గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈ బ్యూటీ అక్క, తల్లి కూడా హీరోయిన్లే.. ఈమె మాత్రం ఇప్పుడిలా!

Published Sat, Dec 2 2023 9:08 PM

Actress Thulasi Nair Present Pics And Details - Sakshi

ఈమెది సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ. తండ్రికి ఇండస్ట్రీతో సంబంధం లేదు కానీ తల్లి మాత్రం ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. తల్లి, అక్కతో పోలిస్తే.. ఈ బ్యూటీ అనుకోకుండా హీరోయిన్‌గా మారింది. జస్ట్ రెండంటే రెండు చిత్రాల్లోనే నటించింది. ఇప్పుడేమో సడన్‌గా ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు తులసి నాయర్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే? సమయానికి గుర్తు రావడం లేదే అనుకుంటున్నారా.. కంగారు పడొద్దు. కాస్త మెల్లగా ఈ ఆర్టికల్ చదివేయండి. ఎవరో ఏంటో మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకప్పటి తెలుగు హీరోయిన్ రాధ గుర్తుందా? హా అవును ఆమెకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కదా! అందులో చినమ్మాయే తులసి.

(ఇదీ చదవండి: నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?)

రాధ పెద్ద కూతురు కార్తీక.. నాగచైతన్య 'జోష్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. కాకపోతే 'రంగం' సినిమా తర్వాత తమిళంలోనూ ఎక్కువగా మూవీస్ చేసింది. అయితే తులసి మాత్రం అనుకోకుండా హీరోయిన్ అయింది. యాక్టింగ్ అంటే ఈమెకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ సుహాసిని చూసి.. మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వమని చెప్పింది. అలా 'కాదల్' మూవీతో హీరోయిన్ అయ్యింది. దీన్ని 'కడలి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ రెండు భాషల్లోనూ ఇంప్రెస్ చేయలేకపోయింది.

దీని తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది. దీన్ని 'రంగం 2' పేరు తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అస్సలు కలిసి రాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయింది. రీసెంట్‌గా అక్క కార్తీక పెళ్లిలో తులసి కనిపించింది. కాస్త బొద్దుగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, తొలుత ఈమెని గుర్తుపట్టలేకపోయారు. తర్వాత ఈమె, ఆమె అని తెలిసి అవాక్కయ్యారు.

(ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?)

Advertisement

తప్పక చదవండి

Advertisement