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్‌లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి కెప్టెన్సీ సంజనా చేతికి చిక్కిందట! గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడదే ఇంట్లో కెప్టెన్ బెడ్‌రూమ్‌లో దర్జాగా సేద తీరనుంది సంజనా. కెప్టెన్‌గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాలి!
చదవండి: 5 నెలల పాప.. గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?: సంజనా ఫైర్