బిగ్‌బాస్ హౌస్‌లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం పోటీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ పోటీలో భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజనా మిగిలారు. తాజా ప్రోమోలో తక్కువ పాయింట్లతో చివర్లో ఉన్న భరణి ఆటలో నుంచి అవుట్ అయిపోయాడు.
భరణి కంటతడి
దీంతో కన్నీళ్లు పెట్టుకున్న భరణి.. తన దగ్గరున్న పాయింట్స్ సగం తనూజకు ఇచ్చేశాడు. చివరకు ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరికి పెట్టిన పలు గేమ్స్‌లో చివరకు తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తనూజ తాను డైరెక్ట్‌గా ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
తనూజ గొప్ప నిర్ణయం
ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే తాను ముందుకు సాగుతానంది. ఈ వారం జనాలు తనను సేవ్ చేస్తేనే ఫైనల్స్‌కు వెళ్తానని, ఇమ్యూనిటీ వద్దని తిరస్కరించిందని సమాచారం. ఇదే నిజమైతే తనూజకు నేటి ఎపిసోడ్ మరింత ప్లస్ అవడం ఖాయం. కాకపోతే ఈ సెకండ్ ఫైనలిస్ట్ అనే అవకాశం భరణి, సంజనాలలో ఒకరికి వచ్చుంటే వారికి ఎంతో ఉపయోగపడేది.


