breaking news
Thulasi Nair
-
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఎలా మారిపోయిందో!
సినిమా రంగుల ప్రపంచం. ఇక్కడ తారలు అందాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు డైటింగ్ పేరుతో నచ్చింది తినలేరు. శరీరాకృతిని నియంత్రించుకోవడానికి, వీలైతే జీరో సైజ్‌కు మారడానికి కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్, స్విమ్మింగ్‌పూల్‌లో గడుపుతుంటారు. కొందరు యోగా కూడా చేస్తుంటారు. ఇన్ని చేసినా, అందరూ స్టార్ హీరోయిన్లు అవుతారా ? అంటే అది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంఅలా అందం, అభినయంతో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగింది అలనాటి నటి రాధ. ఈమె సోదరి అంబిక కూడా హీరోయిన్గా రాణించారు. అయితే రాధ వివాహానంతరం నటనకు స్వస్తి పలికారు. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లు ఇద్దరూ తల్లి బాటలోనే పయనించే ప్రయత్నం చేశారు. పెద్ద కూతురు కార్తీక.. జీవాకు జంటగా నటించిన కో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే తొలి చిత్రం తరువాత మంచి విజయాలు లేక కనుమరుగయ్యారు. అలా కనిపించి ఇలా కనుమరుగురాధ రెండవ కూతురు తులసి 14 ఏళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేశారు. అయితే తొలి చిత్రంతోనే అపజయాన్ని చవి చూసింది. దీంతో ఈమె కూడా తిరుగు టపా కట్టాల్సి వచ్చింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ వారసురాళ్లు సినిమా రంగంలో నిలదొక్కుకోకపోవడం ఆశ్చర్యమే. ఆ మధ్య కార్తీక వివాహం జరిగింది. ఆ సమయంలో తులసి రూపం చూసి తనేనా? అని ఆశ్యర్యపోయారు. బొద్దుగా తులసితాజాగా భారీకాయంతో ఉన్న తులసి ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంకా పెళ్లి కాని ఈ అమ్మడి వయసు 28 ఏళ్లే. నటి రాధ వివాహానంతరం బరువు పెరిగితే, ఆమె కూతురు పెళ్లికి ముందే ఇలా బరువు పెరగడంతో తనకేమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు. Tulasi Nair ( Radha 's Daughter & Kadal Movie Heroine ) Now And Then ! pic.twitter.com/EOassELTJ2— TamilaninCinema Akilan (@TamilaninCinema) December 8, 2025 -
Thulasi Nair: హీరోయిన్ రాధ చిన్న కూతురు ఇలా అయిపోయిందేంటి? (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?
ఈమెది సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ. తండ్రికి ఇండస్ట్రీతో సంబంధం లేదు కానీ తల్లి మాత్రం ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. తల్లి, అక్కతో పోలిస్తే.. ఈ బ్యూటీ అనుకోకుండా హీరోయిన్గా మారింది. జస్ట్ రెండంటే రెండు చిత్రాల్లోనే నటించింది. ఇప్పుడేమో సడన్‌గా ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు తులసి నాయర్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే? సమయానికి గుర్తు రావడం లేదే అనుకుంటున్నారా.. కంగారు పడొద్దు. కాస్త మెల్లగా ఈ ఆర్టికల్ చదివేయండి. ఎవరో ఏంటో మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకప్పటి తెలుగు హీరోయిన్ రాధ గుర్తుందా? హా అవును ఆమెకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కదా! అందులో చినమ్మాయే తులసి. (ఇదీ చదవండి: నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?) రాధ పెద్ద కూతురు కార్తీక.. నాగచైతన్య 'జోష్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. కాకపోతే 'రంగం' సినిమా తర్వాత తమిళంలోనూ ఎక్కువగా మూవీస్ చేసింది. అయితే తులసి మాత్రం అనుకోకుండా హీరోయిన్ అయింది. యాక్టింగ్ అంటే ఈమెకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ సుహాసిని చూసి.. మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వమని చెప్పింది. అలా 'కాదల్' మూవీతో హీరోయిన్ అయ్యింది. దీన్ని 'కడలి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ రెండు భాషల్లోనూ ఇంప్రెస్ చేయలేకపోయింది. దీని తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది. దీన్ని 'రంగం 2' పేరు తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అస్సలు కలిసి రాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయింది. రీసెంట్గా అక్క కార్తీక పెళ్లిలో తులసి కనిపించింది. కాస్త బొద్దుగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, తొలుత ఈమెని గుర్తుపట్టలేకపోయారు. తర్వాత ఈమె, ఆమె అని తెలిసి అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) View this post on Instagram A post shared by Thulasi Nair (@thulasin) -
సీక్వెల్ కాదు!
జీవా, తులసీ నాయర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘యాన్’. సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ దర్శకుడిగా పరిచయ మైన ఈ చిత్రాన్ని ‘రంగం -2’గా నిర్మాత ఎ.ఎన్.బాలాజీ తెలుగులోకి రిలీజ్ చేస్త్తున్నారు. సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటల్ని త్వరలో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘రంగం’ చిత్ర విజయంలో హ్యారీస్ జైరాజ్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికీ మంచి పాటలు కుదిరాయి. వెన్నెలకంటి సాహిత్యం అందించారు. ‘రంగం’కి ఇది సీక్వెల్ కాదు’’ అన్నారు. నాజర్, జయప్రకాశ్, ఊర్మిళ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: జస్రాజ్ ప్రొడక్షన్స్. -
అలాంటి గ్లామర్‌ను అంగీకరించను
వారసులకు అవకాశాలు వరించడం అనేది సులభమే.ఏమయినా ప్రతిభ ఒక్కటే చాలదు అదృష్టం తోడవ్వాలి. అలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్న వారసులు కార్తీక, తులసి. ఈ ఇద్దరు ఒక నాటి గ్లామర్ క్వీన్ రాధ కూతుళ్లన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వీళ్లు ఇప్పటికే హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. నటి కార్తీక నాలుగైదు చిత్రాలు చేసినా, కో చిత్రంతో విజయం ఖాతాను ఓపెన్ చేసుకున్నా, మలి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆమె చెల్లెలు తులసి సక్సెస్ బోణీ కోసం ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం జీవాతో జతకట్టిన యాన్ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమ్మ పేరుకు భగం రాకూడదని భావిస్తున్న తులసితో చిన్న ఇంటర్వ్యూ. యాన్ చిత్ర అవకాశం ఎలా వచ్చింది? యాన్ చిత్రంలో హీరోయిన్ పాత్రకు నేను పర్ఫెక్ట్గా ఉంటానని దర్శకుడు రవి.కె.చంద్రన్ భావించినట్లు తెలిపారు. అమ్మ మొదట కథ విన్నారు. చాలా బాగుందనిపించింది.అందుకే పదవ తరగతి పరీక్షలు కూడా రాయకుండా యాన్ చిత్రంలో నటించాను. చిత్రంలో మీ పాత్ర గురించి? ఇందులో నేను నాజర్ కూతురిగా నటించాను. నా పాత్ర హీరోకు దీటుగా ఉంటుంది. ఈ చిత్ర పాటల్లో సరికొత్త కాస్ట్యూమ్స్ ధరించి నటించాను. విదేశాలలో చిత్రీకరించిన ఈ పాటల్లో సరికొత్త తులసిని చూస్తారు. హీరో జీవా గురించి? ఆయన ఇంతకు ముందే అక్క కార్తీకతో కో చిత్రంలో నటించారు. ఆయన షూటింగ్ స్పాట్లో చాలా టిప్స్ చెప్పేవారు. మొదట్లో జీవాతో కలిసి నటించడానికి కాస్త తడబడ్డాను. ఎందుకంటే ఆయన అనుభవమున్నహీరో. నాకిది రెండో చిత్రమే కదా. తొలి చిత్రం కడల్ అపజయం నిరాశపరచిందా? అలాగని చెప్పలేను. నిజం చెప్పాలంటే తొలి చిత్రమే నాకు పెద్ద చిరునామా నిచ్చింది. నటి రాధ కూతురన్న ప్లస్ పాయింట్ ఒక పక్క ఉన్నా మణిరత్నం పరిచయం చేసిన హీరోయిన్ అన్న ఘనత నాకు దక్కింది. ఆయన ఊహించి నంతగా నేనూ నటించాను. మణిరత్నం, గౌతమ్ కార్తిక్, ఎ.ఆర్.రెహ్మాన్ కాంబినేషన్ నన్ను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. కథలు ఓకే చేయడం మీ అమ్మనే నటగా? అదేమీకాదు. కథలు అమ్మ, నేను ఇద్దరం వింటాం. అయితే తుది నిర్ణయం నువ్వే తీసుకో అని అమ్మ చెబుతుంది. ఇప్పుడు అక్క కార్తీక సహకారం తోడయ్యింది. మేకప్, మేనరిజం, కాస్ట్యూమ్స్, నటన ఇలా చాలా విషయాల్లో అక్క టిప్స్ చెబుతుంటుంది. గ్లామర్‌లో మీ అమ్మ ఆంక్షలుంటాయట? అలాంటిదేమీ లేదు. కథను బట్టి గ్లామర్ పరంగా ఎంత దూరం వెళ్లవచ్చు అని కూడా ఆలోచిస్తాను. కడల్ చిత్రంలో ముద్దు సన్నివేశంలో కూడా హద్దులు మీరలేదు. అనవసర గ్లామర్ ప్రదర్శనను అంగీకరించను. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. సినిమాలో నటించడం అనేది ఒక ఫ్యాషన్. దాన్ని అందంగా అభిమానిస్తూ చేసుకుపోవాలని ఆశిస్తున్నాను. ష్కూటింగ్ స్పాట్లో కూడా అమ్మ, నాన్న ఎవరూ నా నటన విషయంలో తలదూర్చరు.


