బిగ్‌బాస్ 9 సీజన్ దాదాపు చివరకొచ్చేసింది. మరో పదిరోజులు మాత్రమే మిగిలున్నాయి. నేపథ్యంలో ఉండాల్సినంతా డ్రామా కనిపించట్లేదు. పైపెచ్చు టాప్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉండాల్సింది పోయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదే కాస్త చిత్రంగా అనిపిస్తుంది. తాజా ఎపిసోడ్‌లో అయితే తనూజకు కల్యాణ్ ఫుల్ సరెండర్ అయిపోయాడు. ఇంతకీ బుధవారం ఏమేం జరిగింది?
కల్యాణ్ తొలి ఫైనలిస్ట్ అయిపోయాడు. దీంతో రెండో ఫైనలిస్ట్ రేసులో తదుపరి గేమ్ ఆడకుండా ఒకరిని తప్పించాలని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్ మెజారిటీ ప్రకారం సంజన తప్పుకొంది. తర్వాత మిగిలున్న ఐదుగురికి 'పట్టుకో పట్టుకో' అనే పోటీ పెట్టారు. ఇందులో భాగంగా సంచాలక్స్ కల్యాణ్, సంజన వేసే బంతుల్ని.. జంబో ప్యాంట్స్ వేసుకున్న పోటీదారులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తనూజకు కల్యాణ్ ఫుల్‌గా సపోర్ట్ చేశాడు. 10లో 7 బంతులు ఆమెకే వేయడం విశేషం. మరోవైపు సుమన్ పక్కనే నిలబడ్డ భరణి.. అతడి బంతుల్ని పట్టేసుకున్నాడు. అన్నా అది నా బల్ అని సుమన్ అంటున్నా గానీ భరణి సైలెంట్‌గానే ఉండిపోయాడు. ఈ పోటీలో తనూజ తొలి స్థానం దక్కించుకోగా భరణి, పవన్, ఇమ్మూ, సుమన్ మిగతా స్థానాల్లో నిలిచారు.
గేమ్ తర్వాత తనూజ-కల్యాణ్ గురించి భరణి-సంజన మాట్లాడుకున్నారు. మరి అంత దారుణంగా.. కూర్చో అంటే కూర్చుంటున్నాడు నిలబడు అంటే నిలబడుతున్నాడు.. నేను రిలేషన్‌ని తప్పుబట్టను.. వాళ్లిద్దరూ ఎందుకో పాపం.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం కానీ తనూజ మరీ ఓవర్ కమాండ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు అని భరణి అన్నాడు. బాల్ టాస్క్ తర్వాత లీడర్ బోర్డ్‌లో ఇమ్మానుయేల్, డీమాన్ పవన్ టాప్-2లో ఉన్నారు. దీంతో ఈసారి ఇద్దరిని తర్వాత గేమ్ నుంచి తప్పించాలని బిగ్‌బాస్ పుల్ల పెట్టాడు. అలా కాసేపు హౌస్‌మేట్స్ తర్జన భర్జన తర్వాత వీళ్లిద్దరినీ తప్పించారు.
తర్వాత 'పట్టు వదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా పజిల్ పూర్తి చేసి, రోల్ అవుతున్న తాడుని పట్టుకోవాల్సి ఉంటుంది. తొలి స్థానంలో నిలిచిన వాళ్లకు 100 పాయింట్లు వస్తాయని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో తనూజ, సంజన.. త్వరగానే పజిల్ పూర్తి చేశారు గానీ తాడుని ఎక్కువసేపు పట్టుకోలేక కింద పడేశారు. ఇక్కడే తెలివి చూపించిన భరణి.. ఆలస్యంగా పజిల్ పూర్తి చేసి తాడు చివరలో ఉండగా వెళ్లి, కాసేపు దాన్ని పట్టుకుని టాస్క్ పూర్తి చేశాడు. 100 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. సుమన్ అయితే ఈ టాస్క్ పూర్తి చేయలేకపోయాడు.
పట్టు వదలకు టాస్క్ పూర్తి చేసిన భరణి(230).. ఒకేసారి 100 పాయింట్లు రావడంతో లీడర్ బోర్డ్‌లో టాప్‌లోకి వచ్చేశాడు. తర్వాత తనూజ (220), ఇమ్మాన్యుయేల్ (170), డీమన్ పవన్ (150), సంజన (140), సుమన్ (100) వరసగా నిలిచారు. ఇక టాప్-2లో నిలిచిన భరణి, తనూజలో ఒకరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమని చెప్పగా.. హౌస్‌లోకి వచ్చిన ఆడియెన్స్, తనూజ పేరు చెప్పారు. దీంతో ఈమె ఓటు అప్పీలు చేసుకుంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.


