టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. అంతేకాకుండా జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇటీవలే రిలీజైన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిత్రంతో అభిమానులను అలరించారు. టాలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా తిరువీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రైనట్లు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. నాయినొచ్చిండు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తిరువీర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్. తెలంగాణకు చెందిన తిరువీర్ 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతను.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్, మోక్షపటం చిత్రాల్లో నటించారు.
గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తిరువీర్. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఆగస్టులో తన తిరువీర్ భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది.
నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03
— Thiruveer (@iamThiruveeR) December 12, 2025


