బాలయ్య అఖండ-2 వివాదం తర్వాత ఎట్టకేలకు రిలీజవుతోంది. నాలుగైదు రోజుల చర్చల తర్వాత ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అఖండకు సీక్వెల్గా వస్తోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు క్లియర్ కావడంతో ఈ శుక్రవారం అఖండ-2 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మరో టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ-2 రిలీజ్ టీజర్ పేరుతో విడుదలైంది.
తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై జీవో..
తెలంగాణలో అఖండ-2 మూవీకి సంబంధించి టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీ ప్లెక్స్‌ల్లో రూ.100 వసూలు చేసుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ పెంచిన ధరలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబర్ 11 రాత్రి 8 గంటల ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేట్ నిర్ణయించారు. పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించాలని జీవోలో వెల్లడించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని సూచించారు.


