సినిమా రంగుల ప్రపంచం. ఇక్కడ తారలు అందాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు డైటింగ్ పేరుతో నచ్చింది తినలేరు. శరీరాకృతిని నియంత్రించుకోవడానికి, వీలైతే జీరో సైజ్‌కు మారడానికి కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్, స్విమ్మింగ్‌పూల్‌లో గడుపుతుంటారు. కొందరు యోగా కూడా చేస్తుంటారు. ఇన్ని చేసినా, అందరూ స్టార్ హీరోయిన్లు అవుతారా ? అంటే అది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
అలా అందం, అభినయంతో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగింది అలనాటి నటి రాధ. ఈమె సోదరి అంబిక కూడా హీరోయిన్‌గా రాణించారు. అయితే రాధ వివాహానంతరం నటనకు స్వస్తి పలికారు. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లు ఇద్దరూ తల్లి బాటలోనే పయనించే ప్రయత్నం చేశారు. పెద్ద కూతురు కార్తీక.. జీవాకు జంటగా నటించిన కో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే తొలి చిత్రం తరువాత మంచి విజయాలు లేక కనుమరుగయ్యారు.
అలా కనిపించి ఇలా కనుమరుగు
రాధ రెండవ కూతురు తులసి 14 ఏళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేశారు. అయితే తొలి చిత్రంతోనే అపజయాన్ని చవి చూసింది. దీంతో ఈమె కూడా తిరుగు టపా కట్టాల్సి వచ్చింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ వారసురాళ్లు సినిమా రంగంలో నిలదొక్కుకోకపోవడం ఆశ్చర్యమే. ఆ మధ్య కార్తీక వివాహం జరిగింది. ఆ సమయంలో తులసి రూపం చూసి తనేనా? అని ఆశ్యర్యపోయారు.
బొద్దుగా తులసి
తాజాగా భారీకాయంతో ఉన్న తులసి ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంకా పెళ్లి కాని ఈ అమ్మడి వయసు 28 ఏళ్లే. నటి రాధ వివాహానంతరం బరువు పెరిగితే, ఆమె కూతురు పెళ్లికి ముందే ఇలా బరువు పెరగడంతో తనకేమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు.
Tulasi Nair ( Radha 's Daughter & Kadal Movie Heroine )
Now And Then ! pic.twitter.com/EOassELTJ2— TamilaninCinema Akilan (@TamilaninCinema) December 8, 2025


