ప్రతివారం ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే ఇతర భాషల్లో ఆకట్టుకున్న మూవీస్ కూడా డబ్బింగ్ రూపంలో వస్తుంటాయి. ఇప్పుడు అలా ఓ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం ఒరిజినల్ వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి రాగా.. ఇప్పుడు తమిళ, తెలుగు వెర్షన్స్‌ని తీసుకొచ్చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ లేటెస్ట్ మూవీ 'బ్రాట్'. అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరి చిత్రం అనిపించుకుంది. క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఆసక్తి ఉంటే ఓ లుక్ వేయొచ్చు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
'బ్రాట్' విషయానికొస్తే.. క్రిస్టీ(డార్లింగ్ కృష్ణ) ఓ ఆకతాయి కుర్రాడు. సులభంగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు అయిపోవాలని కలలు కంటుంటాడు. దీంతో ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్‌లోకి దిగుతాడు. అయితే క్రిస్టీ తండ్రి పోలీస్. దీంతో తండ్రి-కొడుకల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ సెకండాఫ్‌లో ల్యాగ్ వల్ల యావరేజ్‌గా నిలిచింది.
ఈ వారం దీనితో పాటు చాలా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అల్లరి నరేశ్ '12ఏ రైల్వే కాలనీ' సినిమా.. ఈరోజే అమెజాన్ ప్రైమ్‌లోకి రాగా.. దుల్కర్ సల్మాన్ 'కాంత' నెట్‌ఫ్లిక్స్‌లోకి శుక్రవారం రానుంది. అలానే 'ఆరోమలే' అనే డబ్బింగ్ సినిమా హాట్‌స్టార్‌లోకి, త్రీ రోజెస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఆహా ఓటీటీలోకి, ఎఫ్ 1 అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి రానున్నాయి.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ హారర్ థ్రిల్లర్)


